జ్యోతిష్యం లో నక్షత్రాల పాత్ర , దాని శాస్త్రీయతను తెలుసుకుంటే గాని జాతకాల అసల గుట్టు అర్దం అవదు.
1. ఆకాశంలో మనకు కనపడే నక్షత్రాలు ఎన్ని? కనపడనవి ఎన్ని? వాటిలో జ్యోతిష్య శాస్త్రం లో ప్రస్తావించిన 27 నక్షత్రాలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
2. జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి, జాతకాలకి ఉన్న సంభందం ఏమిటి? జన్మ నక్షత్రాన్ని బట్టి బిడ్డ పేరుఎందుకుండాలి?
3. నక్షత్రాలను 12 రాశులగా ఎందుకు విభజించారు? వాటి కి మేషం, వృషభం... వంటి పేర్లు ఎందుకు పెట్టారు? చైనావారి రాశులకు వాటికి తేడాలు ఎందుకున్నాయి?
4. రాశి ఫలాలు, గ్రహ ఫలాలు ఒకటేనా?
5. పుట్టిన తేదిని బట్టి జన్మ రాశి ని నిర్ణయించటం ఒప్పు అవుతుందా?
6. ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అంతా ఈ 12 రాశులలో ఉంటారు కదా , అందరి జాతకాలు ఇంచు మించు 12 విధాలగా ఉంటుందా? పత్రికలలో ప్రచురించే రాశి ఫలాలు సరైనవేనా?
7. నక్షత్రాల నుండి వచ్చే కాంతి మనకు చేరటానికి పట్టే సమయం గురించి జ్యోతిష్య శాస్త్రం లో ఏమైనా చెప్పబడిందా?
8. కాలం గడిచే కొద్ది భూ అక్షం లో వచ్చే మార్పులు (ప్రిసేషణ్ అఫ్ ఈక్వినాక్సేస్ ) రాశి ఫలితాల పై ప్రభావంచూపుతుందా, లేదా?
9. నక్షత్రాలలో స్త్రీ, పురుష భేదములు ఉన్నాయా?
10. నక్షత్రాల ఆకర్షణ భూమిపై ఎంత ఉంటుంది?
1. ఆకాశంలో మనకు కనపడే నక్షత్రాలు ఎన్ని? కనపడనవి ఎన్ని? వాటిలో జ్యోతిష్య శాస్త్రం లో ప్రస్తావించిన 27 నక్షత్రాలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?
2. జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి, జాతకాలకి ఉన్న సంభందం ఏమిటి? జన్మ నక్షత్రాన్ని బట్టి బిడ్డ పేరుఎందుకుండాలి?
3. నక్షత్రాలను 12 రాశులగా ఎందుకు విభజించారు? వాటి కి మేషం, వృషభం... వంటి పేర్లు ఎందుకు పెట్టారు? చైనావారి రాశులకు వాటికి తేడాలు ఎందుకున్నాయి?
4. రాశి ఫలాలు, గ్రహ ఫలాలు ఒకటేనా?
5. పుట్టిన తేదిని బట్టి జన్మ రాశి ని నిర్ణయించటం ఒప్పు అవుతుందా?
6. ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అంతా ఈ 12 రాశులలో ఉంటారు కదా , అందరి జాతకాలు ఇంచు మించు 12 విధాలగా ఉంటుందా? పత్రికలలో ప్రచురించే రాశి ఫలాలు సరైనవేనా?
7. నక్షత్రాల నుండి వచ్చే కాంతి మనకు చేరటానికి పట్టే సమయం గురించి జ్యోతిష్య శాస్త్రం లో ఏమైనా చెప్పబడిందా?
8. కాలం గడిచే కొద్ది భూ అక్షం లో వచ్చే మార్పులు (ప్రిసేషణ్ అఫ్ ఈక్వినాక్సేస్ ) రాశి ఫలితాల పై ప్రభావంచూపుతుందా, లేదా?
9. నక్షత్రాలలో స్త్రీ, పురుష భేదములు ఉన్నాయా?
10. నక్షత్రాల ఆకర్షణ భూమిపై ఎంత ఉంటుంది?
Comments
http://srikaaram.wordpress.com
ఇలా ఉన్నాయి. వాటిని ఒకసారి చూసి అవి ఎంత వరకు సరిపోయాయో పలిసిలించుకోండి. వాటిని క్షుణ్ణంగా విశ్లేషించండి.
ex:
1.మేష రాశి:బంధువర్గానికి దగ్గరవుతారు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతారు.కొత్తగా పెళ్లయిన జంటతో పరిచయం కాగలదు.నూతన జివన శైలిని అవలంబించే ఆలోచన కలుగవచ్చు.ఈ మాసం వ్యాపారం లాభించగలదు.సంతానం అభివృధ్ధిలోకి రాగలదు.మూడవ వారం బి.పి పరీక్ష చేయించుకోవాల్సి రాగలదు. విష్ణు సహస్రనామం చదవండి.
3.మిథున రాశి: జీవితభాగస్వామి వ్యవహారం అర్థం కాదు! ఒక విషయంలోకి లోతుగా వెళతారు. మీ తెలివితేటలు ప్రదర్శనలోకి వస్తాయి.కొనుగోళ్లు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.ఉపాధ్యాయులకు మంచి మాసం. కొందరు ఉద్యోగాలు మారగలరు.ప్రేమలో పడ్డవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి ఉంటుంది.విద్యార్థులు మరి కాస్త పైకి యోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈ మాసం చివర కొత్త అవకాశాలు రాగలవు.దుర్గా సప్తశ్లోకీ చదవండి.
5.సింహ రాశి: ఇంటిలోని పెద్దవారి వ్యవహారం కొద్దిగా చికాకు కలిగిస్తుంది.స్థలం మారాలని కొందరు యోచించగలరు. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు సమానంగానే ఉంటాయి. ఒక కోరిక నెరవేరగలదు.మాసం మూడవ వారంలో కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.కొన్ని పానీయాలు సేవించటం వలన ఆరోగ్య సమస్య తలెత్తగలదు. ఇంటిలో పని చేసే స్త్రీలను ఒక కంట కనిపెట్టవలసి యున్నది.
6.కన్య రాశి: కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులున్నప్పటికీ అనుకోని చోటు నుండి డబ్బు అందగలదు.మీరు అనుకున్న కార్యానికి అడ్డంకులు తొలగిపోగలవు.పాత మిత్రుల కలయిక ఉండగలదు.ఇంటిలో కొన్ని పనులు చేయించాల్సి రావచ్చు.ఉద్యోగస్తులు మంచి వార్తలు వింటారు. మాసం రెండవ వారంలో దూరప్రయాణం ఉండగలదు.శ్రీసూక్తం చదవండి.
7.తుల రాశి: సంసారంలో కొన్ని అపశృతులుండగలవు.ప్రభుత్వం వారి వద్ద నుండి జరుగవలసిన పనులు పూర్తి కాగలవు.కొత్త వస్తువులు సేకరిస్తారు. రాజకీయరంగంలోని వారు పట్టుదలతో కార్యం నెరవేర్చుకుంటారు.విదేశీ వ్యాపారం గలవారికి మంచి మాసం.ఇనుము, నూనె వ్యాపారం కలసిరాగలదు.మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త వహించాలి.హనుమాన్ చాలీసా చదవండి.
9.ధను రాశి: కొద్ది కాలంగా మీరు కొన్ని రంగాలను విస్మరిస్తూ వచ్చి యుండవచ్చు.ఈ మాసం తిరిగి వాటిని పరిశీలించి చూడవలసిన అవసరం ఉన్నది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు వహించాలి.స్థిరాస్తి కలసిరాగలదు. కొన్ని నిర్ణయాలను ఆలస్యం చేయటం వలననష్టపోగలరు.ఉబ్బసం వ్యాధి ఉన్నవారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఋణం అందగలదు. క్రీడాకారులకు మంచి మాసం.
