Skip to main content

యాగాలతో బోగాలు దొరుకుతాయా?

యాగాలతో కోరికలు తీరుతాయా? తరువాత భాగం 


శ్లో!!   గ్రావోన్నజ్ఞనవత్  యజ్ఞ ఫలేపి  శృతి సత్యతా !
        కాశ్రద్దా తత్రధీ వృద్దా కామాధ్వా యథ్ఖిలీకృతః !!

యజ్ఞ యాగాలు చేస్తే కోరికలు సిద్ధిస్తాయని,స్వర్గబోగాలు లభిస్తాయని వేదకారులు చెబుతారు. దీనిలో సత్యం ఎంత ఉందంటే ... నీటిలో వేసిన బండరాయి తేలుతూ ఆవలి గట్టుకు చేరుతుందని చెప్పే మాటలో ఉన్నంత అని చార్వాకుల ఉవాచ. యజ్ఞ యాగాది వైదిక కర్మలు లోకంలో ప్రజల సంపదను,శ్రమను హరిస్తూ దుఃఖాన్ని,హింసను  కల్గిస్తున్నాయి. స్వలాభపరులు, వంచనాపరులు ఇలాంటి క్రతువులను పుట్టించి తమ పబ్బం గడుపుకుంటున్నారు వీరి ఉచ్చులో పడవద్దని, మంత్రాలకు చింతకాయలు రాలవని, యాగాలతో బోగాలు దొరకవని  ఆనాడే హెచ్చరించారు. కాలం తో పాటు ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వేష భాషలు, మత విశ్వాసాలు, సమాజక కట్టుబాట్లు మారుతూ ఉంటాయి. అలా కాలంతో పాటు మారని సమాజం జడత్వం అనే జ్వరంతో బాదపడుతున్నట్లుగా భావించాలి. ఆదిమ సమాజంలో అగ్ని గురించిన రహస్యం తెలియదు. దావానలాన్ని గాని మెరుపును గాని చూసి చకితులైపోయేవారు. ఆ తరువాత ఘర్షణ వలన అగ్ని పుట్టించవచ్చనే విద్య వారికి అబ్బింది. అగ్నితో మాంసాన్ని వండుకోవటం ,పచ్చి గింజలను పేలాలుగా చేయటం, చలి గాచుకోవటం, చీకటిలో వెలుగులు తెచ్చుకోవటం తో పాటు నిప్పుని చూసి క్రూర జంతువులు భయపడి పారిపోవటంతో   వేద కాలంలో అంగిరా మొదలైన ఋషులు అగ్ని ని దైవంగా కీర్తిస్తూ సామ గానం చేశారు. ప్రతిసారి అగ్నిని వెలిగించటం చాల శ్రమతో కూడుకున్న పని కావటం వల్ల దాన్ని నిరంతరం వెలిగే ఏర్పాట్లు చేసుకున్నారు. అగ్ని ఆరిపోకుండా నెయ్యి, కట్టెలు వేస్తూ ఒక పొయ్యిని (అగ్ని గుండం) రూపొందించుకున్నారు. వర్షాకాలంలో అగ్నిని రక్షించుకోనేదుకు ఆ నిప్పుల పొయ్యిపై గడ్డితో గుడిసె కట్టేవారు. పనులు మానుకొని గణంలో కొంతమంది ఈ పర్ణశాల (గుడిసె) లో ఉండి  అగ్నిఆరకుండా  నెయ్యి, సమిధలు(కట్టెలు) తో సపరిచర్యలు చేసేవారు. యజ్ఞం అంటే ప్రార్దించటం ,పూజించటం  అని అర్ధం. ఇదే చేసే పర్ణశాల కాలాంతరంలో యజ్ఞశాలగా, యజ్ఞ వాటికలగా రూపు మార్చుకుంది. పకృతి శక్తులు యజ్ఞ దేవతల మారి పూజలందుకున్నారు. ఆహార సేకరణకు వెళ్ళకుండా గుడిసెలో ఉన్న సోమరిపోతులు కాలక్షేపం కొరకు వల్లించిన వేడుకోలు మాటలు, పోసుకోలు కబుర్లు, పాటలు, గేయాలు లయబద్ద మంత్రాలుగా సామవేదంలో స్థిరపడ్డాయి. వర్షాలు  ఎప్పుడు   పడతాయో,  ఎలా పడతాయో తెలయని కాలంలో, సకాలంలో వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, పశువులు, ప్రజలు, పచ్చి గడ్డి వృద్ది చెందాలని, ఆవులు