Skip to main content

జ్యోతిష్యం-నా ఆలోచనలు (పార్ట్2)


6.సిద్దాంత భాగంలో తప్పు ఉంటె ఫలితభాగం ఒప్పు ఎలా అవుతుందో చెప్పగలరా?

ఎ శాస్త్రం లో అయినా సిద్దాంత భాగం లో లోపం లేకుంటేనే దానికి సంబందించిన పలితాలు సరిగా ఉంటాయి. సిద్దాంత భాగం లోనే దోషం ఉంటె ,ఆ సిద్దాంతాన్ని ఉపయోగించి సాధించే ఫలితాలు ఎట్టిపరిస్థితులలోను సరైనవి కావు,కానేరవు.
మరి జ్యోతిష్యం యొక్క మూల సిద్ధాంతం 'భూకేంద్రక సిద్దాంతం' . ఇది తప్పు అని ఏనాడో రుజువు చేయబడినది. అలాగే చంద్రుడు భూమి కి ఉప గ్రహంగా, రాహువు,కేతువులు మిధ్య అని అందరు అంగీకరించిన విషయమే. క్రొత్తగా యురేనస్, నేప్తున్ ,ప్లూటో వంటి గ్రహాలూ, చాల గ్రహ శకలాలు మన సూర్య కుటుంభం లోనే ఉన్నట్లు తెలుసుకున్నాం. కాబట్టి పాత సిద్దాంతం తప్పుల మయం అయితే దాని ఆధారంగా గణన చేసే జాతకాలు ఒప్పు ఎలా అవుతాయి?


7.ఖగోళ విద్యకు జ్యోతిష్యానికి బేధం ఉందా? లేదా?
కచ్చితమైన భేదం ఉంది. విశ్వం గురించి పరిశోధించి సత్య శోధనకు ఉపకరించే శాస్త్రమే ఖగోళ శాస్త్రం. నేల విడిచి నింగిని పట్టుకొని,అబద్దాలతో,ఉహాగానాలతో మనుషులను మభ్య పెట్టె విద్యే ఈ జ్యోతిష్యం. నిజానికి ఖగోళ శాస్త్రానికి పుట్టిన కుక్కమూతి పిందే ఈ జ్యోతిష్యం. 

గ్రహణాలు గురించి చెప్పటం, జ్యోతిష్యాన్ని చెప్పటం ఒకటి కాదు. ఇంచు మించు ప్రతి 19 ఏళ్ళ ఒక సారి ఈ గ్రహణాలు తిరిగి వస్తుంటాయి.


8.జ్యోతిష్య గ్రంధాలను బట్టి ఫలితాలను చెప్పినప్పుడు అవి సరిపోతే జ్యోతిష్యం గొప్ప అని, సరిపోకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు తప్పు అని చెప్పటం సబబేనా?
నిజానికి జ్యోతిష్యం మాత్రమే దోష పురితమైనది.ఒక్కో సారి జ్యోతిష్యుని ఉహాలు నిజమై అవకాసం ఉండొచ్చు. ఇది కేవలం సంభావ్యతా సూత్రాలను బట్టి జరగవచ్చు. రెండు రెళ్ళు నాలుగు. కాని రెండు రెళ్ళు ఆరు అనే సిద్ధాంతం స్వీకరించి లెక్కలు చేస్తే అవి ఒప్పు ఎలా అవుతాయి? కాబట్టి జ్యోస్యం లెక్కలు తప్పు కావు. వాటినిబట్టి ఉహించె జాతకాలే తప్పు. కాస్తో,కూస్తో లెక్కలు వచ్చిన ప్రతి వాడు జాతక చక్రం లో తప్పు లేకుండాఫలితాలు రాయగలడు. అవి సరిపోతాయా లేదా అన్నది వారి చేతులలో లేని విషయం. ఇది తెలియక క్రెడిట్అంతా జ్యోతిష్య శాస్త్రానికి ముడి వేస్తున్నారు.

9.జ్యోతిష్యం ప్రాధమికంగా దైవ వాదానికి ,మత విశ్వాసాలకు వెతిరేకం కాదా?

జ్యోతిష్యం నిజమైతే కర్మ సిద్ధాంతం తప్పు అవుతుంది. గ్రహ బలం నిజమైతే దైవ బలం శ్యున్యమవుతుంది. అందుకే ఆస్తిక వాదులైన స్వామి వివేకానందడు ,దయానందుడు, పోపు వంటి మత పెద్దలు దీన్నితీవ్రంగా వెతిరేకించారు. జ్యోతిష్యం ఒక మూఢ నమ్మకం గా తీర్మానించారు. కాని నేడు ఆస్తికత్వం పేరుతో జోతిష్యాన్ని బుజాల కెత్తుకు తిరిగేవారు ఎక్కువ అయ్యారు. దీన్ని మూఢ విశ్వాసానికి చిహ్నంగా కాక ఆస్తిక నాస్తిక సంవాదంగా చిత్రికరించారు.


10.చిలక జోస్యం, సోది,పస్తి, అంజనం, శకునం,పలుకు వంటి వాటితో జ్యోతిష్యం ఎకిభావిస్తున్నదా? లేదా?
రాతలు రాజ్యం ఏలమంటే ... గ్రహచారం గాడిదలు కాయమని చెప్పిందని సామెత.
ఎవరి జ్యోస్యం వారిదే. నమ్మేవారిని బట్టి నలుగు పెడతారు.

Comments

Anonymous said…
కొడాలి శ్రీనివాస్ గారికి నమస్కారం..

అభినందనలు,చక్కగా రాస్తున్నందుకు...

రాముడు మిధ్య,రామాయణం మిధ్య,అని కరుణానిధి గారో,కేంద్ర ప్రభుత్వమో అన్నప్పుడు,రామాయణం తీసి చదివిన వాళ్ళని ఎంతో మందిని చూసాను.

దేవుడే,అప్పుడప్పుడు నాస్తికవాదులతో అనిపిస్తాడేమో,ఆస్తికత్వం బలపడటానికి..-వై.వి.ఎస్.
Anonymous said…
మీ అసమాన ప్రతిభ అద్భుతం , మహాద్భుతం! మీలాంటి మేధావులకు జన్మ నివ్వడం తెలుగునేల చేసుకున్న అదృష్టం. మీ పరిశోధన మానవాళిని మూఢనమ్మకాలనే దాస్య సృంకలాలనుంచి విముక్తి చేస్తుందటంలో సందేహం లేదు. మీలాంటి ఆచార్యులు దొరకడం మీ విద్యార్థులు చేసుకున్న అదృష్టం అని సవినయంగా మనవిచేసుకుంటున్నాను.
kodali srinivas said…
మీ అభిమానానికి ధన్యవాదాలు.
Anonymous said…
వూళ్ళో పెళ్ళైతే కుక్కల హడావుడి అన్నట్టు, మీ ఆలోచనలు ఇప్పుడేంటండి, ప్రొఫెసర్ గారు.
Yogeshwer Khandesh said…
కోడలి శ్రీనివాస్ గారు నమస్కారం

జ్యోతిషం అనేది నమ్మకమా ? మూఢ నమ్మకమా ? శాస్త్రమా ? విజ్ఞానమా ?

ఈ చర్చ కి ఒక ముగింపు ఉండాలంటే

మీరు ఒక సారి జ్యోతిష్యం నేర్చుకోండి - అప్పుడు వాస్తవాలు మీకే తెలుస్తాయి .

ఒక సబ్జెక్టు పైన పూర్తీ అవగాహన లేకుండా దాని విమర్శించడం సరికాదు !

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...