ఆంధ్రుల అందాల రాముడు ,అభిమాన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవితం అందరికి ఆదర్శనీయం. సెంటిమెంట్స్ కు,శకునాలకు విలువనిచ్చే సినిమా రంగం లో నిబద్దతతో నిజాయితితో నిర్బయంగా నిలిచిన నిజమైన హేతువాది అక్కినేని. సినిమా జయాపజయాలు 'దైవాదీనం' అనే వాళ్లకు కృషి, పట్టుదల మాత్రమే సినిమాకు విజయ సూత్రాలని చాటిన నాస్తిక వాది మన నాగేశ్వరరావు. జీవిత తత్వాన్ని అవపోసన పట్టిన వ్యక్తి. నైతకతకు, సత్ ప్రవర్తనకు ,మంచితనానికి ,మానవత్వానికి మతం/ దైవం అవసరం లేదని త్రికరణ శుద్దిగా నమ్మిన 'నమ్మిన బంటు' అక్కినేని. విప్రనారాయణ,భక్త తుకారం,చక్రధారి,బుద్దిమంతుడు వంటి భక్తి రస చిత్రాలలో అపర దైవ భక్తుడిగా నటించిన అక్కినేని నిజజీవితంలో దైవ చింతనను దరికి చెరనియక నాస్తికునిగానే జీవించారు. వారి నాస్తిక నైజాన్ని అనేక సందర్బాలలో బహిరంగంగానే వెలుబుచ్చారు. ఒక సందర్బంలో ' మీరు నాస్తికులు కదా మరి దేముడి బొమ్మల తో ఉన్న ఈ మేమెంటులను ఇంట్లో ఎలా పెట్టారు?' అని ఒక విలేఖరి అడిగితే దానికి సమాదానంగా ' అవి ఒక కళాకారునికి ఇచ్చిన కళా చిహ్న...