Skip to main content

Posts

Showing posts from June, 2010

జ్యోతిష్యం-నవ గ్రహాలూ

జ్యోతిష్యాని ప్రాణం పోసే నగ్రహాల గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలిసిన విషయాలు ఉన్నాయి . వాటిలో ముఖ్య మైన వాటిని కొద్దిగా పట్టి చూద్దాం . 01 ) నవ గ్రహాలుగా పిలవబడే వాటిలో గ్రహాలు నిజంగా ఎన్ని ? 02 ) ఈ గ్రహాలు జడములా ? చైతన్యములా ? 03 ) పురాణాలలో నవగ్రహాల వర్ణన ఎలా ఉంది ? ఈ గ్రహాల మద్య ఉన్న సంభంద బాధవ్యాలు ఏమిటి ? 04 ) ప్రాణం ఉన్న జీవుల వలె ఈ గ్రహాల మధ్య మిత్రత్వం , శత్రుత్వం ఉంటాయా ? వీటికి రాగ ద్వేషాలు ఉన్నాయా ? 05 ) నవ గ్రహాల శాంతి కొరకు గ్రహ దానం , జపములు , పూజలు చేస్తే వాటి శక్తి / బలం తగ్గించటం , జాతకాన్ని సరి చేయటం వాస్తవమేనా ? 06 ) నవగ్రహ పూజలు చేసేవారు గ్రహాలను నేటి వైజ్ఞానికుల అభిప్రాయాలతో ఎకిభవిస్తారా ? 07 ) నవ రత్నాలకు , నవ గ్రహాలకు ఉన్న సంభంధం ఏమిటి ? 08 ) అంకెలకు ఈ గ్రహాలతో ఏమైనా లంకె ఉన్నదా ? 09 ) గ్రహాలకు - బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర కులాలకు ఏమిటి సంభంధం ?

జ్యోతిష్యం పై పెద్దలేమన్నారు? పార్ట్ 2

" ఎవరో చెప్పారనో .. వెనకటి నుండి వస్తున్న ఆచారమనో , లేక నీ అంతటకు నీవే ఉహించుకునో ఎ విషయాన్ని గుడ్డిగా నమ్మకు . గురువు పై నమ్మకం ఉన్నా కుడా , ఆయన చెప్పిన విషయాలు మూడం గా ఆచరించకు . సూక్ష్మం గా పరిశీలించి , క్షుణ్ణం గా విశ్లేషించి సర్వ మానవాళి కి శ్రేయస్సును కాక్షించే సూత్రాన్ని మాత్రమే విశ్వసించు . దానినే పాటించు . అదే మార్గంలో పయనించు ." --- గౌతమ బుద్ద " జ్యోతిష్యం పై పెద్దలేమన్నారు " అనే వ్యాసంలో నేను ఉదహరించిన పెద్దల పలుకులకు ఆధారాలను గురించి చెప్పమని కొంతమంది కామెంట్స్ లో రాసారు . అలాగే నేను కొంతమంది ఆస్తిక ప్రముఖుల అభిప్రాయాన్ని ప్రస్తావించటం కుడా వారికి నచ్చినట్లు లేదు . అందుకే బుద్దుని పై పలుకులు ఇక్కడ మరో సారి మనం చేసుకొని అసలు విషయానికి వద్దాము . జ్యోతిష్యం ఆస్తిక వాదానికి వేతిరేకమని , అది దైవాన్ని , కర్మ సిద్దాంతాన్ని తప్పు గా చేపుతుందన్న ఆస్తిక ప్రముఖులు మాటలను ఉదాహరించటం జరిగింది . ఇది ఆస్తిక ముసుగులో దాగిఉన్న మూఢ విశ్వాసమని స్వామి వివేకానంద , స్వా...

