Skip to main content

Posts

Showing posts with the label హిత వచనాలు

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

జ్యోస్యం - నిజానిజాలు

"జ్యోతిష్యం నిజంగా జరుగుతుందని భావిస్తే ... దాన్ని నిప్పుల్లో వేయి, అది అబద్దాల పుట్ట అని తలిస్తే ... దాన్ని నీళ్ళలో వేసేయండి" అని బృహత్ సంహిత/బృహత్ జాతక వంటి గ్రంధాలకు వ్యాఖ్యానం రాసిన భటోత్పలడు జ్యోతిష్యం గురించి చెప్పాడు.  జాతక ఫలితాలు నిజమౌతాయని ప్రజలు తలిస్తే మనుషులు నిర్విరులు అవుతారు,కార్యాశక్తిని కోల్పోయి సోమరులుగా తయారౌతారు. సమాజం భయాందోళనలతో జీవిస్తుంది. అరాచకం, అశాంతి ప్రబులుతుంది. ఇన్ని అనర్దాలు కల్పించే దిన్ని ఆనవాళ్ళు కానరాకుండా నిప్పుల్లో వేసి తగలపెట్టాలి. అలా కాదు జ్యోతిష్యం ఎప్పుడు నిజం కాదు, అబద్దాల పుట్టని భావిస్తే దానివల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం కలగదు. కేవలం కాలహరణ చేసే ఈ విద్య అమాయకులను మభ్యపెట్ట టానికి, ప్రజలను దోచుకోవటానికి మాత్రమే పనికివస్తుంది. కాబట్టి ఈ అబద్దాల రాతలు కనిపించకుండా దాన్ని నీటిలో వేయండి.  ఏతా వాతా చెప్పేదేమంటే సమాజహితం కోరేవారు వెనకా ముందు ఆలోచించకుండా జ్యోతిష్యాన్ని తక్షణమే తుదముట్టించాలి.

మతం గురించి స్వామీ వివేకానంద

దార్శినికుడు స్వామీ  వివేకానంద  ఎ  విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. వారు ఎ మతం అయినా శాస్త్రీయ పరిశోధనలలో నిలబడి తనను తాను  ఋజువు చేసుకోవాలని భావించారు.  మతం గురించి స్వామీ వివేకానంద చెప్పిన మాటలు ... "ఏ హేతుబద్ద  పరిశీలన వల్ల కనుగొనబడ్డ విషయాలు ప్రతి విజ్ఞాన శాస్త్రాన్ని ఋజువు చేయాటానికి కారణభూతం అవుతున్నాయో అలాంటి వాటి సహాయంతో   మతము నిరుపించబడాలా?  దీనికి అవుననే నా అభిప్రాయం ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది.  అలాంటి పరిశొధనలవల్ల మతం నశించే పక్షంలో ,ఇంత కాలం అది నిష్ర్పయోజనమైన ,అనుచితమైన అందవిశ్వాసమే అని తెలుస్తుంది. కాబట్టి అదెంత త్వరగా నశిస్తే అంత మంచిది. అది పోవటం కంటే మేలైన పని సమాజానికి మరొకటి ఉండబోదని నా నిశ్చితాభిప్రాయం.  పనికిమాలినదంతా  పోతుందనడం నిస్సందేహం "

తెలుగువారిపై ఎందుకు ఈ వివక్ష?

తపాల బిళ్ళ అనేది ఒక జాతి కీర్తి పతాకం. ఒక గౌరవ చిహ్నం. చరిత్రకు దర్పణం. తమ జాతిసంస్కృతి,సాంప్రదాయాలు ,వేష భాషలు , కళలపైన, పశుపక్షాదులపైన,  వైతాళికులు,నాయకులపైన గొప్పగా  ప్రత్యేక తపాలా బిళ్లలను ఆయా దేశాలు వారు ముద్రిస్తారు.  వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాలబిళ్ళల సేకరణకారులు ఆయా ప్రజల చరిత్రను వైభవాన్ని తెలుసుకుంటారు. మరి మన తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి మన దేశపు తపాలా బిళ్ళలు దర్పణం పడుతున్నాయా అన్నది ప్రశ్నార్ధకమే. మన పోస్టల్ శాఖ వారు వెలువరించిన తపాల బిళ్ళల గురించి తెలుసుకుంటే ఈ విషయంలో మన తెలుగువారిపై ఎంత వివక్ష ఉన్నదో అవగతం అవుతుంది.  భారత   ప్రభుత్వం   ఇప్పటి   వరకు   వెలువరించిన   షుమారు   2550   స్టాంప్స్   లో   తెలుగు   వారి   పైన ,  తెలుగు జాతి  సంస్కృతి   పైన విడుదల   చేసిన తపాలా బిళ్లలు    కేవలం   50  లోపు  మాత్రమే.  విడుదల అయిన ఈ తపా...

ఎవరు దేవుడు ?

  సినిమా హీరొ రంగనాథ్ గారు మంచి నటుడే కాక మంచి కవి.వారి ఆకస్మిక నిష్కక్రమణ చాలా విచారకరం . వారు ABN ఆంద్ర జ్యోతి లో  ఓపెన్ విత్ R.K తో ముచ్చటిస్తూ మనిషికి మరణం మూడు విధాలు అంటూ, ఆత్మహత్య పిరికితనం అని, ప్రాణ త్యాగం వీరత్వం అని, జీవసమాది పరిపూర్ణవత్వం అన్న వ్యక్తి తుదకు వంటరి తత్వం భరించలేక  ఆత్మహత్య చేసుకొన్నాడు. అది ఆత్మహత్య అయినా బహుశ  ఆయన దృష్టిలో జీవ సమాదే  నిజానికి జీవ సమాధి కుడా ఆత్మహత్యే . హిందూ మతం లో సజీవ సమాధి, జైన మతంలో సంతారా (సల్లేఖన) వంటి వాటిలో దేహ త్యాగం చేయటం భక్తికి పరాకాష్టగా భావిస్తారు. అయితే ఇలా ప్రాణ త్యాగం నేరంగా పరిగణించి మన ప్రభుత్వం వీటిని నిషేదించింది.  హేతు  భావాలున్న ఆస్తిక రంగనాథ్ గారు ఆ రోజు  దేవునిపై  వినిపించిన కవిత ఎవరు దేవుడు ?

యాగాలతో బోగాలు దొరుకుతాయా?

యాగాలతో కోరికలు తీరుతాయా? తరువాత భాగం  శ్లో!!   గ్రావోన్నజ్ఞనవత్  యజ్ఞ ఫలేపి  శృతి సత్యతా !         కాశ్రద్దా తత్రధీ వృద్దా కామాధ్వా యథ్ఖిలీకృతః !! యజ్ఞ యాగాలు చేస్తే కోరికలు సిద్ధిస్తాయని,స్వర్గబోగాలు లభిస్తాయని వేదకారులు చెబుతారు. దీనిలో సత్యం ఎంత ఉందంటే ... నీటిలో వేసిన బండరాయి తేలుతూ ఆవలి గట్టుకు చేరుతుందని చెప్పే మాటలో ఉన్నంత అని చార్వాకుల ఉవాచ. యజ్ఞ యాగాది వైదిక కర్మలు లోకంలో ప్రజల సంపదను,శ్రమను హరిస్తూ దుఃఖాన్ని,హింసను  కల్గిస్తున్నాయి. స్వలాభపరులు, వంచనాపరులు ఇలాంటి క్రతువులను పుట్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు వీరి ఉచ్చులో పడవద్దని, మంత్రాలకు చింతకాయలు రాలవని, యాగాల తో  బోగాలు దొరకవని  ఆనాడే హెచ్చరించారు.  కాలం తో పాటు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వేష భాషలు, మత విశ్వాసాలు, సమాజక కట్టుబాట్లు మారుతూ ఉంటాయి. అలా కాలంతో పాటు మారని సమాజం జడత్వం అనే జ్వరంతో బాదపడుతున్నట్లుగా భావించాలి.  ఆదిమ   సమాజంలో అగ్ని గురించిన రహస్యం తెలియదు....

