కాకులకు పెట్టు గాడిదలారా !
పియ్యి తినెడి కాకి పితురుడేట్లాయరా?
విశ్వదాభిరామ వినుర వేమా
అని ప్రజా కవి వేమన ఏనాడో చెప్పాడు. వేమన మాటలు తెలంగాణా కు పనికి రావనేనే కుహునా మేధావులు ఉద్యమ నాయకులుగా చలామణి అవుతూ పిండ ప్రదానాలు చేస్తున్నారు. అలాగే స్మృతులు, పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన జరిగే దోపిడీ,వివక్షను చెప్పిన త్రిపురనేని రామసామి ని హుస్సేన్ సాగర్ లో వేసి బోనాలు,జాతరలు జరిపే మత వాదులు ఈ ఉద్యమంలో దూరారు.
ప్రజాస్వామ్య ఉద్యమం 'చండీయాగం' తో మొదలు పెట్టి ఇప్పుడు పిండ ప్రదానాలు చేసేవరకు దిన దినాభి వృద్ది చెందింది.
ప్రజాస్వామ్య ఉద్యమం 'చండీయాగం' తో మొదలు పెట్టి ఇప్పుడు పిండ ప్రదానాలు చేసేవరకు దిన దినాభి వృద్ది చెందింది.
ఇలాంటి మూఢ విశ్వాసాలను గౌరవిస్తూ బూజు పట్టిన ఆచారాలను ఆరాధిస్తూ సామాజక తెలంగాణా ఎలా సాధిస్తారో ఈ ఉద్యమ నాయకులు చెప్పాలి.
పిండ ప్రధానం చేస్తే అసంబ్లి మరణించి నట్లేయితే, తెలంగాణా వెతిరేకుల పై ఉద్యమ బాటలో బాణామతి, చిల్లంగి,చేతబడి కుడా చేస్తారా? రాబోయే రోజులలో ఇది కుడా చూస్తామేమో ...
Comments
ఆంధ్రా అహంకారం అంటే ఇదే. మీవారక్కడికి అంతా పెద్ద మేధావులు అయినట్లు బిల్డప్. పురాణాలు మరియు వ్యవస్థీకృత మతము వలన జరిగే దోపిడీ,వివక్షను గురించి ఆయన చెప్పారు మాకు అర్థమైంది. ఇకవారి అవసరం లేదు. మీరైతే వారు రాసిన పాత పుస్తకాలను పునర్ముద్రించో లేక బ్లాగులో తిరిగి మానవ వాదం/హేతువాదం అనే పెరుతో ప్రచూరించుకొంట్టూ ఒక బృందాన్ని తయారు చేసుకొంట్టున్నారు. ఆఫ్ కోర్స్ దానికి పెద్దగా ఎవరు ప్రతిస్పందించటం లేదనుకోండి. నిజంగా వారిలాంటి మేధావులు ప్రజలలో తెచ్చిన పరివర్తనే ఉంటె ప్రజలు ఇంతటి ఆగ్రహావేశాలకు లోనై ఇలా ప్రవర్తించరు కదా! త్యాగరాజు గారి అన్న రాముని విగ్రహం నదిలో వేసినపుడు కనపడక ఎలా బాధ పడ్డడో మీరు రామసామి నీళ్లలో వేసారాని బాధ పడుతున్నారు. ఇక ఆస్థికులకి నాస్థికులకి తేడా ఎమీటీ? రామస్వామి గారు మీలోతీసుకు వచ్చిన మార్పు ఎమీటి? మీకు దేవుని స్థానంలో రామస్వామి గారు వచ్చారు. భక్తుడు దేవుని మీద పాటలు,పద్యాలు లాంటి రాసుకొని ఆనందించినట్లు. మీరు ఆయన మీద టపాలు రాసుకొంట్టూ మీగోడును వెళ్ళగక్కుత్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు కుహనా మేధావులు ?
