Skip to main content

నక్షత్రాలు - జాతకాలు

జ్యోతిష్యం లో నక్షత్రాల పాత్ర , దాని శాస్త్రీయతను తెలుసుకుంటే గాని జాతకాల అసల గుట్టు అర్దం అవదు.

1. ఆకాశంలో మనకు కనపడే నక్షత్రాలు ఎన్ని? కనపడనవి ఎన్ని?
వాటిలో జ్యోతిష్య శాస్త్రం లో ప్రస్తావించిన 27 నక్షత్రాలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

2. జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి,
జాతకాలకి ఉన్న సంభందం ఏమిటి? జన్మ నక్షత్రాన్ని బట్టి బిడ్డ పేరుఎందుకుండాలి?

3. నక్షత్రాలను 12 రాశులగా ఎందుకు విభజించారు? వాటి కి మేషం, వృషభం... వంటి పేర్లు ఎందుకు పెట్టారు? చైనావారి రాశులకు వాటికి తేడాలు ఎందుకున్నాయి?

4. రాశి ఫలాలు, గ్రహ ఫలాలు ఒకటేనా?

5. పుట్టిన తేదిని బట్టి జన్మ రాశి ని నిర్ణయించటం ఒప్పు అవుతుందా?

6. ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అంతా ఈ 12 రాశులలో ఉంటారు కదా , అందరి జాతకాలు ఇంచు మించు 12 విధాలగా ఉంటుందా? పత్రికలలో ప్రచురించే రాశి ఫలాలు సరైనవేనా?


7. నక్షత్రాల నుండి వచ్చే కాంతి మనకు చేరటానికి పట్టే సమయం గురించి జ్యోతిష్య శాస్త్రం లో ఏమైనా చెప్పబడిందా?

8. కాలం గడిచే కొద్ది భూ అక్షం లో వచ్చే మార్పులు (ప్రిసేషణ్ అఫ్ ఈక్వినాక్సేస్ ) రాశి ఫలితాల పై ప్రభావంచూపుతుందా, లేదా?

9. నక్షత్రాలలో స్త్రీ, పురుష భేదములు ఉన్నాయా?

10. నక్షత్రాల ఆకర్షణ భూమిపై ఎంత ఉంటుంది?

Comments

Anonymous said…
జూలై 2010 రాశిఫలాల గురించి ఒక బ్లాగులో
http://srikaaram.wordpress.com
ఇలా ఉన్నాయి. వాటిని ఒకసారి చూసి అవి ఎంత వరకు సరిపోయాయో పలిసిలించుకోండి. వాటిని క్షుణ్ణంగా విశ్లేషించండి.
ex:
1.మేష రాశి:బంధువర్గానికి దగ్గరవుతారు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతారు.కొత్తగా పెళ్లయిన జంటతో పరిచయం కాగలదు.నూతన జివన శైలిని అవలంబించే ఆలోచన కలుగవచ్చు.ఈ మాసం వ్యాపారం లాభించగలదు.సంతానం అభివృధ్ధిలోకి రాగలదు.మూడవ వారం బి.పి పరీక్ష చేయించుకోవాల్సి రాగలదు. విష్ణు సహస్రనామం చదవండి.
Anonymous said…
2.వృషభ రాశి: విరోధులను అధిగమించాలనే తీవ్రమైన ఆలోచనలు కలుగవచ్చు.రెండవ వారంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. సరైన సమాచారం సమయానికి రాకపోవటం వలన కొంత వృధా ఖర్చు చేస్తారు.ఉద్యోగస్తులకు కోరుకున్న చోట బదిలీ జరుగగలదు.సన్నిహితుల సహాయం పొందుతారు.నూతన వాహనయోగం ఉన్నది.ఇంటికి సంబంధించిన నిర్ణయాలు రెండవ వారంలో,వ్యాపారానికి సంబంధించినవి నాల్గవ వారంలో తీసుకోవటం మంచిది.
3.మిథున రాశి: జీవితభాగస్వామి వ్యవహారం అర్థం కాదు! ఒక విషయంలోకి లోతుగా వెళతారు. మీ తెలివితేటలు ప్రదర్శనలోకి వస్తాయి.కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.ఉపాధ్యాయులకు మంచి మాసం. కొందరు ఉద్యోగాలు మారగలరు.ప్రేమలో పడ్డవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది.విద్యార్థులు మరి కాస్త పైకి యోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈ మాసం చివర కొత్త అవకాశాలు రాగలవు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.
Anonymous said…
4.కర్కాటక రాశి: రెండవ వారం నుంచి మీ కార్యక్రమాలు ఒక ఊపు అందుకుంటాయి. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. మీకంటే చిన్నవారు వాద్వివాదాలకు దిగగలరు.ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి మంచి ఫలితాలుండగలవు.రసాయనాలతో పని చేసే వారు జాగ్రత్తలు వహించాలి.గతం, స్వగతం కంటే ప్రస్తుతం ఉన్న కాలాన్ని గమనించి ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

5.సింహ రాశి: ఇంటిలోని పెద్దవారి వ్యవహారం కొద్దిగా చికాకు కలిగిస్తుంది.స్థలం మారాలని కొందరు యోచించగలరు. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు సమానంగానే ఉంటాయి. ఒక కోరిక నెరవేరగలదు.మాసం మూడవ వారంలో కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.కొన్ని పానీయాలు సేవించటం వలన ఆరోగ్య సమస్య తలెత్తగలదు. ఇంటిలో పని చేసే స్త్రీలను ఒక కంట కనిపెట్టవలసి యున్నది.

6.కన్య రాశి: కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులున్నప్పటికీ అనుకోని చోటు నుండి డబ్బు అందగలదు.మీరు అనుకున్న కార్యానికి అడ్డంకులు తొలగిపోగలవు.పాత మిత్రుల కలయిక ఉండగలదు.ఇంటిలో కొన్ని పనులు చేయించాల్సి రావచ్చు.ఉద్యోగస్తులు మంచి వార్తలు వింటారు. మాసం రెండవ వారంలో దూరప్రయాణం ఉండగలదు.శ్రీసూక్తం చదవండి.

7.తుల రాశి: సంసారంలో కొన్ని అపశృతులుండగలవు.ప్రభుత్వం వారి వద్ద నుండి జరుగవలసిన పనులు పూర్తి కాగలవు.కొత్త వస్తువులు సేకరిస్తారు. రాజకీయరంగంలోని వారు పట్టుదలతో కార్యం నెరవేర్చుకుంటారు.విదేశీ వ్యాపారం గలవారికి మంచి మాసం.ఇనుము, నూనె వ్యాపారం కలసిరాగలదు.మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించాలి.హనుమాన్ చాలీసా చదవండి.
Anonymous said…
8.వృశ్చిక రాశి: మీ సద్బుధ్ధి మిమ్మలను ఒక క్లిష్టమైన పరిస్థితి నుండి కాపాడగలదు.ఓపికతో నిర్వహించిన బాధ్యతలు రాబోయే రోజులలో మంచి ఫలితాలనివ్వనున్నాయి.నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలున్నాయి.హోటల్, కేటరింగు,ఎలెక్ట్రికల్ రంగం వారికి రెండవ వారం నుండి మంచి ఫలితాలున్నాయి.ఇంటిలో పూలను ఎక్కువగా వాడండి.మానసికంగా చిరాకులు పరాకులున్న వారు మంచి ఫలితాలను పొందగలరు.

9.ధను రాశి: కొద్ది కాలంగా మీరు కొన్ని రంగాలను విస్మరిస్తూ వచ్చి యుండవచ్చు.ఈ మాసం తిరిగి వాటిని పరిశీలించి చూడవలసిన అవసరం ఉన్నది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు వహించాలి.స్థిరాస్తి కలసిరాగలదు. కొన్ని నిర్ణయాలను ఆలస్యం చేయటం వలననష్టపోగలరు.ఉబ్బసం వ్యాధి ఉన్నవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఋణం అందగలదు. క్రీడాకారులకు మంచి మాసం.

10.మకర రాశి: బంధువులు, మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి.మనోరంజకమైన సాధనాల కోసం ఖర్చులు చేయగలరు.వారసత్వం వ్యవహారాలు ముందుకు వస్తాయి.కళాకారులకు ప్రోత్సాహం లభించగలదు. మొదటి రెండు వారాలు మంచి ఫలితాలనివ్వగలవు.మాటలో నిదానం, నిగ్రహం అవసరం.లక్ష్మీ అష్టోత్తరం చదవగలరు.

11.కుంభ రాశి: ఈ మాసం స్త్రీలది పై చేయిగా కనిపించగలదు. మనసు కొన్ని చిత్రమైన అనుభూతులకు లోను కాగలదు.ఉపాసనా మార్గంలో ఉన్నవారికి కొత్త విషయాలు తెలియగలవు. విద్యార్థులకు మంచి మాసం. వైద్యులు వృత్తిలో జాగ్రత్తగా మసలుకోవలసి ఉండగలదు.మీ రాయబారం వలన ఇతరుల సమస్యలకు పరిష్కారం దొరకగలదు.

12.మీన రాశి: సంఘంలో గౌరవం పెరగగలదు. తీర్థక్షేత్రసందర్శనం జరుగగలదు.పట్టు వదలవలసిన కాలం. మూడో వారం ఇతరుల వ్యవహారాలలో జోక్యం మంచిది కాదు. మార్కెటింగు రంగం వారికి ఉత్తర దిశగా చేయు ప్రయాణాలు కలసిరాగలవు.మాసం చివర పై వారితో గట్టిగా మాట్లాడవలసియుండగలదు. లింగాష్టకం చదవండి.
Anonymous said…
This comment has been removed by a blog administrator.
Anonymous said…
This comment has been removed by a blog administrator.
Anonymous said…
శ్రీనివాస్ గారు,
మీరు శక్తినంతా దీని మీద ఖర్చు పేట్టటం ఎమీ బాగా లేదండి. ఇన్నయా గారు ఎన్నొ పుస్తకాలు రాశారు. అవి నేట్ లో ఉన్నాయి. బ్లాగులు చదివేవారు మీరు చెప్పె జ్యోతిష్యం మీద అంతో ఇంతొ అవగాహన ఉన్నవారు. ఈ రోజుల్లో ఎవరైనా ఒక్క పైసా డబ్బు పక్కన వాడికి ఇవ్వాలి అంటె 10సార్లు అలోచిస్తున్నారు. ఇక జాతకాలు మొ|| వాటికి ఎవ్వరు అమాయకం గా డబ్బు తగలేయరు. వారికి ఎంతో లాభం ఉంటే తప్ప. ఇటువంటి పరిస్థిలో మీరు రాసెవి మీకు క్లారిటిని ఇస్తుందేమో గాని ఇతరులకు ఉపయోగం లేదు. మహా ఐతె మార్తాండా అలియస్ ప్రవీణ్ అలియస్ చెరసాల శర్మ లాంటి వారు చదవాల్సిందంతే. దీనికన్నా ఆంధ్ర లో రోడ్లను తక్కువ ఖర్చు తో ఎలా అభివృద్ది చేయ వచ్చు అనే దాని మీద మీ లాంటి ఆచార్యులు దృష్టి కేంద్రికరిస్తే బాగుంట్టుంది.
kodali srinivas said…
@అజ్ఞాత - మీ సలహాలకు ధన్యవాదాలు. మీరు చెప్పే రంగం లో కుడా మన అభిప్రాయాలు వెలుబుచ్చుదాం.
Anonymous said…
మీకు జ్యోతిషంతో పరిచయం బాగా తక్కువని తెలుస్తోంది. నేను జ్యోతిష్కుణ్ణి కాదు కానీ, మీరడిగిన ప్రశ్నల్లో ఒకటి టెక్నికల్ ప్రశ్న, కాబట్టి సమాధానం ఇస్తున్నాను.

చాలామంది అనుకుంటారు జ్యోతిష్యం 27 నక్షత్రాల్ని మాత్రమే చెప్తుంది, నిజానికి కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా, ఎంత అజ్ఞానులు పాతకాలంవాళ్ళు అని. లేదా, మీలాగా ఈ కోటానుకోట్ల నక్షత్రాల్లో ఈ 27 నక్షత్రాల ప్రత్యేకత ఏమిటి అంటారు..

మనక్కనిపించే కోటానుకోట్ల stars ని సంస్కృతంలో తారకలు అంటారు. నక్షత్రాలు అనేది ఒక టెక్నికల్ టర్మ్. అది రాశి చక్రంలో 1/27వ భాగం, ఒక arc మాత్రమే. ‘నక్షత్ర గ్రహ తారాణాం’ అని ప్రాచీన సాహిత్యంలో నక్షత్రాల్నీ, తారకల్నీ వేర్వేరుగా పేర్కొనడం కనిపిస్తూనే ఉంటుంది.

హేతువాదులుగా తమను తాము భావించుకునేవాళ్ళకి జ్యోతిషం చాలా easy and soft target. మరీ డెప్తులేకుండా ritual లాగా చేసే ఇలాంటి విమర్శలు చూసి నవ్వుకోడం తప్ప ఇంకేం చెయ్యలేను.

Btw, if you are interested you can read my articles on the subject in eemaata. Start with this one: http://www.eemaata.com/em/issues/200803/1212.html
It is 4 parts, you can browse the next issues for the remaining parts.
Anonymous said…
Don't try to figer everything. Try to write on what you are good at.
Anonymous said…
పెళుసుబారుతున్న సైన్స్ వాదన
-నాగసూరి వేణుగోపాల్
సైన్స్‌వాదులు ఎవరు అని ప్రశ్నిస్తే-బుల్లి తెరమీద-గ్రహణాల గురించో, బాబా ల గురించో చర్చ వచ్చినపుడు జ్యోతిష్కులతో తలపడేవారు అని నేడు జవా బు రావచ్చు. విశ్వాసం వ్యక్తిగతమైంది లేదా కుటుంబానికే పరిమితమైంది. కానీ సైన్స్ సార్వత్రికమైంది. ఎప్పుడైనా ఎక్కడికైనా పరీక్షకు లోనై సరిగ్గా అవే ఫలితాలు పొందగలిగినపుడే దానిని సైన్స్ అంటారు.

అందువల్ల సైన్స్ ప్రజాస్వామికంగా ఉండడంతో దాపరికం ఉండదు. విశ్వాసంతో ముడిపడిన ఉపాధి ఎంత విస్తృతంగా ఉన్నా-అది పూర్తిస్థాయి పరీక్షలకు నిలబడలేకపోవచ్చు. అందువల్ల వారి వాదనా విధానం పూర్తిగా డిఫెన్స్‌లో ఉంటుంది. చాలా సంఘటితంగా సాగుతుంది. ఏ క్షణమైనా ఈ వాదన తమ జీవిక ను కబళించవచ్చనే భయం చాలా అప్రమత్తం చేస్తుంది. అందుకే ఈ పార్శ్వం వారి ఉపాధి ప్రణాళికలో అంతర్భాగంగా సాగుతూ ఉంటుంది. వీరి వాదనలు గమనిస్తే అంతర్గతంగా సైన్స్ స్ఫూర్తి మీద లాఘవంగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు.

తెలుసుకోవడం, జ్ఞానం, ఆవిష్కారం అనే ప్రయాణం తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో చేరే గమనమే! అది మానవుడికి చీకటిపడటం, వర్షం రావడం, మెరుపు మెరవడం, వరదలు-ఇలా ప్రతి ప్రాకృతికమైన విషయం కూడా భయం కలిగించేది. ఆ భయం కారణంగానే విశ్వాసం, పరాశ్రయభావన బలపడ్డాయి. కానీ, ఈ తెలియని విషయాలను తెలుసుకోవడంతో భయం పటాపంచలు అవుతుం ది.

ఇదే విశ్వాసానికీ సైన్స్‌కూ ఉన్న సంబంధం! అలాగే, అన్ని విషయాలను సైన్స్ వివరించగలదా? అనే ప్రశ్న కూడా ఎదురుకావచ్చు. దాని కోసమే సైన్స్ మరింత తీక్షణంగా, విస్తృతంగా ఆవిష్కరణాపథంలో సాగుతుంది. జన్యు సంబంధమైన పరిశోధనలు కేవలం ఈ ఐదు దశాబ్దాలలో గొప్ప ఫలితాలు సాధించడం అలాగే! ఒకదానిమీద ఆధారపడి మరోటి ముందుకు వెడుతుంది.

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/jul/2/edit/2edit2&more=2010/jul/2/edit/editpagemain1&date=7/2/2010
Anonymous said…
Professor, As far as astronomy is concerned Jyothishya is correct. Don't show your ignorance again and again. Your postings are more rhetoric and have little stuff. Are you really hetuvaadi or just for recognition you labeled yourself as one?
kodali srinivas said…
@నాగ మురళి గారికి: మీకు జ్యోతిష్యం లో అంతో ఇంతో ప్రవేసమున్నట్లు మీ వ్యాసాలు చేదివితే తెలుస్తూనే ఉంది. జ్యోస్యాల ఉబిలో చిక్కుకున్న మీకు జ్యోతిష్యం పై ఇంకా పూర్తిగా విశ్వాసం పోయినట్లు లేదు. హేతువాదం పై నా సైన్సు పైనా మీకు చాల చిన్న చూపు అనుకుంటాను. శాస్త్ర అధ్యయనం వేరు,అభ్యాసం వేరు అని గ్రహించండి. అబ్యాసం సరైన జాతక చక్రం రాయటాని మాత్రమే నన్న విషయం గ్రహించండి. ఇంకా పది మంది గురువుల వద్ద శిష్యరికం చేసినా మీకు ఉన్న సందేహాలు తీరవు. కారణం వంచనా పద్దతిని(లోక్యం?) ఏ గురువు తన శిష్యునికి నేర్పడు. వంచన చేయటం రాక పోతే మీరు చెప్పే జ్యోస్యాలు జనాలు నమ్మరు. అలాగే నేను అడిగే ప్రశ్నలకు జవాబులను అన్వేషించండి. అప్పుడే తోరపడి అభిప్రాయాలు ఏర్పరుచుకోకండి.
kodali srinivas said…
@అజ్ఞాత గారికి - జూలై ౨౦౧౦ రాశి ఫలాల వివరాలు అందించినందులకు ధన్యవాదాలు. చదువరులు -పుట్టిన తేదిని బట్టి కాని, రాశిని బట్టిగాని ఫలితాలు చూసుకొని వాటిలో వాస్తవాలు తెలియజేయగలరు.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...