యాగాలతో కోరికలు తీరుతాయా?

అక్షరం నేర్వని మాయగాడు అంగడిలో ఆడే ఆట పేరు గారడీ. మార్మిక విద్య నేర్చినవాడు మంత్రాల పేరుతో చేసేది యాగం. ఈ రెంటి వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే. ప్రజల బుద్దిని తక్కువ చేసి బురిడీ కొట్టి తమ పబ్బం గడుపుకోవటమే.   ఈ యజ్ఞ  యాగాల గుట్టు రట్టు చేస్తూ "ఆలి రంకుదెల్ప అఖిల యజ్ఞమ్ములు , తల్లి రంకుదెల్ప తద్దినములు, కాని తెరవు కర్మకాండ కల్పితమాయే" అని వేమన అంటాడు. యజ్ఞం చేసేటప్పుడు యజమాని భార్య యజ్ఞ వేదిక వద్ద ప్రస్తుతపు భర్తగాక ఇంతకు ముందు ఎవరేవతో వ్యభిచ రించిందో సూచించటానికి ఆ యజ్ఞవేదిక పై అన్ని దర్బపొచలు పెట్టాలి. దీనితో భార్య రంకుతనం తెలిసెది. అలాగే పితరులకు పిండాలు పెట్టేవారు తన తల్లికి తనేవరివల్ల పుట్టాడో అతనికే చెందేలా పిండాన్ని వదలాలి. ఈ రెండు కల్పిత కార్యక్రమాలలో ఇంటిలో గుట్టు బట్టబయలు అవుతుంది అని ప్రజాకవి వేమన వేళాకోళం చేసినా  నిజానికి  వీటి  వెనుక అంతులేని దోపిడీ తరతరాలుగా దాగి ఉందనేది నగ్న సత్యం.  యజ్ఞం  లేదా  యాగం  అనేది వేదకాలంలో విస్తృతం గా ఆచరించిన ఒక క్రతువు. మన దేశంలో...

పుష్కరాలు ఎవరి కోసం ?

వందల కోట్లు ఖర్చు పెట్టి 2015, జూన్ 14 నుండి మొదలైయే  గోదావరి పుష్కరాలను  దేశంలోనే ఘనంగా జరపాలని రెండు  తెలుగు రాష్ట్రాలు   ప్రణాళికలు సిద్దం చేసాయి. వచ్చే ఏడాది మరల కృష్ణానదికి పుష్కారాలు వస్తాయి.   12 ఎండ్లకోకసారి  పుష్కారాల పేరుతో  ప్రజాధనం నీటిపాలు అయ్యే ఈ 'కుంభ మేళాలు'  నిజంగా ఎందుకోసమో  ఎవరి కోసమో పరిశీలిద్దాం.  ముందుగా గురు పంచాంగం గురించి తెలుసుకుందాం. మన దేశంలో కాలాన్ని గణించటానికి సూర్యమానం, చంద్రమానం లతో పాటు కొన్ని ప్రాంతాలలో బృహస్పతి మానం కుడా ఉపయోగించారు. బృహస్పతి మానం అంటే బృహస్పతి గ్రహగతులను బట్టి కాలాన్ని లెక్కించటం. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురుడు అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం గురుడు భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. దీనిని బట్టి మనకు  12 సంవత్సరాలు కాలం దేవతలకు ఒక దినం అనే  ఒక నమ్మకాన్ని పుట్టించారు. ప్రజల దినసరి కాలగణనకు బృహస్పతి మానం (దేవతల మానం) పనికిరాదు కాబట్టి అది వ్యవహారంలో లేకుండా పోయింది. అయితే దాని అవశేషం మా...