జ్యోతిష్యం ప్రసాదించే యోగాలు ఏమిటి ? ( పార్ట్-2 )

సంతాన యోగం : జాతక ఫలాలలో ఇది ఒక ముఖ్య అంశం . దంపతులలో పురుషుని జాతక రీత్యా అతనికి కలగబోయే సంతానం గురించి చెపుతారా ? అతని బార్య జాతక ఫలం చూసి చెపుతారా ? బార్యా భర్తల ఇద్దరి జాతకాలలో ఒకే విధమైన సంతాన యోగం ఉంటుందా ? అలా లేకపోతే సంతానం ఎలా లెక్కిస్తారు ? కుటుంభ నియంత్రణ పాటించే దంపతుల మాటేమిటి ? అలాగే వైద్యుల సలహాలతో పిల్లలను కనేవారి జాతకాలు ఎలా ఉంటాయో చెప్పగలరా ? బహు బార్యలు గల వ్యక్తి కి ఎ బార్య ద్వారా ఎంత మంది సంతానం కలుగుతుందో నిర్దారించ గలరా ? జాతకాన్ని బట్టి ఒకనికి పుట్టే మొదటి బిడ్డ ఆడో , మగో కచ్చితంగా చెప్పగలరా ? జీవన యోగం: ( ఆయు ప్రమాణం) పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు . అయితే అది ఎంత కాలమనేది అనేక పరిస్థితులను బట్టి ఉంటుంది . ఒక దేశం లో మనుషుల సగటు ఆయు ప్రమాణం ఆ దేశ జీవన ప్రమాణాలపై ఆధార పడి ఉంటుందనేది శాస్త్రీయంగా చెప్పబడిన విషయం . ఈవిషయంలో జ్యోతిష్య విద్య ఏమి అంటుందో తెలుసుకోవాలి . జాతకుని ఆయు ప్రమాణం ఎలా లెక్కిస్తారు ? మన దేశంలో సగటు ఆయు ప్రమాణం పెరగటాని...

జ్యోతిష్యం ప్రసాదించే యోగాలు ఏమిటి ?

జ్యోతిష్యం లో ఫలితాలు చెప్పేటప్పుడు జాతకునికి రకరకా ల యోగాలు వస్తాయని లేదా నడుస్తున్నాయని చెపుతారు . వాటిని కొద్దిగా పట్టి చూద్దాం . వాహన యోగం : పూర్వం కాలి నడకన ప్రయాణం చేసే జనానికి గుర్రమో , గాడిదో లభిస్తే , లేదా రాజు గారి కొలువులో వాహనాల పై తిరిగే నౌకరి దొరికితేనో వచ్చేదే ఈ వాహన యోగం . ఈ నాడు ప్రతి వారు స్వంతంగా సైకిలో , బైకో , కారో కొనుక్కుంటున్నారు . లేదా అద్దెకో , అరువుకో వాహనాల పై ప్రయాణించేవారు , బస్సులోనో , రైలులోనో , విమానం లోనో వెళ్ళే వారందరికీ గ్రహాలూ వాహన యోగం చాల ఉదారంగా ప్రసాదిస్తునాయన్న మాట . నిజానికి మనుషులందరికీ వాహన యోగం ప్రసాదించినది ఈనాడు మనం సంపార్జించిన సాంకేతిక విజ్ఞామే కాని గ్రహాల దయ ఏమి లేదన్నది మనం అంగికరించ వలిసిన పచ్చి నిజం . జ్యోతిష్యం చెప్పే వాహన యోగం మరి ఈ నాడు ఎలా అన్వహిస్తుందో దైవజ్ఞులు సెలవియ్యాలి . ప్రవాస యోగం : ఉన్న ఊరిలొ బతకలేక , కస్టాలు పడలేక బార్య బిడ్డలను , కుటుంభాన్ని వదిలి పరదేశాలకు వెళ్ళే దౌర్బాగ్య స్థితిని జ్యోతిష్యం లో ప్రవాస యోగం గా చె...