సినిమా హీరొ రంగనాథ్ గారు మంచి నటుడే కాక మంచి కవి.వారి ఆకస్మిక నిష్కక్రమణ చాలా విచారకరం . వారు ABN ఆంద్ర జ్యోతి లో ఓపెన్ విత్ R.K తో ముచ్చటిస్తూ మనిషికి మరణం మూడు విధాలు అంటూ, ఆత్మహత్య పిరికితనం అని, ప్రాణ త్యాగం వీరత్వం అని, జీవసమాది పరిపూర్ణవత్వం అన్న వ్యక్తి తుదకు వంటరి తత్వం భరించలేక ఆత్మహత్య చేసుకొన్నాడు. అది ఆత్మహత్య అయినా బహుశ ఆయన దృష్టిలో జీవ సమాదే నిజానికి జీవ సమాధి కుడా ఆత్మహత్యే . హిందూ మతం లో సజీవ సమాధి, జైన మతంలో సంతారా (సల్లేఖన) వంటి వాటిలో దేహ త్యాగం చేయటం భక్తికి పరాకాష్టగా భావిస్తారు. అయితే ఇలా ప్రాణ త్యాగం నేరంగా పరిగణించి మన ప్రభుత్వం వీటిని నిషేదించింది. హేతు భావాలున్న ఆస్తిక రంగనాథ్ గారు ఆ రోజు దేవునిపై వినిపించిన కవిత ఎవరు దేవుడు ?