సత్యమేవ జయతే

నిజం నిలకడ మీద  తెలుస్తుందని నానుడి.  సత్యమేవ జయతే అనే ఉపనిషత్ వాక్కు ని మనం రాజముద్రలో నిక్షిప్తం చేసుకొన్నాం.  అబద్దాలతో అందమైన అద్దాల మేడ కట్టిన అసత్యం రాజు ఎట్టకేలకు కటకటాలపాలు అయ్యాడు.  అత్యాస ఎంతటి వాడినైనా అదోగతిపాలు చేస్తుంది అనేదానికి తాజా ఉదాహరణ సత్యం రామలింగరాజే.  ఆర్దిక నేరాలకు సరైన శిక్షలు పడవని భావించే మోసగాళ్ళకు ఇది కనువిప్పు కావాలి.  అలాగే దొంగలను, లంచగొండులను, పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజాధనం దోచుకున్న వారిని , స్మగ్లర్లు , ఎర్ర చందనం దొంగలను, మైనింగు మాఫియా లను, మతోన్మాద తీవ్రవాదులను సమర్దించే వారిని ప్రజలు ఈసడించే రోజు కుడా త్వరలో వస్తుందని ఆశిద్దాం.  దొరికితే దొంగ అనే పాత వాదన వదిలి  సిగ్గు ఎగ్గు లేకుండా దొరికినా దొంగ కాదు , దొర అనే వారు, అరవీర భయంకర ఎర్ర చందనం దొంగలను అమాయక కూలీలు  అనే తమిళ తంబిలకు తందానా అనే తెగులు సోకిన తెలుగు వారు ముసుగులు తొడుక్కున్న దొంగలే.  వీరిని ఒకకంటిన కనిపెట్టి ఉండాలి,  జనులారా జరా బద్రం  

జై తెలుగు తల్లి! జై తెలంగాణ ! జై ఆంద్ర ప్రదేశ్

తెలంగాణ రాష్ట్రం గా ప్రత్యేక జీవనం గడపుటానికి కోటి ఆశలతో పరుగిడితున్న  సోదర తెలుగు ప్రజానీకానికి  శుభాశ్వీసులు. రాష్ట్రం గా విడిపోయి అన్నదమ్ములగా కలిసుండాలనే మీ / మా కోరిక నెరవేరాలని ఆశిద్దాం. స్వలాభం తో  దాయదులను రెచ్చగొట్టే రాజకీయాలను చేసే నీచులను దూరంగా పెడదాం. అభివృద్ధి చేసే పాలన కావాలి. తెలుగు వారు  అందరు  అభివృద్ధి చెందాలి.  అప్పుతో లోటు బడ్జెట్ తో , రాజధాని లేకుండా ఒంటరిగా ఉన్న సోదర ఆంధ్రుల పై సానుభూతి చెపే ఓదార్యం రావాలి. అత్యధిక తెలుగు జనం ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నారన్న సంగతి మననం చేసుకోండి. సమ న్యాయం అంటే అపహాస్యం చేయకండి.   5 కోట్ల సీమా ఆంధ్రులలో 4 కోట్లకు పైగా ప్రజలు కనీసం ఒక సారి కుడా హైదరాబాద్ కు రాలేదన్న సంగతి మరిచి పోకండి. వారిని ద్వేషించ వద్దు   తెలుగు జాతి మనది.  ఇది నిండుగా వెలగాలి.  మన నినాదం  జై తెలుగు తల్లి!   జై తెలంగాణ!  జై ఆంద్ర ప్రదేశ్ !

