Skip to main content

Posts

ముఖ్య మంత్రి గారి వాస్తు భయం

మన ముఖ్య మంత్రి గారికి వాస్తు భయం బాగా పట్టుకుంది.మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి (దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) నాలుగేళ్ల క్రితం కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం (లేక్ వ్యూ గెస్ట్ హౌస్) కు వాస్తు దోషం ఉందని,అందుకే ఆయన కు అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ. (ఆనాడు వై.యస్.ఆర్. కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు (విద్వంసులు) ఈ తాజావాస్తు సువార్తను ఏమంటారో!)  ఈ తాజా వాస్తు ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి,మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించి వారి సలహాలతో శ్రీ రోశియ్య గారు దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు.రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు. వాస్తు హోమాలు, శాంతి పూజలు చేసి చివరికి శ్రీమాన్ రోశియ్య గారు క్యాంపు ఆఫీసు లో 'కుడి కాలు' పెట్టారు. 'ఎడమ కాలు' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే ఈ క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. అడ్డగోలుగా అన్ని లక్షలు పెట్టి వాస్తు రిపేరులు చేసిన తరువాత కుడా రోశియ్య గారికి ఇంకా వాస్తు భయం వదలక పోవటం ఆయన పిరికితనా...

అపార్ట్ మెంట్స్ లో వాస్తు గోల !

గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి , నగరాలలో పట్టణాలలో స్థలాన్ని , ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్స్ కు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది . ఈ వాస్తు వల్ల నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి . ఈ అపార్ట్ మెంట్స్ కు మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు . ఈ నాడు బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్ మెంట్స్ దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ లో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి . నేడు కోట్లాది మంది ఈ అపార్ట్ మెంట్స్ లో నిక్షేపం గా జివిస్తున్నారన్నది పరమ సత్యం . వారందరికి కలగని కస్టనష్టాలు మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు . ఈ ఆధునిక గృహాలకి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవటం విజ్ఞత ఎంత మాత్రం ఆగ్నేయం . ఆ గ్నేయం లో అగ్ని అని కిచెన్ , నైరుతిలో బరువు అని మాస్టర్ బెడ్ రూం , ఈశాన్యమ్ నడక అని డోర్లు ... ఇవే వాస్తు అనే వారి మాటలకు విలువ ఇచ్చి కోరి కస్టాలు కొని తెచ్చుకోకండి . నిజ...

సంఘాల పై అజమాయిషీ !!!

సోసైటిల పై అజమాయిషీ !!! ఐదుగురుంటే చాలు ( కేవలం కుటుంబ సభ్యులే ) ఒక సంఘాన్నిఎంచక్కా పెట్టి ,దాన్ని రిజిస్టర్ చేసి,దాని ముసుగులో వారి పనులన్నీ చక్కబెట్టుకునే ఈ రోజులల్లో వీటిపై ప్రభుత్వ అజమాయిషీ తప్పనిసరిగా ఉండాలిసిందే. వాటి జామా ఖర్చుల విషయాలపై పారదర్సకత ఉండాలి. కుటుంబ ఆస్తులకు రక్షణ కు ,విద్యా వ్యాపారాలకు మార్గం గాను, పన్ను ఎగవేతకు ఉపకరణం గాను, మత /సామాజక సేవల పేరుతొ విరాళాలు పోగుచేసుకోవటానికి ఈ నాడు అనేక సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో రోజు రోజుకి వెలుస్తున్న ఇంజనీరింగ్ కాలేజిలే. వీటి ఆస్తిపాస్తులపైన, కార్యకలాపాల పైన నిఘా ఉండాలి కదా? అవకతవకలు ఉంటే వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకొని చక్కదిద్దాలి. అనవసర జ్యోక్యం లేకుండా చట్ట సవరణ జరగాలి. నిజంగా సామాజక సేవ చేసే సంస్థలను ప్రోత్సహించాలి, దోపిడీ చేసేవాటిని కట్టడి చేయాలి. దీనిపై సమగ్ర చర్చ జరగిన తరువాతే శాసన సభలో బిల్లు ఆమోదం పొందాలి. ఈ విషయం లో జే పి గారి ఆవేదన అందరు అర్ధం చేసుకోవాలిసిందే. కాని ప్రభుత్వ అజామాయిషి వద్దనటం సరికాదు.రాజ్యంగా పరిధిలో నే ఈ సోసైటిల పై నియంత్రణ ఉండాలి.

తస్మా జాగ్రత్త !

చేతికి కడియం  నుదిటిన బొట్టు  వాస్తు,జ్యోస్యాల వ్యాపారాల్లో  పగటి వేషగాళ్ళు !  కొంపలు కూల్చే  దైవజ్ఞ, వాస్తు రత్న  కిరీట చోర సిఖామణులున్నారు  తస్మా ఇల్లు జాగ్రత్త!  దిక్కు తెలియక  దిక్సూచి పట్టాడు  కోటి విద్యలు  కూటి కొరకేగా !  ఇల్లు పీకీ  పందిరి వెయ్యి ...  వాస్తు వాగేవాడికి  వినేవాడు వెంగలాయి !!!