బాగా పాలు ఇవ్వాలని ప్రార్ధనలుచేస్తూ, శత్రువులు సర్వనాశనం కావాలని శాపనార్దాలు పెడుతూ యజ్ఞం చేసారంటే  అర్ధం చేసుకోవచ్చు. కాని  విజ్ఞానం మెండుగా వున్నానేటి సమాజంలో  వానలు కురవాలని , పంటలు పండాలని, సుఖశాంతులు  కావాలని యజ్ఞాలుయాగాలు చేయాలనటంలో ఎంతమాత్రం విజ్ఞత లేదు. తొలినాళ్ళలో ఉబుసుపోక గణ హితం కోరుతూ చేసిన యాగాలు రాజుల కాలంలో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తూ చేయటం మెదలెట్టారు. ఇలాంటి వాటిలో 'అశ్వమేధ యాగం' అతి ముఖ్యమైనయాగం . అశ్వమేధ యాగాన్ని కేవలం రాజ వంశానికి చెందిన రాజులు మాత్రమే చేయాలి. ఈ యాగం ఉద్దేశ్యం ఇరుగు పొరుగు దేశాల రాజ్యాల పై తమ ఆధిపత్యాన్ని తెలుపడం మరియు తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం. ఈ యాగంలో దృడంగా ఉండే  తెల్లని మేలు జాతి మగ గుర్రాన్నియాగాశ్వంగా దేశంపైకి వదులుతూ అది తిరిగిన ప్రదేశమంతా తమదేనని  ఎవరైనా ఈ గుర్రాన్ని అడ్డుకుంటే  వారికి చావే గతి అని , ఒక కుక్కను చంపి సంకేతికంగా శిక్షను తెలియచేస్తారు. గుర్రాన్ని ఒక సంవత్సరరకాలం యధేచ్చగా తిరిగి, వచ్చాక మహారాణీతో  గుర్రానికి  నేతితో అభ్యంగనస్నాన చేపించి 600 పైగా  పెంపుడు మరియు అడవి జంతువులను, పక్షులతో  పాటు కలిపి  ఆ గుర్రాన్ని బలి ఇస్తారు. మహా రాణీ, మిగతా రాణులను ఆచార బద్దంగా ఏడ్చుకుంటూ  గుర్రం శవం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఉప రాణులు అశ్లీలాను ఉచ్చరిస్తూ ఉంటే మహారాణీ గుర్రపు లింగాన్ని తన యోనిలో పెట్టుకొని సంబోగిస్తూ  ఆ రాత్రి గడపాలి. మరుసటి రోజు పొద్దున గుర్రాన్ని కోసి మంసాన్ని కాలుస్తారు. గుర్రం యొక్క వివిధ అంగాల నుండి వచ్చిన మాంసాన్ని  వేర్వేరు దేవుళ్ళకు నైవేద్యంగా స్వాహా అంటూ అగ్ని గుండంలో వేస్తారు. ఆ తర్వాత అశ్వ స్తుతితో యాగం ముగుస్తుంది. శ్రీ రాముడు ,వాసు దేవుడు వంటి వాళ్ళు అశ్వమేధం చేశారట.అశ్వమేథ యాగం చేస్తూ  అయోధ్య రాజు అంబరీషుడు అశ్వాన్ని వదిలిపెట్టితే దాన్ని ఎవరో అపహరిస్తారు. గుర్రం లేకుండా యాగం పూర్తి కాదుకాబట్టి దాని స్థానంలో 'శునశ్శేఫుడు' అనే  వాడిని తెచ్చి  నరబలి ఇవ్వబోతే విశ్వామిత్రుడు రక్షించాడనే కథ ఒకటి ఉంది. అలాగే సంతానం లేని దశరద రాజు పుత్రకామేష్టి యాగం చేసాడని, యాగ క్రతువులో లభించిన పాయసం (వీర్యం?) వలన అతని భార్యలకు పిల్లలు పుట్టారని రామాయణం లో ఉంది. పౌండరీకం అనే మరొక యాగంలో యాగం చేసే దంపతులు అందరూ చూస్తూ ఉండగా హోమగుండం పై వేసిన పందిరి ఎక్కి సంభోగం చేయాలి. రతిలో వెలువడిన పురుషుని వీర్యం కింద ఉన్న హోమగుండం లో పడితేనే యాగ ఫలితం వస్తుందట.ఇలాంటివే వాజపేయ, సౌత్రామణి యాగాలు కుడా. 

దాయాదుల నుండి కొత్తగా భాగం పంచుకొని రాజైన ధర్మరాజు రాజ్య క్షేమం, తన వారి క్షేమం కొరకు రాజసుయాయాగం చేసాడని, మంచి జరగాలని,బంగార రాజ్యం అవ్వాలని  అంగరంగ వైభవంగా యాగం చేస్తే నెల తిరగకుండానే జూదంలో రాజ్యం పోగొట్టుకొని అడవిపాలు అయ్యానని ధర్మరాజు మదనపడ్డాడని, కురుక్షేత్రం తరువాత ఆయన అశ్వమేధ యాగం చాల గొప్పగా చేస్తే ఒక ముంగిస వచ్చి ఇంత ఖర్చు పెట్టి చేసిన నీ యాగం కంటే అన్నార్తికి ఒక శేరు జొన్నపిండి దానం చేయటం చాల గొప్పపని ఉపదేశించినట్లు భారతంలో ఉంది. జనమేజయుడు 'నాగజాతి' ని నాశనం చేయటానికి సర్పయాగం చేస్తుంటే ఆస్తీకుడనే  నాగజాతి వాడు దాన్ని ఆపాడని, యాగాలు వద్దని అన్నందుకు కోపించిన ఇంద్రుడు పిడుగుల వాన కురిపిస్తే శ్రీకృష్ణుడు  గోవర్దన గిరిని ఎత్తి  కాపాడని భాగవతం లో ఉంది. 

ఈ యజ్ఞాల డొల్ల తనం బట్టబయలు చేసే మరో వృత్తాంతం భాగవతంలో కన్పిస్తుంది. 

యాగాలు చేస్తే స్వర్గం పోతారనే ఋషుల మాటలు బాగానమ్మిన ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజు తన పుర్వికులవలె చచ్చిన తరువాత కాక, తాను బ్రతికుండగానే బొందితో స్వర్గానికి చేరుకోవాలి అనే తన కోరికను కులగురువులైన వశిష్ఠుడికి చెప్పగా బొందితో స్వర్గానికి వెళ్ళడం కుదరదని అది శాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు,అతని నూరుగురు కొడుకుల యాగం చేయలేమంటారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అన్నందుకు, త్రిశంకుడిని 'చండాలుడు' గా ముద్ర వేసారు. (కర్మకాండలు, యాగాలలో ఇదే వాదం చేసే చార్వాకులను కుడా చండాలులు అని సమాజ బహిష్కరణ చేసారు) ఛండాలుడిగా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతుంటే విశ్వామిత్రుడు జాలి పడి అతని చేత యాగం చేయిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే వాటిని స్వీకరించటానికి కాని త్రిశంకుడిని స్వర్గానికి తీసుకుపొవటానికి కానీ దేవతలు ఎవరు రాకపోవటంతో తత్వం బొదపడిన విశ్వామిత్రుడు పురాణాలలో వర్ణించిన స్వర్గానికి ప్రతిసృష్టిగా త్రిశంకు స్వర్గం నిర్మించి దానిలో త్రిశంకుడు ఉండేటట్లు చేసాడనేది పురాణ కధ. ఈ కథ ను బట్టి చార్వాకులు చెప్పినట్లు యాగాలతో స్వర్గం చేరటం అనేది పచ్చి అబద్దం అని, స్వర్గం అనేది వట్టి కల్పితం అని తెలుస్తుంది.

యజ్ఞయాగాలు అనేవి బోలెడంత వ్యయంతో శ్రమతో కుడుకున్నవవడం వల్ల గొప్పల కోసం  ఏ కొద్దిమంది చక్రవర్తులో తప్పా సామాన్యులు చేసేవారు కాదు. ఇహలోకంలో ఫలితాలు ఇవ్వని ఇలాంటి యజ్ఞాలలో పిపాలకొద్ది ఆవు నెయ్యిని రోజుల తరబడి అగ్నికి ఆహుతి ఇస్తూ, సోమరిపోతులకు భూరి దాన ధర్మాలు చేస్తూ రాజ కోశాగారం ఖాళీఅయ్యేది. బలుల వలన పశు సంపద నాశనంతోపాటు, వ్యవసాయం కుంటుపడేది. ఈ యజ్ఞయాగాలలో జరిగే హింస హింస కాదని, మాంసం, సుర(మద్యం), మైధునం వంటివి దోషాలు కావని చెప్పినాకుడా ఈ అనాగరిక యాగాలపై పజలలో చులకనభావం ఏర్పడింది. ప్రజాధనం అగ్గిపాలు అయ్యే ఈ యాగాలపై ప్రజలతో పాటు పాలకులలోను విరక్తి వచ్చి అవి క్రమంగా కనుమరుగైనాయి. వ్యవసాయక వర్గాల వత్తిడితో ఆహార కొరత నివారణకొరకు గోవధను నిషేధించారు. క్రీ. త  4వ శతాబ్ది చెందిన పరాశర స్మృతిలో కలియుగంలో యాగాలు, గోవధ, పితురులకు మాంస నైవేద్యం వంటి ఆచారాలు పాటించవద్దని చెప్పారు. ఆ తరువాత శాకాహారులైన వైదుకులు చేసే యజ్ఞాలలో జంతు బలులు ఆగిపోయినా, పామరజనులు చేసే జాతరలలో జంతు బలులు ఈనాటికి కొనసాగుతూనే ఉన్నాయి. యాగాల లో బలి ఇచ్చే జంతువును కట్టివేసే యుప స్తంభం, బలిపీటం లకు ఆనవాళ్ళుగా జంతు బలులు జరిగే అమ్మవారి గుళ్ళలో ఇవి రెండు మిగిలిన దేవాలయాలలో యుప స్తంభం బదులు ధ్వజస్తంభం, బలి పీటం ఉండటం మనం గనించవచ్చు. అలాగే ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో పితృకర్మలలో( దినం/రోజు) మాంసాహార భోజనం వడ్డిస్తున్నారు.  
అమ్మవారి బోనాలు, సమ్మక్క జాతర్లు, గ్రామ దేవతల/దేవరల కొలుపులలో  చేసే జంతు బలులు వంటివి ఆటవికులు, అనాగరికులు, అమాయక గిరిజనులు, అజ్ఞానులు చేసేవి అని భావించేవారు  మత విశ్వాసాల మాటున మంత్రాల  ముసుగులో చేసే యాగాలు, హోమాలు, సామూహిక దీపారాధనలు, భజనలు, బైబులు వాక్యం పేరుతో జరిగే స్వస్థత కూటాలు, కూడికలు వంటివి కుడా అనాగారికమే అని తెలుసుకోవాలి.  
ప్రభావశీలమైన కొంతమంది వ్యక్తులు, నాయకులు  ఇలాంటి నిష్ప్రయోజనలైన పనులను పెద్దేత్తున పనిగట్టుకొని సమాజంలో తిరిగి ప్రవేశపెడుతున్నారు. శైవ, శాక్త మరియు మద్యం, మాంసం,మీనం, ముద్ర, మైధునం వంటి పంచ మకారాల తో ఉండే వామమార్గ మత  అవశేషాలే ఈ  ఆయిత చండీ యాగం, మహారుద్రాది  యాగాలు. 
ఇటువంటి పనులతో పురొగమించాల్సిన సమాజాన్ని తిరోగమనం పట్టించే ఇలాంటి వెర్రి వారిని ఉద్దేశించి స్వామి రామ తీర్ద అన్న మాటలు ప్రస్తావనార్హం  ' సమకాలీన పరిస్థితులకు తగిన విధంగా జీవించు . నీవు ప్రాచీన వేద ఋషుల యుగం నుండే వచ్చి ఉండవచ్చు.కాని ప్రస్తుతం ఆ కాలంలో నీవు బ్రతకటం లేదుకదా ! ఈ శాతబ్దపు శాస్త్రవేత్తలతో నీవు సంఘర్శించాల్సి ఉంది. ఈ యుగానికి నూతన వెలుగు ప్రసాదించిన శాస్త్ర విజ్ఞానాన్నీ నీవు జీర్ణం చేసుకోలేకపోతే ... తాత ముత్తాతలతో కలిసి పిత్రులోకంలో జీవించడమే మేలు '

Comments

Anonymous said…
There are many Christian organisations conducting something called "Kootami" and showing that many many ailments are cured.

How far the same are correct and feasible. Can you please enlighten as you are a Hetuvadi.
చాలా విలువైన అవసరమైన వ్యాసం..
అవును...ఎక్కడో చీకటి యుగం నమ్మకాలను జనంపై రుద్దాలనుకోవడం దుర్మార్గం.
ఇటువంటి వాదనలు.వ్యాఖ్యలు ఇంతకు ముందే చాలా విన్నవే,చదివినవే.ప్రతి మతంలోను ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి.ఐనా పురుషప్రయత్నం కూడా ఉంటేనే దైవం తోడ్పడుతుందని,యాగాలు నోములు మాత్రమే చాలవని పూర్వులు చెప్పేఉన్నారు.ఐనా హేతువాదులు మాత్రం కోరికలు సిద్ధించడానికి ఏంచేస్తారు?వారి కోరికలు ప్రయత్నం వల్ల తీరకపోతే,హింసకు దిగి చావుదెబ్బలు తింటున్నారు.రష్యా,చైనా వంటి పెద్ద దేశాల్లో జరిగిందేమిటి?మళ్ళీ మతం ప్రాబల్యం లోకి వచ్చింది కదా!అందుచేత ఈ విషయం ఎవరి విచక్షణకు వారికే వదిలి పెట్టడం మంచిది.
A. Kalidasu said…
The hetuvadi category people can only write against Hindu. There is no Hindu funding agency to support them to write against other beliefs.
On one side, you guys say all these are cock and bull stories and no Ramayana/ Bharatha/Bhagatvatha etc.. exist. On the other side you cite some examples from this literature and say our mythology also didnt suggest Yaagas.. What kind of crap you are talking.
G K S Raja said…
మత ఛాందసవాదులు నమ్మే పుక్కిటి పురాణాలలో కూడా కొన్ని సందర్భాలలో యజ్ఞ యాగాదులు నిరర్ధకమని చెప్పడాన్ని ఉదహరించడం, ద్వంద ప్రమాణం అవ్వదు అశోక్ చౌదరి గారూ! జనం సొమ్ముతో లౌకిక రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులు ఇటువంటి యాగాలు చేస్తూ పోతే ప్రశ్నించే ఆలోచనైనా కలగడానికి ఇలాంటి వ్యాసాలు ఉపకరిస్తాయి.
రాజా.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...