Skip to main content

Posts

Showing posts from March, 2015

వాస్తు భూతం మళ్లీ పుట్టింది - గల్పిక

బంగారు భూమిలో  భాగ్య నగరం నడిబొడ్డున నిశరాత్రిలో  ఓ గార్దబం గుడ్డేట్టింది. ఆ గార్దభాండం బళ్ళున బద్దలై  దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ  భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రి లో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో కారు  మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా కురిసింది.  అకస్మాతుగా కనపడిన ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితమన్యులు  బంగారు భూమికి  భూత కీడు దాపురించినదని,  ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని  సెలవిచ్చిచారు.   ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందో నని తెరాసురల  అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభిలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోకిరి...