Skip to main content

Posts

Showing posts from April, 2012

వాస్తు పై సదస్సు

22  - 04  -2012  న ఒంగోలు లో జిల్లా హేతువాద సంఘం శ్రీ నార్నే వెంకట  సుబ్బయ్య గారి పర్యవేక్షణ లో వాస్తు,జ్యోతిష్యాల పై సదస్సు జరిగింది.  ఈ సభ లో వాస్తు - వాస్తవాలు  పై ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్, ప్రధాన ప్రసంగం చేసారు. వాస్తు మన ప్రాచీన గృహ నిర్మాణ శాస్త్రం అని , అది నేటి నవీన నిర్మాణాలలో పనికి రాదనీ చెప్పారు. మన ఆర్దిక,ఆరోగ్య ,అనుబంధాల పై వాస్తు ప్రభావం లేదని అన్నారు. వాస్తు పేరుతో నేడు అనేక అబద్దాలు,అతిశయోక్తులు ప్రచారంలో ఉన్నాయని  అన్నారు. వాటిని నిజమని నమ్మి అనేకమంది అవగాహనా రాహిత్యం తో ఇల్లు గుల్ల చేసుకొని ఆర్దికంగా చితికి  పోతున్నారని చెప్పారు. జ్యోతిష్యం పై కుర్రా హనుమంతరావు,మేడూరి సత్యనారాయణ గారు ప్రసంగించారు.ఇదే సభలో పసల  భీమన్న గారు మేజిక్ షో చేసారు. అనేకమంది హేతువాద మిత్రులు ఈ సభకు వచ్చారు. ఒంగోలు లో వాస్తు పై జరిగిన సదస్సు లో ప్రసంగిస్తున్న కొడాలి శ్రీనివాస్