గృహ నిర్మాణాలలో నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టి, నగరాలలో పట్టణాలలో స్థలాన్ని,ధనాన్ని ఆదా చేసే అపార్ట్ మెంట్స్ కు మన దేశంలో వాస్తు జబ్బు తగులుకుంది. ఈ వాస్తు వల్ల నిర్మాణ వ్యయం పెరగటమే కాకుండా నివాసానికి అసౌకర్యంగా ఉంటున్నాయి. ఈ అపార్ట్ మెంట్స్ కు మన ప్రాచీన వాస్తు వర్తించదన్న విషయం తెలియక చాలా మంది అనవసర ఆందోళనలకు లోనౌతున్నారు.
ఈ నాడు బహుళ ప్రజాదరణ పొందుతున్న ఈ అపార్ట్ మెంట్స్ దాదాపూ మూడు వందల ఏళ్ల క్రితం యూరప్ లో మొదలై నేడు ప్రపంచమంతా వ్యాపించాయి. నేడు కోట్లాది మంది ఈ అపార్ట్ మెంట్స్ లో నిక్షేపం గా జివిస్తున్నారన్నది పరమ సత్యం.వారందరికి కలగని కస్టనష్టాలు మనకి మాత్రమే వస్తాయనుకోవటం సరికాదు. ఈ ఆధునిక గృహాలకి మన ప్రాచీన వాస్తు తో ముడి వేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవటం విజ్ఞత ఎంత మాత్రం ఆగ్నేయం.
ఆ గ్నేయం లో అగ్ని అని కిచెన్,
నైరుతిలో బరువు అని మాస్టర్ బెడ్ రూం,
ఈశాన్యమ్ నడక అని డోర్లు ...
ఇవే వాస్తు అనే వారి మాటలకు విలువ ఇచ్చి కోరి కస్టాలు కొని తెచ్చుకోకండి. నిజానికి వాస్తు ని బట్టి నిర్మించిన అపార్ట్ మెంట్స్ లో గాలి,వెలుతురు సరిగా ఉండదు.
అపార్ట్ మెంట్స్ చూడవలిసినది,ప్రాధాన్యం ఇవ్వవలిసింది వాస్తుకి కాదు. దాని నాణ్యత, పటిష్టత, సౌకర్యం, సౌందర్యం. వీటికే ప్రాధాన్యం ఇవ్వాలి.కాల దోషం పట్టిన వాస్తును వదిలి విశ్వవ్యాప్తం గా ఆమోదించిన నవీన సాంకేతిక విజ్ఞాన్నిసాదరంగా స్వాగతించండి.
(సశేషం)

Comments
ఆశ్చర్యకరం!! వాస్తును పాటించేది సౌకర్యంకోసమైనప్పుడు గాలి వెలుతురు సరిగా వుండదు అని ఎలా చెప్పగలుగుతారు? వాస్తు పాటించకుండా కూడా అది పొందవచ్చు అది వేరే విషయం.
కానీ వాస్తే విజయహేతువు,మోక్షదాయిని అనే వాదనలు మాత్రం పూర్తిగా అర్ధరహితం.
ఈ నాడు వాస్తు పేరుతొ చెప్పే వన్ని గృహస్తులకు గాలి, వెలుతురు వాటితో పాటు సౌకర్యం కలిపించేలా లేవు. పిడివాదం, పిచ్చివాగుడు. దున్న ఈనింది అంటే దూడను కట్టేయమనే వాళ్లు కోకొల్లలు. వాస్తు తో అద్బుతాలు జరుగుతాయని చేసే ప్రచారం వివేకవంతులను కుడా పెడదారిన నడిపిస్తున్నది. దీనికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు వాస్తు పై ఉన్నఅపోహలను పోగొట్టాలి. చర్చలు జరగాలి.సత్యం వెలుగు చూడాలి.