Skip to main content

Posts

Showing posts with the label తెలుగు వెలుగు

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...

తపాళబిళ్ళ పై త్రిపురనేని రామ స్వామి కుమారుడు- గోపిచంద్

India Post released a stamp of Tripuraneni Gopichand  on 8th September 2011. త్రిపురనేని రామస్వామి  ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది నాస్తికుడు ,  సాహితీవేత్త  మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లాఅంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త ,కవిరాజు  త్రిపురనేని రామ   స్వామి . తండ్రి కొడుకులు లిద్దరికీ మన తపాల శాఖ ప్రత్యక తపాల బిళ్ళలను విడుదల చేయటం అపూర్వ విషయం. హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో రామస్వామి గారి వద్ద పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ.  కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.   ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటి...

నవయుగాల బాట - నార్ల మాట !

నార్ల వెంకటేశ్వరరావు  (1908 - 1985 ) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాది గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు.రామాయణాన్ని; రామ, రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్యభావజాలానికి సవాలు విసురుతూ 'శంభూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. ' బు...

శ్రీ శ్రీ /నార్ల పై స్టాంప్స్ విడుదల చేయాలి

ఈ సంవత్సరం మహా కవి శ్రీ శ్రీ మరియు విఖ్యాత పాత్రికేయులు , కవి శ్రీ నార్ల వారి శత జయంతులు జరుగు చున్న వేళ వారి గౌరవార్థం ప్రతేక తపాల భిళ్ళలు విడుదల చేసేలా ఆయా శతజయంతి ఉత్సవ సంఘాలు కృషి చేయాలి . తపాల బిళ్ళల పై తెలుగు హేతువాదులు ఇంతకుముందు మన తెలుగు హేతు వాదుల పై మూడు స్టాంప్స్ వచ్చాయి . వారి పై విడుదలైన స్టాంప్స్ వివరాలు ౧ . వేమన విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యా లు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలిది తో అద్భుతమైన కవిత్వం , అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, వి లువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, హేతువాది యోగి వేమన. ౨ . త్రిపురనేని రా మస్వామి కవిరాజు గా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది, రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి ౧౮౮౭ అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ...

తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు

లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేక తపాల బిళ్ళలను వి డుదల చేసి , వారి కృషిని ముం దు తరాలకు గుర్తుండేలా పదిల పరుస్తాయి . అలాగే ఒక జాతి సంస్కృతి , సాంప్రదాయాలపైన , వేష భాషల పైన , వైతాళికుల పైన ప్ర త్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు . వీటిని బట్టి ప్రపంచ వ్యా ప్తంగా ఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు . మన పోస్టల్ శాఖ వారు తెలుగువారిపై వెలువరించిన స్టాంప్స్ గురించి తెలుసుకుంటే ఈ విషయంలో మనం ఎంత ఎనుకున్నమో అవగతం అవుతుంది . భారత ప్రభు త్వం ఇ ప్పటి వరకు వెలువరించిన షుమారు ౪౦౦౦ స్టాంప్స్ లో తెలుగు వారి పైన , తెలుగు జాతి పైన విడుదల చేసినవి కేవలం ౪౦ మాత్రమే అంటే మన వారి పై చూపుతున్న చిన్న చూపు అర్ధమోతుంది . రాష్ట్రపతి , ప్రధాన మంత్రి వంటి వారికి , వారి మరణా న్తరం ప్రత్యేక తపాల భిళ్ళను విడుదల చేయటం ఆనవాయితి . అయితే కీ . శే . మన పి . వి నరసింహా రావు గారికి , సంజీవ రెడ్డి గారికి ఇంతవరుకు స్టాంప్స్ విడుదల చేయలేదంటే వారి పట్ల , మన తె లుగు జాతి...