నేను కూడా ఎంటో కొంత హేతువాదినే. మీ టపాలు క్రమం తప్పక చదువుతాను. ప్రాంతాల విషయం వచ్చేసరికి మీ హేతువాదంలో హేతుబద్ధత కొరవడ్డట్టు కనిపిస్తుంది.
పిండ ప్రదానం చేయడం అనేది ఒక ప్రాంతం ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించిన తరుణంలో సింబాలిక్ గా చేసిన కార్యక్రమం. అది నిజమైన వైదిక కర్మ కాండ కాదని మీకు తెలియదనుకోలేం.
ఉద్యమంలో అస్తికులూ, ఉంటారు, నాస్తికులూ ఉంటారు. ఎవరికి తోచిన నిరసన వారు తెలుపుతుంటారు. సమైక్యంగా ఉంచాలని కొంతమంది యఙ్ఞాలు చేస్తే, విడిపోవాలని కొంత మంది యఙ్ఞాలు చేస్తారు.
మీకు మత, కుల, ప్రాంతపు రంగు పులిమిన ఈ 'ధూర్త మానవలకు' దశ,దిశా నిర్దేశం కలిగేలా, ప్రజలలో అజ్ఞానం,అంధ విశ్వాసాలు తొలగి వివేకం పెరిగేలా, మత పిచ్చి, కుల పిచ్చి రూపు మాపెలా మన తెలుగు జాతికి జ్ఞానాన్ని కలుగజేయి. ఈ ధూర్త మానవులను క్షమించు.వారికి హేతు బుద్దిని కలిగించు.
ఇవి మీ గత టపాలోని వ్యాఖ్యలు. ఒక హేతువాదిగా మీరు చనిపోయిన రామస్వామిగారు హేతుబుద్ధి కలిగిస్తారని ఎలా అనుకోగలిగారు? మీరు కేవలం సింబాలిక్ గానో, నాటకీయత కోసమో అలా అన్నారని మేం అనుకున్నాం.
అలాగే ఇది కూడా. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు తెలుపడానికి రక రకాల కార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో ఇది ఒకటి. దీంట్లో అంతకు మించిన హేతుబద్ధత గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. పిండం పెట్టగానే అసెంబ్లీ మరణిస్తుందని ఎవరూ అనుకోవటం లేదు (పెట్టిన వారితో సహా).
మీరు విగ్రహాలను ధ్వంసం చేయటం చాలా కాకతాళీయం అని భావిస్తున్నారు. దీని వెనుక చాలా కుట్ర,కుతంత్రం ఉన్నాయి.
దేశ విభజనకు ఆనాడు 'చివరి పోరాటం' పేరుతో జిన్నా ఏదైతే చేసాడో అదే పంధాలో నేడు తెలంగాణా పోరాటం జరుగుతున్నది. సోదర భావం సమూలంగా సమిసిపోయేలా, విద్వేషాలు పెరిగేలా, ఒకరినొకరు అనుమానంతో చూచేలా పరిస్థితులు కల్పించేలా ఉద్యమాన్ని నడుపుతున్నారు. గమనిచండి. దీని వెనుక ఉన్నశక్తులు ఎవరో, వారి ప్రణాళిక ఏమిటో మీలాంటి వారు గమనించండి. నా వరకు రాష్ట్రాన్ని రెండు లేదా మూడు ముక్కలు చేసినా ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఆ ముక్కలను ప్రగతి పధం లో పయనించే లా ఇప్పుడున్న నాయకులు కృషి చేయగలరా అన్నదే నా సందేహం. మీకు మీ నాయకులపై ఉన్న అపార విశ్వాసం, వారు చేసే పనులు నచ్చితే, అదే ఉద్యమం అనుకుంటే అలాగే ముందుకు పోండి. లేదా ఒక్క క్షణం లోతుగా ఆలోచించండి.
If you are a rationlist, how can you support erecting statues in the first place? Are not these statues an imitation of idol worship?