Skip to main content

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే. 
భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది 1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది.
ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ఈ కార్యక్రమానికి వేశేష ప్రచారాన్ని కల్పించి విరాళాల సేకనరణకు తోడ్పడింది. 













నాడు భద్రాచలం మారుమూల అటవీప్రాతం. యాత్రీకులకక్కడ ఏ సౌకర్యాలు లేవు. దేవాలయ నిర్మాణం కొరకు  తమిళనాడులో నిరామనాథపురం జిల్లాకు చెందిన శిల్పాచార్యులు గణపతి స్థపతిని ఆహ్వానించారు. దేవాలయానికి కావలిసిన సరైన రాయిని తమిళనాడులోని దిండివనంలో గుర్తించారు. ఆ రాళ్ళను కొత్తగూడెం వరకు రైళ్ళలో తెచ్చి అక్కడినుండి గోదావరి వరకు లారీలలో తరలించారు. పెద్ద పెద్ద రాతి శిలలను ఇసుకలో నెట్టుకు వచ్చి లాంచీలలో కెక్కించి అతికష్టంతో భద్రాచలం చేర్పించారు.
ముందుగా కల్యాణమండపం నిర్మించ తలపెట్టారు. చంద్రమౌళి నగర్లో 500 శిల్పులు 3 లక్షల ఖర్చుతో సకల కళాశోభితమైన కళ్యాణమండపం నిర్మించారు.
రామాలయానికి దక్షిణాన ఉన్న రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు. శిల్పశోభాయమానమైన గోపురాలు నిర్మించారు. దీనిలో ఆరు అడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహం ప్రతిష్ఠించారు. రామదాసు కీర్తనలు, భక్తి తరతరాలవారికి తెలియచేసే అపురూప నిర్మాణమిది.
ఆగమ శాస్త్ర ప్రకారం ప్రధాన ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో సౌందర్య శిల్పాలతో నిర్మించారు. ఈ రాతిని సమీపములోని తాటియాకుల గూడెంలో సేకరించారు.
మహామండపాన్ని అష్ఠలక్ష్ములు, దశావతారాలు, ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు. 32 టన్నుల ఏకశిలతో ఆలయ విమానం ఏర్పాటుచేశారు. ఈ విమానం మూడు అంతస్తులు కలిగి అన్ని దేవతామూర్తుల శిల్పాలతో శోభాయమానమైంది.

ఆలయ నిర్మాణం లో దోషాలు?


ఇంతటి మహా కార్యాన్ని భుజాలపైకి ఎత్హుకున్న చంద్రమౌళి గారికి  ప్రత్యర్దుల నుండి కువిమర్శలు ఎదురైనాయి. ఆలయ పునః నిర్మాణం ఇష్టం లేని కొంత మంది భక్త రామదాసు కట్టించిన ఆలయ కొలతలు వదలి స్వంత కొలతలతో  కొత్త గుడి కట్టుచున్నరన్న వాదన లేవదీశారు. ఆంద్ర ప్రత్రిక సహాయం తో దీనిపై  అలజడిరేపి భక్తులలో అనుమానపు బీజం నాటారు. వివాదం తారస్థాయి కి చేరి దీనిపై  నిజ నిర్ధారణ చేయటానికి ఒక కమిటిని అప్పటి ముఖ్య మంత్రి సంజీవరెడ్డి వేసారు.
ఈ విషయం లో చంద్రమౌళి గారిని కనీసం సంప్రదించకుండా, స్థపతి నుండి వాస్తవాలను తెలుసుకోకుండా  కేవలం రాజకీయ కోణంలో నిజనిర్ధారణ కమిటి వేయటం ఆయన్ను తీవ్రంగా బాదించింది. రాజకీయంగా  తీసుకున్న తప్పుడు పనికి కినిసి దేవాలయ జీర్ణోద్దారణ కమిటి అద్యక్ష పదవికి, టి టి డి బోర్డ్ అధ్యక్షపదవి తో పాటు వేమూరు శాసన సభా స్థానానికి (MLAపదవికి ) రాజీనామా చేసిన నిష్కలంక గాన్దేయావాది చంద్రమౌళి గారు.
నిజానికి రామదాసు నిర్మించిన ఆలయ నిర్మాణంలో వాస్తు దోషాలు చాలా ఉన్నాయి. ఆనాడు జరిగిన నిర్మాణ పరమైన దోషాలలో  చాలావరకు సరిదిద్దలేనివి. ఒక వేళ వాటిని సరిచేస్తే గుడి రూపు రేఖలు సమూలంగా మారతాయి. అందుకే  వాటిలో గర్భ గుడి కొలతలు మాత్రమే ఆగమ వాస్తు ప్రకారం సరిచేసి కట్టటం జరిగినది. ఎక్కడైనా  దేవాలయమైన తిరిగి నిర్మించేటప్పుడు ఇలా చేయటం సాదారణ శాస్త్ర నియమం. చంద్ర మౌళి గారు సరిగ్గా ఇదే చేశారు. 
ధర్మకర్తల సంఘానికి అధ్యక్షులుగా తిరిగి నియామకం 
రాష్ట్రంలో రాజకీయ మార్పులు జరిగి 1974లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరిగి  చంద్రమౌళిగారి ని రామాలయ ధర్మకర్తల సంఘానికి అధ్యక్షులుగా నియమించారు. చంద్ర మౌళి గారు పదవి చేపట్టిన వెంటనే విశేషంగా విరాళాలు సేకరించి చిత్రకూట మంటపాన్ని 127 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో నిర్మించారు. స్థంభాలపై అద్భుతమైన శిల్పలు చెక్కించారు. ఈ మంటపములో సంగీత సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు.దేవాలయ పరిపాలన కొరకు "చంద్ర మౌళి భవన్ " నిర్మించారు. 
ఆంద్ర అయోధ్య గా  భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు. ఈ పవిత్ర కార్యక్రమం లో తనకున్న పొలాన్ని,చివరకు గుంటూరులో చంద్రమౌళి నగర్ లో ఉన్న ఇంటిని కుడా  అమ్మి ఆ సొమ్మును వినియోగించారు. జనం సొమ్ము అందినకాడకి మింగే నాయకులకు జై జై లు కొట్టే ఈ రోజుల్లో ఆనాడు జనం కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని, పూర్వికుల నుండి వస్తున్న ఆస్తిని హారతి కర్పూరం గా సమర్పించిన నిష్కామ యోగి, త్యాగి శ్రీ చంద్రమౌళి. 
శ్రీ కల్లూరి చంద్రమౌళి (1898-1992) 
నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్నబాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు.
KALLURI CHANDRAMOULI 
కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు జిల్లా అమృతలూరు  మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు. తల్లిదండ్రులు వెంకమాంబ, సుదర్శనం. వారిది వ్యవసాయ కుటుంబం.బాల్యము నుండి భారతీయ సంస్కృతి సంప్రదాయాలంటే ఇష్టం. తల్లిదండ్రులకు చెప్పకుండా  1920లో ఇంగ్లాండు వెళ్ళి వ్యవసాయ శాస్త్రంలో పట్టా పొందారు. స్కాట్లాండు విశ్వవిద్యాలయము నుండి విద్యనభ్యసించిన చంద్రమౌళి భారతదేశానికి తిరిగివచ్చి వ్యవసాయభివృద్ధికై కృషిచేశాడు. 1926లో ఉద్యోగాన్ని నిరాకరించి మహాత్మా గాంధీ నాయకత్వంలో అన్ని జాతీయోద్యమాలల్లో పాల్గొని అనేకసార్లు జైలు కెళ్ళారు.  కాంగ్రేస్ పార్టీలో చేరి గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ అధ్యక్షుడైనాడు. ఉప్పు సత్యగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో ముందుండి తెల్ల దొరల పై అలుపెరుగని పోరాటం చేశారు. 
1937,1946,1955,1962లలో శాసనసభకు ఎన్నికై నారు. మద్రాసు ప్రావిన్సులో రామస్వామి రెడ్డియార్, కుమారస్వామి రాజ మంత్రి వర్గంలోనూ పంచాయతీ ,సహకార మంత్రి గా పని చేశారు. తెలుగు వారు మద్రాసు నుండి విడిపోయిన తరువాత ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం లో బెజవాడ గోపాలా రెడ్డి మంత్రి వర్గం లోను, ఆతరువాత  ఆంధ్ర ప్రదేశ్ లో దామోదరం సంజీవయ్య గారి మంత్రి వర్గం లో  మంత్రిగా పనిచేశారు.
భారతరాజ్యాంగ సభ సభ్యులు. దేవాలయాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. శ్రీశైలం, భద్రాచలం దేవాలయాల జీర్ణోద్ధరణ గావించారు. భద్రాచల పుణ్యక్షేత్రాన్ని పునఃనిర్మించి చంద్రమౌళి గారు అపర రామదాసుగా కీర్తిగాంచారు.
తిరుపతిలో విశ్వ సంస్కృతసదస్సు నిర్వహించారు. గుంటూరు లో మధ్య తరగతి వారి గృహ అవసారాల కొరకు సహకార రంగం లో తొలిసారి హౌసింగ్ కాలని రూపొందించారు. నేడది "చంద్ర మౌళి నగర్ " గా ఖ్యాతి గండించింది. 
రచనలు
చంద్రమౌళి గారు మంచి గ్రంధరచయిత"ఆర్ష విద్యాలంకార"అనే బిరుదాంకితుడు రామాయణసుధాలహరి, రామకధానిధి, సీతామహాసాధ్వి, వివేకానందస్వామి, యుగసమీక్ష, 
ఆండాళ్ వైభవం, వేదసుధాకరం, ఆర్షసంస్కృతి, భాగవతసుధ, ఉజ్వల తరంగిణి,
భారతీయ ప్రతిభ,నానా దేశ రాజ్యాంగములు,రైతు రాజ్యంగా నిర్మాణ సంఘం మున్నగు పుస్తకాలు రచించారు. 
శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు రాజకీయ సన్యాసం స్వీకరించి  తన స్వగ్రామంలో  చాలా సాదారణ జీవితం గడుపుతూ   1992 జనవరి 21నమోపర్రులో    పరమపదించారు. 

Comments

durgeswara said…
ఒక గొప్ప భక్తుడు నిజాయితీగల నాయకునిగూర్చి పరిచయం చేశారు ధన్యవాదములు
చాలా బాగా రాసారండీ.. మాది భద్రాచలం.. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ నేను భద్రాచలం లోనే పది హేడు ఏళ్ళు పెరిగాను. కాని నాకు చంద్ర మౌళి గారి గురించి తెలియదు. మీ బ్లాగ్ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషం గా వుంది.. ఇన్నాళ్ళూ నాకు తెలియనందుకు బాధ పడుతున్నాను కూడా..

ధన్యవాదాలు.
శివ చెరువు
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
కొత్త విషయాలు తెల్సినయి.
మమత said…
చాలా మంచి వివరాలు అందించారు,ధన్యవాదములు.
1968 లో(అప్పుడు నాకు 7 ఏళ్ళ వయసు) అనుకొంటా ... మా అమ్మ, నాన్నతో భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ మధ్యే కొత్తగా కట్టిన కల్యాణ మండపాన్ని చూసాం. మా నాన్నగారు ప్రభుత్వంలో ఒక మంత్రి పూనుకొని ఆ కల్యాణ మండపాన్ని కట్టించారని గొప్పగా చెప్పినట్టు గుర్తు.
ఆ మహానుభావుడు ఈ మంత్రిగారే ఆయ్యుంటారు.
ఆయనకు అంజలి!
మీకు అభినందన!!
Krishna said…
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
Very inspiring story...true human being..
every one has to learn from our previous generation..now a days everyone try to steal others money and blaming on others if they are not competent enough..

Deninayina kashtapadi sadinchali, nalugurutho neggguku ravali..adi ee samajaniki enthayina avasaram..

1920 lo Chandra mouligaru, england vadili india ravatam, chala manchi alochanla..leka pothey e roju aa alayam ala vundedi kademo...
శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు 1898 నవంబరు 15న గుంటూరు మండలములోని మోపర్రు గ్రామములో జన్మించారు.

సీమాంధ్రలో జన్మించిన దోషం చేత ఆయన తెలంగాణాద్రోహి అవుతున్నారు.

ఆయన లక్ష మంచి పనులు చేసినా కేసీఆర్‌గారి సిధ్ధాంతం ప్రకారం దోషి కాకుండా పోరు.
NSK said…
thanks for the info
Anonymous said…
భద్రాచల రామాలయం ఎవరు కట్టారు అనే వ్యాసంలో సంజీవరెడ్డి అని ఒక చోట వ్రాసారు. సరిచేయండి.
kodali srinivas said…
రాజకీయ మార్పులు జరిగి సంజీవయ్య స్థానం లో తిరిగి నీలం సంజీవ రెడ్డి ముఖ్యమంత్రి గా వచ్చారు. వారి మంత్రి వర్గం లో చంద్రమౌళి గారికి స్థానం దొరకలేదు .
మొదట్లో నీలం సంజీవ రెడ్డిని బలపరిచి ఆయన రాజకీయ ఎదుగలకు కృషి చేసిన చంద్రమౌళి గారు ఆయన ఆడిన రాజకీయ క్రీడ లో ఒక పావు గా మారటం ఇష్టం లేక ఆత్మ గౌరం దెబ్బ తినకుండా ఉండటానికి తన పదవులన్నీ తృణ ప్రాయంగా వదిలిన ధీశాలి శ్రీ కల్లూరి చంద్రమౌళి గారు.
నీలం సంజీవ రెడ్డి గారు మరల జనతా ప్రభుత్వం వలన రాష్ట్ర పతి గా ఉన్నప్పుడు చంద్ర మౌళి గారికి "విశిష్ట స్వతంత్ర పోరాట యోధుడు" గా గుర్తించి పించన్ స్వీకరించమని పొంపగా దానిని తిరస్కరించి, ఆ పించన్ మరో పేద స్వతంత్ర యోదునికి ఇవ్వవలిసినదిగా సూచించారు.
చాకలకొండ రమాకాంతరావు said…
సత్యం సత్యం పున్ః సత్యం -

అలా జోల పట్టు కొని ఊరంత తిరిగి ధనం సేకరించిన వారిలో మా నాన్న గారు చాకల కొండ చెంచురామయ్య గారు. వారితో మేము నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో తిరిగి డబ్బు సేకరించాము. మా నాన్న గారి సేకరించిన విరాళం ఆ నాటి వార్తా పర్తికల్లో కూడా పడింది.

చాకలకొండ రమాకాంత రావు

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...