Skip to main content

ముఖ్య మంత్రి గారి వాస్తు భయం

మన ముఖ్య మంత్రి గారికి వాస్తు భయం బాగా పట్టుకుంది.మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దాదాపు పది కోట్లు ఖర్చు పెట్టి (దానిలో వాస్తుకు ఖర్చు పెట్టింది దాదాపు కోటి ) నాలుగేళ్ల క్రితం కట్టిన ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం (లేక్ వ్యూ గెస్ట్ హౌస్) కు వాస్తు దోషం ఉందని,అందుకే ఆయన కు అర్దాంతపు చావు వచ్చిందని వాస్తు పండితుల ఉవాచ. (ఆనాడు వై.యస్.ఆర్. కు వాస్తు సలహాలు ఇచ్చిన వాస్తు విద్వాంసులు (విద్వంసులు) ఈ తాజావాస్తు సువార్తను ఏమంటారో!) 

ఈ తాజా వాస్తు ను నమ్మి ఆ భవంతిలో ఉండటానికి భయపడి,మద్రాసు నుండి వాస్తు సిద్డంతిని పిలిపించి వారి సలహాలతో శ్రీ రోశియ్య గారు దానికి మరల వాస్తు మరమ్మతులు చేసారు.రిన్నోవేషణ్ పేరుతొ అరవై లక్షలు ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టారు. వాస్తు హోమాలు, శాంతి పూజలు చేసి చివరికి శ్రీమాన్ రోశియ్య గారు క్యాంపు ఆఫీసు లో 'కుడి కాలు' పెట్టారు. 'ఎడమ కాలు' మాత్రం అమీర్ పేటలో ఉన్న తన స్వంత భవనం లోనేనట. కేవలం కార్యాలయం మాత్రమే ఈ క్యాంపు ఆఫీసు నుండి నడిపిస్తారట. అడ్డగోలుగా అన్ని లక్షలు పెట్టి వాస్తు రిపేరులు చేసిన తరువాత కుడా రోశియ్య గారికి ఇంకా వాస్తు భయం వదలక పోవటం ఆయన పిరికితనానికి ప్రత్యక్ష నిదర్శనం. మన దౌర్భాగ్యం. 

ఒక వైపు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందంటారు. ఆదాయం తగ్గిందంటారు. ఇలాంటి ఖర్చులకు మాత్రం నిధులు ఎలా ఊడి పడతాయో మరి! ఇదే రోశియ్య గారు ఆర్ధిక మంత్రి గా ఉన్నప్పుడు వాస్తు పేరుతొ ప్రభుత్వ భవనాలకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండటానికి ఒక ఉత్తర్వు జారి చేసినట్టు గుర్తు . తన దాక వస్తేగాని తనువు బయట పదన్నట్లు, తన భయం పోగొట్టుకోవటానికి దాదాపు అరవై లక్షల ప్రజా ధనం తగలేసి వాస్తు ప్రకారం మార్పు, చేర్పులు చేయించారు. అయినాకాని శంక పోలేదు. ఈ వాస్తు గిలితో శ్రీమాన్ రోశియ్య గారు ఇంటినుండి క్యాంపు ఆఫీసుకి, అక్కడి నుండి సచివాలయానికి రాకపోకల వల్ల బోలెడంత ట్రాపిక్ జామ్ అవుతుంది. ఈ అసౌకర్యాన్ని రోతలేకుండా భారించాల్సింది భాగ్యనగర ప్రజలే. ఈ ట్రాఫిక్ ని కంట్రోలు చేయడానికి ప్రతిరోజూ పోలీసులు అవస్థ పడాలి. ఇటు ఇంటికి, అటు క్యాంపు ఆఫీసుకి రెండిటికి సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం అదనపు బలగాలు కావాలి. ముఖ్యమంత్రి అంటే ఇరవై నాలుగ్గంటల ఉద్యోగం కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్, కమ్యూనికేషన్ వసతులు ఆఫీసులో సరేసరి, ఇంటిలో కూడా కల్పించాల్సి ఉంటుంది. వీటి కోసం అదనపు ఖర్చు. ఇవన్నీ ఒక ఎత్తయితే ముఖ్యమంత్రి మూఢ విశ్వాసాల కొరకై అరవై లక్షలు తగలేసి వాస్తు పేరిట రిపేర్లు చేయించడం ఇంకో ఎత్తు. పైగా ఈ భవనం కట్టి నాలుగేళ్ళు కూడా పూర్తి కాలేదు.
 
అసలు వాస్తు విషయంలో మన ప్రభుత్వ పాలసీ ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ప్రభుత్వం నిర్మించే/వినియోగించే భవన, గృహల విషయంలో వాస్తు నియమాలు పాటిస్తుందా, పాటించదా? 
ఒక వేళ పాటిస్తే, ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అవసర మయ్యాయి? 
కాల క్రమేణా వాస్తులో కూడా మార్పులు వస్తుంటాయా? 
మనుషులను బట్టి, పదవులను బట్టి వాస్తు మారుతుందా? 
ప్రభుత్వానికి అధికార వాస్తు పండితుడు అంటూ ఎవరైనా ఉన్నారా? ఉంటె అతను దేన్నిప్రామాణికంగా వాస్తు చెబుతాడు? 
భవిషత్ లో వచ్చే వాస్తు అనర్ధాలకు అతను భాద్యత తీసుకుంటాడా? 
ఇవి రోడ్లు,భవనాల శాఖ నియమావళికి అంటే సివిల్ ఇంజనీరింగ్ సూత్రాలకు అనుగుణంగా ఉందా? 
ఒక వేళ ప్రభుత్వం వాస్తు పాటించదు అంటే , మరి ఏ నిబంధనల ప్రకారం ఈ వాస్తు మరమ్మతులు చేశారు? 
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాధుడు ఎవ్వడు?

Comments

Anonymous said…
మీ ఆలోచన సహేతుకంగా అనిపిస్తోంది.
హరి said…
ముఖ్యమంత్రి నాలుగేళ్ల క్రితం కట్టించింది 'లేక్ వ్యూ' గెస్టు హౌస్ కాదు. ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు భవనం.

మీ వ్యాసంలో కొన్ని వాక్యాలు నేను ఐదు రోజుల ముందు వ్రాసిన ముఖ్యమంత్రి నివాసం అనే వ్యాసం లోంచి తీసుకున్నట్టున్నారు!
హరి said…
కొడాలి గారు,

నా బ్లాగులో మీ కామెంటు ఇప్పుడే చూసాను, ధన్యవాదాలు.
krishna said…
చాలా బాగా అడిగారు.నేను కూడా ఆ సమాదానాలు చెప్పేవారికి కోసం ఎదురు చూస్తున్నాను.
kodali srinivas said…
హరి దోర్నాల గారికి అబినందనలు !
నా అభిప్రాయానికి 100 శాతం సరిపడేలా మీ వ్యాసం ఉంది. దాన్ని నా మాటలలో కాకుండా నేరుగా మీ మాటలే నా వ్యాసంలో ఉంచాను. ఈ వ్యాసం యొక్క క్రెడిట్ మీదే. మీ వ్యాసభాగాన్ని ఇక్కడ ఉంచటానికి అనుమతి ఇచ్చినందులకు ధన్యవాదాలు.
kodali srinivas said…
కృష్ణ గారు ,మన ఆశేగాని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే బాద్యత పాలకులు/ అధికారులు తీసుకోరు. సమాచార హక్కు తో తెలుకోవచ్చో లేదో చూసి ప్రయత్నం చేద్దాం.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...