భక్తులు జైల్లో ఉంటె బాబా బయట ఉండటం ఏమాత్రం నచ్చని ఘరానా దొంగలముటా, గాలి మరి అతని మిత్ర మండలి చంచల గూడా జైల్లో సాయి బాబా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు మొదలపెట్టారు.
దేశాన్ని దోచుకున్న భక్తులు జైల్లో ఉంటె వారిని బయట పడేయటానికి బాబా నే జైల్లోకి వచ్చేలా పోలీసులు సహకరించటం, జైలును గుడిగా మార్చటం,పాపులను పవిత్రులగా చెలామణిలోకి తేవటం మన దేశంలోనే చెల్లు. ఇంతకి సాయి బాబా ఎవరి పక్షం వహిస్తాడో మరి. ముడుపులు దండిగా ఇచ్చే గాలి గ్యాంగ్ కి బాబా ఎలా సహాయం చేస్తాడో చూద్దాం.
బాబా కోర్టు ముందు ఇక సి.బి.ఐ. తన వాదనలు వినిపించి(పూజలు,హోమాలు చేసి)గాలి ,అతని మిత్ర మండలకి బైలు రాకుండా చూడాలని విజ్ఞప్తి.

Comments