మన సిమాంద్ర లో 7 మే 2014 న నూతన రాష్ట్ర నికి , అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికలు వస్తున్నాయి. ఈ బ్లాగు లోకం లో ఎంతో మంది రచయుతలు, మేధావులు ఎన్నో రకాల అంశాలపై వ్యాసాలూ రాస్తున్నారు. కామెంట్ల ద్వారా చాలా విషయాలపై అభిప్రాయాలు చెప్పుతున్నారు. కొందరు మాత్రమె కుటిల రాజకీయాలపై ఆసక్తితో, పక్షపాత దోరణి తో బ్లాగు ముసుగులో ఓటర్లకు సలహాలు ఇస్తుంటే మరికొందరు ఆవేమి పట్టనట్టు మిన్నకుండి పోతున్నారు. స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం. దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి. స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా ఇంకా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు. ప్రజలు బిచ్చగాళ్ళ వాలే మారారు. అవినీతి, లంచగొండి తనం రెండు కళ్ళు గా మారాయి. ఇలాంటి తరుణం లో మనం స్పందించకుండా ఉంటె చెడు గెలిచే ప్రమాదం ఉంది. ఆతరువాత వగచి ప్రయోజనం ఉండదు. చెడ్డ వాడి దౌర...