నీచ రాజకీయాలకు సమాధి కట్టండి

రేపు జరగబోయే అసంబ్లీ, లోకసభ ఎన్నికలలో ప్రజలందరూ విజ్ఞత తో ఆలోచించి మన రాష్ట్రం లో నెలకొన్న ఈ నీచ రాజకీయాలకు సమాధి కట్టండి. కొన్ని నిజాలు చెప్పుకొందాం  1. గత 10 ఏళ్లగా ఈ రాష్ట్రాన్ని, మరియు ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ అన్నది గుర్తుంచుకోండి. అలాగే ఈ రాష్ట్రంలో ఆపార్టీ తరుపున YSR  ముఖ్య మంత్రిగా పనిచేస్తూ , కేంద్రంలో తల్లి కొడుకులకు బాసటగా ఉన్నాడనేది వాస్తవం. మంచి అయినా చెడు అయినా ఆయనుకు వాటా ఉంది. 2. కాలం కలిసి రాక YSR అర్ధాంతంగా అసువులు బాసితే...ఆయన  పదవి కోసం , అయన పుత్ర రత్నం అదే పార్టీ లో అంతర్గత కుమ్ములాటల కు దిగి , పదవి దక్కలేదని, ఆవేశపడి జగన్ రెడ్డి గారు వేరే కుంపటి 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ' పేరుతో పెట్టిరు.  దాన్ని YSR కాంగ్రెస్ అని ముద్దుగా పిలుచుకొని అదొక కొత్త పార్టీ గా భ్రమ పెట్టారు. నిజానికి YSR కాంగ్రెస్ కు సోనియా కాంగ్రెస్ కు పెద్ద తేడా లేదు. ఒకే తాను ముక్కలే.  కాంగ్రెస్ చొక్కా వదిలి నీలం చొక్కా తొడిగారు. ఈ రెండు కాంగ్రెస్ లు 'జరాసంధుడి' వలె ఒకటే తనువు, ఒకటే మాట, ఒకటే బాట. కాంగ్రెస్ ప్రతి బింబమే ఇది ....

తీరానికి చేరిన తెలంగాణ సునామి

ఆంధ్రా వారికి తుపానులు, ఉప్పెనలు, సునామీలు కొత్త కాదు. వీటి బారిన పడి సర్వం నాశనం అయినా తిరిగి లేచి దేశానికి అన్నం పెట్టిన ఘనమైన చరిత్ర ఉన్న ప్రాంతం. ఎన్నోసార్లు కొంపా , గొడ్డు గోదా పోయినా ఎవరిని దేబిరంచని ఆత్మ గౌరవం ఉన్న గడ్డ ఇది. కష్టే ఫలి అనే నీతిని నమ్మిన జాతి  ఇలాంటి ఈ గడ్డకు నేడు తెలంగాణ పేరుతో రాజకీయ సునామి వచ్చింది. ఈ సునామీకి పెద్దలు సూచించిన పేరు 'సోనియా' . సోనియా సునామి సిమాంధ్ర ను నిలువునా ముంచింది. 58 ఏళ్ళ మన వారి కృషి ఫలాన్ని గంగ పాలు చేసింది.ప్రకృతి విపత్తు కు రైతన్నలు విలవిలాడినట్లే నేడు కూడా ఈ రాజకీయ విపత్తు కు ప్రజలు విలవిలాడు తున్నారు.  ఇది మన స్వయం కృత అపరాధమే. దీనికి ఎవరిని నిదించి ప్రయోజనం లేదు. తుపాను బాదితులకు పాలకులు విదిల్చే అన్నం మెతుకులకు ఎదురు చూడకుండా మనం స్వయంకృషి ని నమ్ముకోవాలి. ఈ దాయాదుల పోరులో జయాపజయాలు, తప్పు ఒప్పులు చర్చించుకోవటం అనవసరం. కాలం దాన్ని నిర్ణయిస్తుంది.  స్వార్ధం విడనాడి, సంకుచిత భావాలు వదిలి మనకి ప్రయోజనం కలిగేలా , విజ్ఞతతో సరైన చోట తిరిగి కొత్త రాజధానిని నిర్మించుకొని పూర్వ వైభవాన్ని తెచ్చుకోవటమే మన ముందున్న లక్ష్యం...