కొత్త ఒక వింత - పాత ఒక రోత !

చైనా వాస్తు -ఫెంగ్ షుయి వాస్తు విద్వాంసుల విధ్వంసంతో కుదేలైన జనం చైనా వారి సాంప్రదాయక మర్మ కళ 'ఫెంగ్ షుయి' వెంట పరుగులు పెడుతున్నారు. చైనా భాషలో ఫెంగ్ షుయి - అంటే.. గాలి - నీరు అని అర్థం. మనిషి మనుగడకు గాలి, నీరు కు ఉన్నంత ప్రాముఖ్యత ను గుర్తించి వాటిని ఇంటికి కుడా వర్తింపజేయాలనే సూత్రాన్ని ఆధారం చేసుకొని రూపొందించినదే ఈ చైనా వాస్తు. ఈ నాడు ఇది రకరకాల పోకడలతో క్రొత్త పుంతలు త్రొక్కుతూ ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తూ ఒక గాలి ధుమారం వలె మన దేశంలోకి ప్రవేశించింది. రకరకాల తాయెత్తులు, వాస్తు యంత్రాలు, దిష్టి పిడతలు వంటి మన ప్రాచీన దేశీయ పద్దతుల స్థానే చైనా వారి చిట్కాలు, చిత్రాలు, చిందులు మార్కెట్టులోకి వచ్చాయి. నవ్వే బుద్దుడి బొమ్మ ఉంటే ... సిరులు ఇంటిలోకి నవ్వుతూ నడచి వస్తాయట ! అలాగే ... మూడు కాళ్ళ కప్ప బొమ్మ, డ్రాగెన్,తెల్ల పులి,నల్ల తాబేలు వంటి చిత్ర విచిత్ర జంతువుల బొమ్మలు ఇంటిలోఉంచుకుంటే శుభమట. విండ్ చిమ్స్ ,వెదురు పుల్లలు, చేపలు, తాబేళ్లు... ఇలా చైనా వాళ్ల నమ్మకాలను పాటించి ,వారి వస్తువులతో ఇంటిని నింపుకుంటే వాస్తు దోషాలుతొలగి అంతా మంచే జరుగుతుందట!! ఇలా జర...

తీర్దయాత్రలకు ప్రజల సొమ్మా?

జెరూసలెం కు వెళ్ళే క్రిస్టియన్ మత విశ్వాసులకి ఆంద్ర ప్రదేశ్  రాష్ట్ర  ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయం అందిచరాదని రాష్ట్ర హై కోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వటం హర్షనీయం . ఈ తీర్పు   మత విశ్వాసాలతో రాజకీయాలు చేసే నాయకులకు చెంప దెబ్బ . ఇస్లాం మతస్తులకు హజ్/ మక్కా యాత్రలకు కేంద్ర  ప్రభుత్వ సహాయం ఉన్నదన్న సాకుతో ఇప్పుడు  కొత్తగా  క్రిస్టియన్స్ కి విదేశాలకు మత యాత్రల పేరుతొ షికార్లు వెళ్ళటానికి ప్రజాధనం ఖర్చు పెట్టటానికి  YSR పూనుకున్నారు. ఇది  ముమ్మాటికి తప్పే .  అంతర్లినంగా YSR కు ఉన్న క్రైస్తవ మతాభిమానాన్ని ఇలా నిస్సుగ్గుగా  బయట పెట్టుకున్నాడు . విమర్శలు చుట్టుముట్టేసరికి తాజాగా కొత్త పల్లవి అందుకున్నాడు.  అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు... హిందువులకు కుడా మానసరోవరమ్ యాత్రలకు ఆర్దిక సహాయం చేస్తామనటం  నీ తిమాలిన పని . మతాన్ని,రాజ్యాన్ని వేరుగా ఉంచటమే నిజమైన లోకికవాదం అవు తుంది . అన్ని మతాల వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్దిక సహాయాలను నిలిపి వేయాలి .మత వ్యవహారాలల...

శ్రీ వా నీ లు

శ్రీ నివాస్ వా స్తు నీ తు లు నేలకు కులం   వాస్తు రాజ్యాంగంలో   రంగు , రుచి , వాసన చూచి   రిజర్వేషన్లు !!   వరదలు, వడదెబ్బలు   కాచుకున్న ఇల్లు  వాస్తు గాలికి  కుప్ప కూలింది ! వాలు ,వీలు   గాలి, వెలుగు ఉంటే  ఇంటికి వాస్తుతో పనేముంది? రోగాలు, రోస్టులకు   వాస్తు వైద్యం !   దవాఖనాలెందుకు దండుగ ?   ఆలిఫై అనుమానం   ఇంటిఫై శంక   రోగం ఒక్కటే   మందు తినాలి తూర్పు పడమర బొమ్మా బొరుసు యెదై తేనేమి విలువ ఒక్కటే ! ప్రపంచమంతా వాస్తు మయం వెర్రివాడికి క్రొత్త కళ్ళజోడు ! ఇంటి కొలతలకు వాస్తు గణితం అంకెల గారడిలో రెండు రెళ్ళు ఆరు !