Skip to main content

Posts

Showing posts from December, 2010

గెలుపు జ్యోతిష్యానిదే !

తెలంగాణా వస్తుందా? రాదా? దీనిపై గ్రహాలూ ఏమంటున్నాయి? అనేదానిపై నిన్న ఒక  టి.వి. చానల్ లో దైవజ్ఞుల (?)  మద్య చర్చా కార్యక్రమం జరిగింది . దీనిలో సారాంశం ఏమిటంటే ... తెలంగాణాకు గ్రహాలూ అనుకూలంగా లేవు కాబట్టి రాదనీ ఒక జ్యోతిష్కుడు, అనుకూలంగా గ్రహాలూ ఉన్నాయని మరొక జ్యోతిష్కుడు వాదించుకొని ఎంచక్కా లేచిపోయారు. పుట్టే బిడ్డ ఆడా, మగా అని అడిగితే ... ఒకడు మగ అని మరొకడు ఆడ అని వాదించు కున్నట్లు ఉంది వీరి వాదనలు. ఇలాంటి చర్చలలో ఎవరు చెప్పింది జరిగిందో  అది వారి గొప్ప గాను, జరగక పోతే... అది జ్యోతిష్కుని అసమర్ధత గాను లెక్కించటం షరా మామూలే. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా దీనిలో జ్యోతిష్యానికి మాత్రం (జ్యోతిష్య శాస్త్రం ) ఓడిపోదు. శాస్త్రాన్ని తప్పు పట్టటం జరగనే జరగదు. ఇది ఈ శాస్త్రం యొక్క మార్మిక బలం. 

వ్యవసాయం దండగా లేక పండగా ?

వ్యవసాయాన్ని నమ్ముకుంటే 'దండగ' అని చంద్ర బాబు నాయుడు అన్నాడని హస్తం కాంగ్రేసు వాళ్ళు , అసలు ఆమాటే అనలేదని,వ్యసాయాన్ని    'పండగ'  చేస్తామని అన్న కాంగ్రేసు వారు పిండాలు పెట్టిస్తునారని   సైకలు వాళ్ళు ఒకటే రేట్టించు కుంటున్నారు. తిలా పాపం తలా పిడికడని రైతులను దగా చేసినది గత పాలకుల అందరిది అన్నది వాస్తవం. శ్రీ నారా చంద్రబాబునాయుడి గారి నిరాహార దీక్ష పుణ్యమా అని రైతుల కష్ట సుఖాలు గురించి న  ఒక అర్దవంతమైన చర్చకు దారి తీస్తుందని ఆశిద్దాం. వ్యవసాయం 'దండుగ' మారి కార్యక్రమం గా జేసిన పరిస్థితులు ఏమిటన్న విషయం గురించిన వాస్తవ  వాదనలు తెరపైకి రాలేదు. నిజానికి వ్యవసాయం నేడు రైతులకు 'దండగ' గాను, కూలిలకు 'పండగ'  గాను మారిందన్నది వాస్తవం. పంట పండినా పండక పోయినా కూలి రేటు పెరుగుతూ పోతూనే ఉంది. పనికి ఆహార పధకం, ఉపాధి కల్పనా పధకం వ్యవసాయ పనులకు గుది బండలా తయారై కులిల  కొరత వచ్చి, కూలి రేటు పెరిగి  ఖర్చులు పెరిగాయి. వీటికి తోడు పురుగు మందులు,ఎరువులు ధరలు పెరిగి పెట్టుబడి అధికమైనది. ఓట్ల రాజకియ...

రైతన్నా మేలుకో !రాజ్యాన్ని ఏలుకో !!

రైతన్నా మేలుకో, రాజ్యాన్ని ఏలుకో అని ఒకప్పుడు మారుమోగిన నినాదం. ఆనాడు రైతుల బాగోగుల గురించి మాట్లాడే వారికి మంచి గుర్తింపు,ఆదరణ ఉండేవి. ఆచార్య రంగా, చౌదరి చరణ్ సింగ్ రాజకీయంగా రైతుల కొరకు కృషి చేసారు.గిట్టు బాటు ధరల గురించి వారు చేసిన పోరాటాలు ఈనాటికి పరిష్కారానికి నోచుకోలేదు. రైతులలో అనైక్యత వారి రాజకీయ పోరాటానికి ఉతం ఇవ్వలేదు. క్రమంగా రైతులను వారి ఓట్ల కొరకు ఏదో ఒకటి చేయాలన్న స్పృహ రాజకీయ నాయకులలో పోయింది.సంక్షేమ పనులకు పెద్ద పీటలు వేస్తూ వ్యవసాయానికి కనీస ప్రోత్సాహం ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం  కుడా  ఈ నాటి  రాజాకియ నాయకులకు గాని పార్టీలకు గాని లేకుండా పోయింది. వీరికి చేసినా చేయక పోయినా పెద్దగా వరిగేది ఏమి లేదన్న భావం వేల్లునుకుంది. రైతుల గురించి మాట్లాడే వారు రోజు రోజుకి కనుమరుగౌతున్నారు.ఒక వేళ చంద్రబాబు లాంటి వారు రైతుల గురించి ఆమరణ దీక్ష చేసుంటే దాన్ని గేలి చేస్తున్నారు. రైతుల గురించి మాట్లాడటానికి కుడా ఒక ప్రధాన ప్రతిపక్షానికి అర్హతలేదనటం దివాలాకోరు రాజకీయం. ఏ పార్టీ అయినా రైతుల కష్ట సుఖాలను గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. తాము మాత్రమే రైతుల పై పేటెంట్ ఉన్నట్లు భావించే...

ఒకే ఒక్కడు జే.పి.

విద్యార్దుల ముసుగులో గూండాలు, రౌడీలు జేరి శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగించే వారికి శిక్షలు లేకుండా కేసులు తిసివేయాలనటం, ఇలాంటి వాదనకు వత్తాసు పలకటం నీచ నికృష్ట రాజకీయానికి పరాకాష్ట. తప్పును తప్పు అని చెప్పటం కుడా తప్పేనని దౌర్బాగ్యులు దేశంలో  తయారైయ్యారు. ఉద్యమాల పేరుతో దమన కాండ చేసేవారిని ఉదారంగా  చూస్తూ  వదిలేయమనే  ప్రజా ప్రతినిదులలో ప్రజల పక్షాన నిలబడి నిజాన్ని నిర్బయంగా అసంబ్లిలో చెప్పిన ఒకే  ఒక్కడు  లోక్ సత్తా  అధినేత  జే.పి. నేడు ప్రతి విషయం రాజకీయ కోణంలో లాభ నష్టాలు లెక్కలు చూసుకొనే రాజకీయ నాయకులు చట్టాన్ని,న్యాయాన్ని గౌరవించే రోజు కొరకు ఎదురు చూద్దాం. 'ధర్మో రక్షితి రక్షతః' అనే మన సనాతన హితోక్తి ని మరిచిపోవద్దు. సమాజానికి హితాన్ని, మంచిని చేసే  వ్యక్తులను      ప్రోత్సహించుదాం. 

నా రచనలు

Prof. Kodali Srinivas' writings 1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగు అనువాదం)- 2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర వేత్త ఆర్యభట్ట సమకాలికుడు   వరాహమిహిరుని  చే    ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం  ఇవ్వబడినది.   పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక  సహకారం తో  తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు.  తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది .   పేజీలు : 100 VAASTHULO EMUNDI? 2. వాస్తు లో ఏముంది ? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు.  చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్ని అతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగ...