Skip to main content

పిండ ప్రధానం ఎవరికీ?

పిండము జేసి పితురులను తలపోసి 
కాకులకు పెట్టు గాడిదలారా !
పియ్యి తినెడి కాకి పితురుడేట్లాయరా? 
విశ్వదాభిరామ వినుర వేమా  

అని ప్రజా కవి వేమన ఏనాడో చెప్పాడు. వేమన మాటలు తెలంగాణా కు పనికి రావనేనే కుహునా మేధావులు ఉద్యమ నాయకులుగా చలామణి అవుతూ పిండ  ప్రదానాలు చేస్తున్నారు.  అలాగే స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన జరిగే దోపిడీ,వివక్షను చెప్పిన త్రిపురనేని రామసామి ని హుస్సేన్ సాగర్ లో వేసి బోనాలు,జాతరలు జరిపే మత వాదులు ఈ ఉద్యమంలో దూరారు.
ప్రజాస్వామ్య ఉద్యమం 'చండీయాగం' తో మొదలు పెట్టి ఇప్పుడు పిండ ప్రదానాలు చేసేవరకు దిన దినాభి వృద్ది చెందింది.
ఇలాంటి మూఢ విశ్వాసాలను గౌరవిస్తూ బూజు పట్టిన ఆచారాలను ఆరాధిస్తూ సామాజక తెలంగాణా ఎలా సాధిస్తారో ఈ ఉద్యమ నాయకులు చెప్పాలి.
పిండ ప్రధానం చేస్తే అసంబ్లి మరణించి నట్లేయితే, తెలంగాణా వెతిరేకుల పై ఉద్యమ బాటలో బాణామతి, చిల్లంగి,చేతబడి కుడా చేస్తారా? రాబోయే రోజులలో ఇది కుడా చూస్తామేమో ...   

Comments

Anonymous said…
వెర్రి తిరిగింది ..రొకలి పట్టుకురా తలకు చుట్టుకుంటాను అన్నాడట వెనకటికెవడో...అలానే ఉంది ఈ తతంగం
Anonymous said…
*కుహునా మేధావులు ఉద్యమ నాయకులుగా చలామణి అవుతూ పిండ ప్రదానాలు చేస్తున్నారు. అలాగే స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన జరిగే దోపిడీ,వివక్షను చెప్పిన త్రిపురనేని రామసామి ని హుస్సేన్ సాగర్ లో వేసి బోనాలు,జాతరలు జరిపే మత వాదులు ఈ ఉద్యమంలో దూరారు*

ఆంధ్రా అహంకారం అంటే ఇదే. మీవారక్కడికి అంతా పెద్ద మేధావులు అయినట్లు బిల్డప్. పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన జరిగే దోపిడీ,వివక్షను గురించి ఆయన చెప్పారు మాకు అర్థమైంది. ఇకవారి అవసరం లేదు. మీరైతే వారు రాసిన పాత పుస్తకాలను పునర్ముద్రించో లేక బ్లాగులో తిరిగి మానవ వాదం/హేతువాదం అనే పెరుతో ప్రచూరించుకొంట్టూ ఒక బృందాన్ని తయారు చేసుకొంట్టున్నారు. ఆఫ్ కోర్స్ దానికి పెద్దగా ఎవరు ప్రతిస్పందించటం లేదనుకోండి. నిజంగా వారిలాంటి మేధావులు ప్రజలలో తెచ్చిన పరివర్తనే ఉంటె ప్రజలు ఇంతటి ఆగ్రహావేశాలకు లోనై ఇలా ప్రవర్తించరు కదా! త్యాగరాజు గారి అన్న రాముని విగ్రహం నదిలో వేసినపుడు కనపడక ఎలా బాధ పడ్డడో మీరు రామసామి నీళ్లలో వేసారాని బాధ పడుతున్నారు. ఇక ఆస్థికులకి నాస్థికులకి తేడా ఎమీటీ? రామస్వామి గారు మీలోతీసుకు వచ్చిన మార్పు ఎమీటి? మీకు దేవుని స్థానంలో రామస్వామి గారు వచ్చారు. భక్తుడు దేవుని మీద పాటలు,పద్యాలు లాంటి రాసుకొని ఆనందించినట్లు. మీరు ఆయన మీద టపాలు రాసుకొంట్టూ మీగోడును వెళ్ళగక్కుత్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు కుహనా మేధావులు ?
హరి said…
కొడాలి శ్రీనివాస్ గారు,

నేను కూడా ఎంటో కొంత హేతువాదినే. మీ టపాలు క్రమం తప్పక చదువుతాను. ప్రాంతాల విషయం వచ్చేసరికి మీ హేతువాదంలో హేతుబద్ధత కొరవడ్డట్టు కనిపిస్తుంది.

పిండ ప్రదానం చేయడం అనేది ఒక ప్రాంతం ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించిన తరుణంలో సింబాలిక్ గా చేసిన కార్యక్రమం. అది నిజమైన వైదిక కర్మ కాండ కాదని మీకు తెలియదనుకోలేం.

ఉద్యమంలో అస్తికులూ, ఉంటారు, నాస్తికులూ ఉంటారు. ఎవరికి తోచిన నిరసన వారు తెలుపుతుంటారు. సమైక్యంగా ఉంచాలని కొంతమంది యఙ్ఞాలు చేస్తే, విడిపోవాలని కొంత మంది యఙ్ఞాలు చేస్తారు.

మీకు మత, కుల, ప్రాంతపు రంగు పులిమిన ఈ 'ధూర్త మానవలకు' దశ,దిశా నిర్దేశం కలిగేలా, ప్రజలలో అజ్ఞానం,అంధ విశ్వాసాలు తొలగి వివేకం పెరిగేలా, మత పిచ్చి, కుల పిచ్చి రూపు మాపెలా మన తెలుగు జాతికి జ్ఞానాన్ని కలుగజేయి. ఈ ధూర్త మానవులను క్షమించు.వారికి హేతు బుద్దిని కలిగించు.

ఇవి మీ గత టపాలోని వ్యాఖ్యలు. ఒక హేతువాదిగా మీరు చనిపోయిన రామస్వామిగారు హేతుబుద్ధి కలిగిస్తారని ఎలా అనుకోగలిగారు? మీరు కేవలం సింబాలిక్ గానో, నాటకీయత కోసమో అలా అన్నారని మేం అనుకున్నాం.

అలాగే ఇది కూడా. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు తెలుపడానికి రక రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో ఇది ఒకటి. దీంట్లో అంతకు మించిన హేతుబద్ధత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పిండం పెట్టగానే అసెంబ్లీ మరణిస్తుందని ఎవరూ అనుకోవటం లేదు (పెట్టిన వారితో సహా).
kodali srinivas said…
హరి గారికి - మీ స్పందనకు ధన్యవాదాలు.
మీరు విగ్రహాలను ధ్వంసం చేయటం చాలా కాకతాళీయం అని భావిస్తున్నారు. దీని వెనుక చాలా కుట్ర,కుతంత్రం ఉన్నాయి.
దేశ విభజనకు ఆనాడు 'చివరి పోరాటం' పేరుతో జిన్నా ఏదైతే చేసాడో అదే పంధాలో నేడు తెలంగాణా పోరాటం జరుగుతున్నది. సోదర భావం సమూలంగా సమిసిపోయేలా, విద్వేషాలు పెరిగేలా, ఒకరినొకరు అనుమానంతో చూచేలా పరిస్థితులు కల్పించేలా ఉద్యమాన్ని నడుపుతున్నారు. గమనిచండి. దీని వెనుక ఉన్నశక్తులు ఎవరో, వారి ప్రణాళిక ఏమిటో మీలాంటి వారు గమనించండి. నా వరకు రాష్ట్రాన్ని రెండు లేదా మూడు ముక్కలు చేసినా ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ ముక్కలను ప్రగతి పధం లో పయనించే లా ఇప్పుడున్న నాయకులు కృషి చేయగలరా అన్నదే నా సందేహం. మీకు మీ నాయకులపై ఉన్న అపార విశ్వాసం, వారు చేసే పనులు నచ్చితే, అదే ఉద్యమం అనుకుంటే అలాగే ముందుకు పోండి. లేదా ఒక్క క్షణం లోతుగా ఆలోచించండి.
Jai said…
Srinivas, it appears you are not aware of the "revolutionary content in traditional form" approach. During the Telangana armed struggle,, the fighters used to apply "bottu" to weapons.

If you are a rationlist, how can you support erecting statues in the first place? Are not these statues an imitation of idol worship?

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...