సోసైటిల పై అజమాయిషీ !!!
ఐదుగురుంటే చాలు ( కేవలం కుటుంబ సభ్యులే ) ఒక సంఘాన్నిఎంచక్కా పెట్టి ,దాన్ని రిజిస్టర్ చేసి,దాని ముసుగులో వారి పనులన్నీ చక్కబెట్టుకునే ఈ రోజులల్లో వీటిపై ప్రభుత్వ అజమాయిషీ తప్పనిసరిగా ఉండాలిసిందే. వాటి జామా ఖర్చుల విషయాలపై పారదర్సకత ఉండాలి.కుటుంబ ఆస్తులకు రక్షణ కు ,విద్యా వ్యాపారాలకు మార్గం గాను, పన్ను ఎగవేతకు ఉపకరణం గాను, మత /సామాజక సేవల పేరుతొ విరాళాలు పోగుచేసుకోవటానికి ఈ నాడు అనేక సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో రోజు రోజుకి వెలుస్తున్న ఇంజనీరింగ్ కాలేజిలే.
వీటి ఆస్తిపాస్తులపైన, కార్యకలాపాల పైన నిఘా ఉండాలి కదా? అవకతవకలు ఉంటే వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకొని చక్కదిద్దాలి. అనవసర జ్యోక్యం లేకుండా చట్ట సవరణ జరగాలి. నిజంగా సామాజక సేవ చేసే సంస్థలను ప్రోత్సహించాలి, దోపిడీ చేసేవాటిని కట్టడి చేయాలి. దీనిపై సమగ్ర చర్చ జరగిన తరువాతే శాసన సభలో బిల్లు ఆమోదం పొందాలి.
ఈ విషయం లోజే పి గారి ఆవేదన అందరు అర్ధం చేసుకోవాలిసిందే. కాని ప్రభుత్వ అజామాయిషి వద్దనటం సరికాదు.రాజ్యంగా పరిధిలో నే ఈ సోసైటిల పై నియంత్రణ ఉండాలి.
Comments