ఇదే శీర్షికతో ఇంతకు ముందు ఒక టపా రాసాను.ఆ టపాలో చెప్పిన ఆహార దుబార ( విందుల పేరుతొ జరుగుతున్న ) కు ఓ చక్కటి పరిషక్కారం ఇప్పుడు దొరికింది . వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందని ... నా ముందు టపా లో వాపోతే , మన సానియా పెళ్లి నా ఆందోళనకు ఒక పరిష్కార మార్గం చూపెట్టింది . ఇక్కడ ఘనంగా పెళ్లి చేసుకొన్నసానియా తన పాకిస్తాన్ పెనిమిటి షోయబ్ మాలిక్ ఇంటికి వెళ్లి అక్కడ ఎంచక్కా పెళ్లి విందులతో అందరిని అలరిస్తున్నది . అయితే మనలాగా పెళ్లి విందులలో రకరకాల రుచులతో షడ్ర శోపేత భోజనాలు అతిధులకు వడ్డించటం పై పాకిస్తాన్లో నిషేధం ఉన్నదట. నిన్న లాహోరు లో సానియా షోయబ్ ల ' వలిమ ' ( పెళ్లి కొడుకు తరుపు వారు ఇచ్చే విందు ) లో అతిదులకు ' కోడి కుర్మా' ఒక్కటే వడ్డించారని వార్త . పెళ్లి విందులలో ఒక డిష్ కంటే ఎక్కువ ఉండరాదని అక్కడ చట్టాలు చేసారట . డబ్బు ఉన్నా అందరికి ఇదే రూలు వర్తిసుంది . ఎంత బాగుంది ఈ నియమం . దీన్ని మన దేశంలో కుడా అందరికి వర్తించేలా కటినమైన చట్టం చేసుకుంటే ముందు ముందు మన కు వచ్చే ఆ...