Skip to main content

Posts

Showing posts from July, 2009

తీర్దయాత్రలకు ప్రజల సొమ్మా?

జెరూసలెం కు వెళ్ళే క్రిస్టియన్ మత విశ్వాసులకి ఆంద్ర ప్రదేశ్  రాష్ట్ర  ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయం అందిచరాదని రాష్ట్ర హై కోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వటం హర్షనీయం . ఈ తీర్పు   మత విశ్వాసాలతో రాజకీయాలు చేసే నాయకులకు చెంప దెబ్బ . ఇస్లాం మతస్తులకు హజ్/ మక్కా యాత్రలకు కేంద్ర  ప్రభుత్వ సహాయం ఉన్నదన్న సాకుతో ఇప్పుడు  కొత్తగా  క్రిస్టియన్స్ కి విదేశాలకు మత యాత్రల పేరుతొ షికార్లు వెళ్ళటానికి ప్రజాధనం ఖర్చు పెట్టటానికి  YSR పూనుకున్నారు. ఇది  ముమ్మాటికి తప్పే .  అంతర్లినంగా YSR కు ఉన్న క్రైస్తవ మతాభిమానాన్ని ఇలా నిస్సుగ్గుగా  బయట పెట్టుకున్నాడు . విమర్శలు చుట్టుముట్టేసరికి తాజాగా కొత్త పల్లవి అందుకున్నాడు.  అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు... హిందువులకు కుడా మానసరోవరమ్ యాత్రలకు ఆర్దిక సహాయం చేస్తామనటం  నీ తిమాలిన పని . మతాన్ని,రాజ్యాన్ని వేరుగా ఉంచటమే నిజమైన లోకికవాదం అవు తుంది . అన్ని మతాల వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్దిక సహాయాలను నిలిపి వేయాలి .మత వ్యవహారాలల...

శ్రీ వా నీ లు

శ్రీ నివాస్ వా స్తు నీ తు లు నేలకు కులం   వాస్తు రాజ్యాంగంలో   రంగు , రుచి , వాసన చూచి   రిజర్వేషన్లు !!   వరదలు, వడదెబ్బలు   కాచుకున్న ఇల్లు  వాస్తు గాలికి  కుప్ప కూలింది ! వాలు ,వీలు   గాలి, వెలుగు ఉంటే  ఇంటికి వాస్తుతో పనేముంది? రోగాలు, రోస్టులకు   వాస్తు వైద్యం !   దవాఖనాలెందుకు దండుగ ?   ఆలిఫై అనుమానం   ఇంటిఫై శంక   రోగం ఒక్కటే   మందు తినాలి తూర్పు పడమర బొమ్మా బొరుసు యెదై తేనేమి విలువ ఒక్కటే ! ప్రపంచమంతా వాస్తు మయం వెర్రివాడికి క్రొత్త కళ్ళజోడు ! ఇంటి కొలతలకు వాస్తు గణితం అంకెల గారడిలో రెండు రెళ్ళు ఆరు !

వాస్తు లో కుల బీజాలు !!!

హిందూ సమాజం లో లోతుగా వేల్లూరుకున్న కుల వృక్షం యొక్క బీజాలు మనకు వాస్తు శాస్త్రం లో కనబడతాయి. గ్రామా /పట్టణ/ నగరాల లో ఏ వర్గం (కులం/వర్ణం) ఏ దిశలో ఉండాలో చెప్ప బడింది.వృత్తులను బట్టి,జాతులను బట్టి వారి నివాసాలు ఎక్కడ ఉండాలో నిర్ణయం చేయబడింది. దీనివల్ల తరతరాలగా సమాజం వర్గాలుగా, కులాలగా విభజింప బడినది. వృత్తుల మద్య అంతరం మనుష్యుల మధ్య విభజనాన్నిశాశ్వితం చేసాయి. వాస్తు శాస్త్రం లో చెప్పబడిన విషయాలను పరిసిలించితే నేటి కుల సమాజం యొక్క బలమైన పునాదులు కనపడతాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు కు వారి నివాసాలు ఎలా వుండాలో,నేలకు రంగు, రుచి,వాసన, ఎలా వుండాలో చెప్పబడినది.  1. బ్రాహ్మణలు: ఉత్తర దిశలో ఇల్లు/ వాకిలి  2. క్షత్రియ : తూర్పుదిశలో ఇల్లు/ వాకిలి  3. వైశ్య : దక్షణ దిశలో ఇల్లు/ వాకిలి  4. శూద్ర : పడమరదిశలో ఇల్లు/ వాకిలి  ఈ దిశలు ఊరి మధ్య బిందువు (బొడ్డురాయి)కి వుంటాయి. వీరితో పాటు మిగిలిన ఇతర వర్ణాలు,కులాలు ఎక్కడ నివాసం వుండాలో చెప్పబడినది.  గ్రామ,నగరాలలో ఆగ్నేయ, నైరుతి, వాయువ్య దిశలలో - చాకలి, మంగలి, జాలరి, మాదిగ, వర్ణ సంకరం చెందిన వారు నివాసం వుండాలి....