10.మకర రాశి: బంధువులు, మిత్రులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి.మనోరంజకమైన సాధనాల కోసం ఖర్చులు చేయగలరు.వారసత్వం వ్యవహారాలు ముందుకు వస్తాయి.కళాకారులకు ప్రోత్సాహం లభించగలదు. మొదటి రెండు వారాలు మంచి ఫలితాలనివ్వగలవు.మాటలో నిదానం, నిగ్రహం అవసరం.లక్ష్మీ అష్టోత్తరం చదవగలరు.
11.కుంభ రాశి: ఈ మాసం స్త్రీలది పై చేయిగా కనిపించగలదు. మనసు కొన్ని చిత్రమైన అనుభూతులకు లోను కాగలదు.ఉపాసనా మార్గంలో ఉన్నవారికి కొత్త విషయాలు తెలియగలవు. విద్యార్థులకు మంచి మాసం. వైద్యులు వృత్తిలో జాగ్రత్తగా మసలుకోవలసి ఉండగలదు.మీ రాయబారం వలన ఇతరుల సమస్యలకు పరిష్కారం దొరకగలదు.
12.మీన రాశి: సంఘంలో గౌరవం పెరగగలదు. తీర్థక్షేత్రసందర్శనం జరుగగలదు.పట్టు వదలవలసిన కాలం. మూడో వారం ఇతరుల వ్యవహారాలలో జోక్యం మంచిది కాదు. మార్కెటింగు రంగం వారికి ఉత్తర దిశగా చేయు ప్రయాణాలు కలసిరాగలవు.మాసం చివర పై వారితో గట్టిగా మాట్లాడవలసియుండగలదు. లింగాష్టకం చదవండి.
మీరు శక్తినంతా దీని మీద ఖర్చు పేట్టటం ఎమీ బాగా లేదండి. ఇన్నయా గారు ఎన్నొ పుస్తకాలు రాశారు. అవి నేట్ లో ఉన్నాయి. బ్లాగులు చదివేవారు మీరు చెప్పె జ్యోతిష్యం మీద అంతో ఇంతొ అవగాహన ఉన్నవారు. ఈ రోజుల్లో ఎవరైనా ఒక్క పైసా డబ్బు పక్కన వాడికి ఇవ్వాలి అంటె 10సార్లు అలోచిస్తున్నారు. ఇక జాతకాలు మొ|| వాటికి ఎవ్వరు అమాయకం గా డబ్బు తగలేయరు. వారికి ఎంతో లాభం ఉంటే తప్ప. ఇటువంటి పరిస్థిలో మీరు రాసెవి మీకు క్లారిటిని ఇస్తుందేమో గాని ఇతరులకు ఉపయోగం లేదు. మహా ఐతె మార్తాండా అలియస్ ప్రవీణ్ అలియస్ చెరసాల శర్మ లాంటి వారు చదవాల్సిందంతే. దీనికన్నా ఆంధ్ర లో రోడ్లను తక్కువ ఖర్చు తో ఎలా అభివృద్ది చేయ వచ్చు అనే దాని మీద మీ లాంటి ఆచార్యులు దృష్టి కేంద్రికరిస్తే బాగుంట్టుంది.
చాలామంది అనుకుంటారు జ్యోతిష్యం 27 నక్షత్రాల్ని మాత్రమే చెప్తుంది, నిజానికి కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి కదా, ఎంత అజ్ఞానులు పాతకాలంవాళ్ళు అని. లేదా, మీలాగా ఈ కోటానుకోట్ల నక్షత్రాల్లో ఈ 27 నక్షత్రాల ప్రత్యేకత ఏమిటి అంటారు..
