యాడాదికో తూరి అమ్మోరి జాతర ! ఐదేళ్ళకో సారీ ఎలక్షన్ల తిరునాళ్ళు!! మందు , విందు , పొత్తులు డబ్బులు , డప్పులు , దండలు ,దండాలు వాగ్ధానాలు - అంకమ్మ శివాళ్ళు షరా మాములే ! మూగజీవాల రోదనలతో ముచ్చటగా ముగిసిన జాతర అమ్మవారు గుడిలోకి ... అయ్యవారు గద్దె ఫైకి !! కోరికలు తిరుతాయన్న ఆశతో భక్త జనం ఐదేళ్ళు ఎదురుచూసే పిచ్చి జనం ...