వందల కోట్లు ఖర్చు పెట్టి 2015, జూన్ 14 నుండి మొదలైయే గోదావరి పుష్కరాలను దేశంలోనే ఘనంగా జరపాలని రెండు తెలుగు రాష్ట్రాలు ప్రణాళికలు సిద్దం చేసాయి. వచ్చే ఏడాది మరల కృష్ణానదికి పుష్కారాలు వస్తాయి. 12 ఎండ్లకోకసారి పుష్కారాల పేరుతో ప్రజాధనం నీటిపాలు అయ్యే ఈ 'కుంభ మేళాలు' నిజంగా ఎందుకోసమో ఎవరి కోసమో పరిశీలిద్దాం. ముందుగా గురు పంచాంగం గురించి తెలుసుకుందాం. మన దేశంలో కాలాన్ని గణించటానికి సూర్యమానం, చంద్రమానం లతో పాటు కొన్ని ప్రాంతాలలో బృహస్పతి మానం కుడా ఉపయోగించారు. బృహస్పతి మానం అంటే బృహస్పతి గ్రహగతులను బట్టి కాలాన్ని లెక్కించటం. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురుడు అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం గురుడు భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. దీనిని బట్టి మనకు 12 సంవత్సరాలు కాలం దేవతలకు ఒక దినం అనే ఒక నమ్మకాన్ని పుట్టించారు. ప్రజల దినసరి కాలగణనకు బృహస్పతి మానం (దేవతల మానం) పనికిరాదు కాబట్టి అది వ్యవహారంలో లేకుండా పోయింది. అయితే దాని అవశేషం మా...