మనక్కనిపించే కోటానుకోట్ల stars ని సంస్కృతంలో తారకలు అంటారు. నక్షత్రాలు అనేది ఒక టెక్నికల్ టర్మ్. అది రాశి చక్రంలో 1/27వ భాగం, ఒక arc మాత్రమే. ‘నక్షత్ర గ్రహ తారాణాం’ అని ప్రాచీన సాహిత్యంలో నక్షత్రాల్నీ, తారకల్నీ వేర్వేరుగా పేర్కొనడం కనిపిస్తూనే ఉంటుంది.
హేతువాదులుగా తమను తాము భావించుకునేవాళ్ళకి జ్యోతిషం చాలా easy and soft target. మరీ డెప్తులేకుండా ritual లాగా చేసే ఇలాంటి విమర్శలు చూసి నవ్వుకోడం తప్ప ఇంకేం చెయ్యలేను.
Btw, if you are interested you can read my articles on the subject in eemaata. Start with this one: http://www.eemaata.com/em/issues/200803/1212.html
It is 4 parts, you can browse the next issues for the remaining parts.
-నాగసూరి వేణుగోపాల్
సైన్స్‌వాదులు ఎవరు అని ప్రశ్నిస్తే-బుల్లి తెరమీద-గ్రహణాల గురించో, బాబా ల గురించో చర్చ వచ్చినపుడు జ్యోతిష్కులతో తలపడేవారు అని నేడు జవా బు రావచ్చు. విశ్వాసం వ్యక్తిగతమైంది లేదా కుటుంబానికే పరిమితమైంది. కానీ సైన్స్ సార్వత్రికమైంది. ఎప్పుడైనా ఎక్కడికైనా పరీక్షకు లోనై సరిగ్గా అవే ఫలితాలు పొందగలిగినపుడే దానిని సైన్స్ అంటారు.
అందువల్ల సైన్స్ ప్రజాస్వామికంగా ఉండడంతో దాపరికం ఉండదు. విశ్వాసంతో ముడిపడిన ఉపాధి ఎంత విస్తృతంగా ఉన్నా-అది పూర్తిస్థాయి పరీక్షలకు నిలబడలేకపోవచ్చు. అందువల్ల వారి వాదనా విధానం పూర్తిగా డిఫెన్స్‌లో ఉంటుంది. చాలా సంఘటితంగా సాగుతుంది. ఏ క్షణమైనా ఈ వాదన తమ జీవిక ను కబళించవచ్చనే భయం చాలా అప్రమత్తం చేస్తుంది. అందుకే ఈ పార్శ్వం వారి ఉపాధి ప్రణాళికలో అంతర్భాగంగా సాగుతూ ఉంటుంది. వీరి వాదనలు గమనిస్తే అంతర్గతంగా సైన్స్ స్ఫూర్తి మీద లాఘవంగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు.
తెలుసుకోవడం, జ్ఞానం, ఆవిష్కారం అనే ప్రయాణం తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో చేరే గమనమే! అది మానవుడికి చీకటిపడటం, వర్షం రావడం, మెరుపు మెరవడం, వరదలు-ఇలా ప్రతి ప్రాకృతికమైన విషయం కూడా భయం కలిగించేది. ఆ భయం కారణంగానే విశ్వాసం, పరాశ్రయభావన బలపడ్డాయి. కానీ, ఈ తెలియని విషయాలను తెలుసుకోవడంతో భయం పటాపంచలు అవుతుం ది.
ఇదే విశ్వాసానికీ సైన్స్కూ ఉన్న సంబంధం! అలాగే, అన్ని విషయాలను సైన్స్ వివరించగలదా? అనే ప్రశ్న కూడా ఎదురుకావచ్చు. దాని కోసమే సైన్స్ మరింత తీక్షణంగా, విస్తృతంగా ఆవిష్కరణాపథంలో సాగుతుంది. జన్యు సంబంధమైన పరిశోధనలు కేవలం ఈ ఐదు దశాబ్దాలలో గొప్ప ఫలితాలు సాధించడం అలాగే! ఒకదానిమీద ఆధారపడి మరోటి ముందుకు వెడుతుంది.
http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2010/jul/2/edit/2edit2&more=2010/jul/2/edit/editpagemain1&date=7/2/2010