Skip to main content

Posts

వాస్తు భూతం మళ్లీ పుట్టింది - గల్పిక

బంగారు భూమిలో  భాగ్య నగరం నడిబొడ్డున నిశరాత్రిలో  ఓ గార్దబం గుడ్డేట్టింది. ఆ గార్దభాండం బళ్ళున బద్దలై  దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ  భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రి లో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో కారు  మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా కురిసింది.  అకస్మాతుగా కనపడిన ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితమన్యులు  బంగారు భూమికి  భూత కీడు దాపురించినదని,  ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని  సెలవిచ్చిచారు.   ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందో నని తెరాసురల  అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభిలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోకిరి...

క్రేజీ ప్రభుత్వానికి స్వాగతం!

దేశ రాజధాని దిల్లి లో 70 శాసన సభాస్థానాలలొ 67 సాధించి అరవింద్ కేజ్రివాల్  ఆధ్వర్యంలో కొలువు తిరబోతున్న జన ప్రభుత్వానికి స్వాగతం.  చలి చీమలు అన్ని కుడి బలమైన సర్పాన్ని చంపినట్లు, గడ్డి పోచలు అన్ని ఏకమై మద గజాన్ని బందించినట్లు సామాన్యులు ఒక్కటై రాజకీయ కీచకులను కిందకు త్రోసి   అద్వితీయ విజయాన్ని ఆమ్ఆద్మీకి  అందించి  తమ ప్రతినిధులను పరిపాలకులుగా  ఎన్నుకోవటం నిజంగా శుభ పరిమాణం.  ఈ ఎన్నికలో  అవినీతిని, అవకాశ కుళ్ళు రాజకీయాన్నిఅమ్ ఆద్మీ పార్టీ  చీపురు కట్టతో శుభ్రం చేసింది.  డబ్బు పెట్టె వారే ఎన్నికలలో పోటి చేయాలనే ధన మధాంధవాదాన్ని పటాపంచలు చేసి సేవా భావం, మంచి వ్యక్తిత్వం ఉన్న ఎవరైనా ప్రజా ప్రతినిదులుగా పోటీచేసి గెలవచ్చు నని ఈ ఎన్నికలు రుజువు చెసాయి. అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం లో వచ్చిన ఈ మార్పు దేశాన్ని ప్రేమించే వారందరికీ సంతోషదాయకం.  గజ కర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలలో ఆరితేరిన కాంగ్రెస్/ బిజె.పి. ల ఎత్తులను చిత్తు చేసిన  ఆమ్ ఆద్మీ వారి ప్రజా ప్రభుత్వం ప్రగతి పధంలో...

వాస్తు -బంగారు తెలంగాణ

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తువశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే తెగులు నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి.  దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా ఏ అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది.  ఈనాడు సౌజన్యంతో  తెలంగాణ ముఖ్య మంత్రి గారికి కొత్తగా వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తుపై పిచ్చిఅభిమానం ఉంటె వారి సొంత ఇంటికి, అదీ చాలకపోతే తెరాస పార్టీ తెలంగాణ భవనంకు, ఇంకా సరిపోకపోతే వాళ్ళ స్థిరాస్తులకు సొంత డబ్బుతో వాస్తు సరి చేసుకోవాలి. పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వాస్తు వక్ర దృష్టి రాష్ట్ర సచివాలయం పై పడింది.  ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట.(ఎవరు చెప్పారు?) గత చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట. అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వ...

నవ్యాంధ్ర రాజధాని - రాజకీయం

కేవలం 13 జిల్లాలకు ఇంత పెద్ద రాజధాని కావాలా? దానికొరకు  ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా? ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి?  ఇత్యాది యక్ష ప్రశ్నలతో ఈ మధ్య కొందరు బ్లాగర్లు, మేతావులు  ప్రజా పరిరక్షణ పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు.ఈ వాదన చేసే వారు కొన్ని వాస్తవాలు గ్రహించాలి.  ఇది అవశేష13 జిల్లాలకు రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అనే స్పృహ ఉండాలి.  ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి.  అలాగే రాజధాని అంటే అసంబ్లీ హాలు  ... మాత్రమే అనటం హాస్యాస్పదం. ఈ వాదన చేసే  వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి . చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానం తో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు. అది ముంబాయి, కొలకొత్త, హైదరాబాద్ వంటి అస్తవ్యస్త మహా నగరాలు గా మారకూడదనే ముందు చూప...

నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని

రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలా కొత్త రాజధాని ని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించుకొనే సదావకాశం మనకు వచ్చింది.  రాజధాని రూపురేఖలు గురించి, దాని ప్రణాళిక గురించి  అర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN  PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ  - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.  ఈనాడు రాజధాని రాజకీయం రగడ పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.  "వసతి ఇతి వాస్తు "  - అని నిర్వచనం.  వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు.   ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను  'దుర్గ /నగర వాస్తు '  పేరుతో  ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండల పై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మిం...

జై తెలుగు తల్లి! జై తెలంగాణ ! జై ఆంద్ర ప్రదేశ్

తెలంగాణ రాష్ట్రం గా ప్రత్యేక జీవనం గడపుటానికి కోటి ఆశలతో పరుగిడితున్న  సోదర తెలుగు ప్రజానీకానికి  శుభాశ్వీసులు. రాష్ట్రం గా విడిపోయి అన్నదమ్ములగా కలిసుండాలనే మీ / మా కోరిక నెరవేరాలని ఆశిద్దాం. స్వలాభం తో  దాయదులను రెచ్చగొట్టే రాజకీయాలను చేసే నీచులను దూరంగా పెడదాం. అభివృద్ధి చేసే పాలన కావాలి. తెలుగు వారు  అందరు  అభివృద్ధి చెందాలి.  అప్పుతో లోటు బడ్జెట్ తో , రాజధాని లేకుండా ఒంటరిగా ఉన్న సోదర ఆంధ్రుల పై సానుభూతి చెపే ఓదార్యం రావాలి. అత్యధిక తెలుగు జనం ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నారన్న సంగతి మననం చేసుకోండి. సమ న్యాయం అంటే అపహాస్యం చేయకండి.   5 కోట్ల సీమా ఆంధ్రులలో 4 కోట్లకు పైగా ప్రజలు కనీసం ఒక సారి కుడా హైదరాబాద్ కు రాలేదన్న సంగతి మరిచి పోకండి. వారిని ద్వేషించ వద్దు   తెలుగు జాతి మనది.  ఇది నిండుగా వెలగాలి.  మన నినాదం  జై తెలుగు తల్లి!   జై తెలంగాణ!  జై ఆంద్ర ప్రదేశ్ !

నీచ రాజకీయాలకు సమాధి కట్టండి

రేపు జరగబోయే అసంబ్లీ, లోకసభ ఎన్నికలలో ప్రజలందరూ విజ్ఞత తో ఆలోచించి మన రాష్ట్రం లో నెలకొన్న ఈ నీచ రాజకీయాలకు సమాధి కట్టండి. కొన్ని నిజాలు చెప్పుకొందాం  1. గత 10 ఏళ్లగా ఈ రాష్ట్రాన్ని, మరియు ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ అన్నది గుర్తుంచుకోండి. అలాగే ఈ రాష్ట్రంలో ఆపార్టీ తరుపున YSR  ముఖ్య మంత్రిగా పనిచేస్తూ , కేంద్రంలో తల్లి కొడుకులకు బాసటగా ఉన్నాడనేది వాస్తవం. మంచి అయినా చెడు అయినా ఆయనుకు వాటా ఉంది. 2. కాలం కలిసి రాక YSR అర్ధాంతంగా అసువులు బాసితే...ఆయన  పదవి కోసం , అయన పుత్ర రత్నం అదే పార్టీ లో అంతర్గత కుమ్ములాటల కు దిగి , పదవి దక్కలేదని, ఆవేశపడి జగన్ రెడ్డి గారు వేరే కుంపటి 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ' పేరుతో పెట్టిరు.  దాన్ని YSR కాంగ్రెస్ అని ముద్దుగా పిలుచుకొని అదొక కొత్త పార్టీ గా భ్రమ పెట్టారు. నిజానికి YSR కాంగ్రెస్ కు సోనియా కాంగ్రెస్ కు పెద్ద తేడా లేదు. ఒకే తాను ముక్కలే.  కాంగ్రెస్ చొక్కా వదిలి నీలం చొక్కా తొడిగారు. ఈ రెండు కాంగ్రెస్ లు 'జరాసంధుడి' వలె ఒకటే తనువు, ఒకటే మాట, ఒకటే బాట. కాంగ్రెస్ ప్రతి బింబమే ఇది ....