Skip to main content

నవ్యాంధ్ర రాజధాని - రాజకీయం

కేవలం 13 జిల్లాలకు ఇంత పెద్ద రాజధాని కావాలా?
దానికొరకు  ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా?
ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? 
ఇత్యాది యక్ష ప్రశ్నలతో ఈ మధ్య కొందరు బ్లాగర్లు, మేతావులు  ప్రజా పరిరక్షణ పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు.ఈ వాదన చేసే వారు కొన్ని వాస్తవాలు గ్రహించాలి. 

ఇది అవశేష13 జిల్లాలకు రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అనే స్పృహ ఉండాలి. 
ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి. 
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి. 
అలాగే రాజధాని అంటే అసంబ్లీ హాలు  ... మాత్రమే అనటం హాస్యాస్పదం. ఈ వాదన చేసే  వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి .
చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానం తో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు.
అది ముంబాయి, కొలకొత్త, హైదరాబాద్ వంటి అస్తవ్యస్త మహా నగరాలు గా మారకూడదనే ముందు చూపుతో సరైన పట్టణ ప్రణాళిక రూపొందించుతున్న వారికి వీలైతే మంచి సలహాలు ఇవ్వండి.
భూ సేకరణ కంటే భూ సమీకరణ  అనేది అందరి మంచి కొరకు ఎంచుకొన్న పధకం. 
అయితే విజయవాడ  రాజధాని అయితే తమ పొలాలు రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇచ్చి గజాల లెక్కన అమ్మితే నాలుగింతలు డబ్బు వస్తుందని అత్యాస పరులకు భూ సమీకరణ కడుపు మంట గానే ఉంటుంది. వీరికి మద్దత్తు పలికేవారికి ఓట్ల పేలాలు దొరుకుతాయన్న దురాశ.   


ఇకపోతే రాజధాని కొరకు పచ్చని పంట పొలాలు బలి పెట్టాలా అన్నారు. 
నిజానికి అక్కడ సేకరణ చేసే భూమిలో దాదాపు 70 శాతం మెట్ట భూమి అని, వాటిలో కొన్ని వరద ముంపు చేలు అని తెలుసుకొని వ్యాఖ్యానిస్తే బాగుండేది. 
పంట పండించే రైతులు ధర లేక చాలా ప్రాంతాలలో వరి పండించటం మానిన సంగతి తెలిస్తే ఇలాంటి స్వార్ద వాదుల తిండికి డోకా లేదన్న విషయం అర్ధం అవుతుంది.  
ఇక్కడ భూములలో సాగు ఆగితే ఇదే బకింగ్ హం కాలువ కింద నీరు అందని పొలాలు రెట్టింపు పరిణామంలో కాలువ చివర ప్రకాశం జిల్లాలో ఉన్నాయన్న విషయం ఇక్కడికి వచ్చి చూచి తెలుకొండి. 

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు లక్షల కోట్లు దండుకొన్న వారికి వారిని నిస్సిగ్గుగా బలపరిచే వారికి ప్రతి పనిలోనూ కోట్లు దండుకోవటమే తెలుసు, ఇలాంటి వారి పోకడల వల్లే ఆంధ్రులు చులకన అయారన్న సంగతి తెలుసుకోండి. 
అలాగే రైతులు - రైతు కూలీలు తరతరాలుగా అలాగే బ్రతకాలనటం మానవత్వం అనిపించుకోదు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి ఇతర వ్యపకాలలోకి వెళ్ళారు. 
రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి , వాటికి గిట్టు బాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే. 
సరుకు లభ్యత ఎక్కువ ఉంటె ధర తక్కువ ఉంటుందన్న వ్యాపార సూత్రం అర్ధం అయితే పంట పొలాలు పోతున్నాయన్న ఏడుపు రాదు. 
అలాగే రైతు కులీల విషయం లో కూడా ఆందోళన అనవసరం. నూతన రాజధానిలో మరింత మెరుగైన ఉపాధి లభిస్తుంది.  పూర్వం వాషింగ్ మెషిన్స్ కొత్తగా వచ్చినప్పుడు బట్టలు ఉతికే వారికి ఉపాధి ఎట్లా అని ఆందోళన చేసిన వారున్నారు. ఇంకా ట్రాక్టర్స్, ప్రోక్లేన్లు వచ్చినపుడు కుడా ఇలాంటి వాదనలే వినిపించాయి. 

దగాపడి  కుక్కలు చింపిన విస్తరిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ను సొంత కాళ్ళపై నిలబెట్టటానికి  జరుగుతన్న ప్రయత్నంలో అడ్డుతగులుతున్న మీ స్వార్ద రాజకీయాన్నివదలి పెట్టండి. లేదా చరిత్రహీనులుగా మారతారు.  
వీలైతే  మీ వంతు సహాయసహకారాలు అందించండి.   

Comments

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్తితిలో ఉన్న రాష్ట్రానికి రాజధాని పేరుతొ దుబారా చేయడానికి దుడ్డు ఎక్కడ నుండి వస్తుంది?
kodali srinivas said…
మనస్సు ఉంటె మార్గం ఉంటుంది, ఈ నాటి ఆంధ్రుల పేదరికం తాత్కాలికమే. వారు మానిసికంగా పేదవారు కారు. తెలంగాణా పేరుతో జరిగిన కుట్ర రాజకీయం నుండి త్వరలోనే బయటపడి ఉవ్వెత్తున తారాజువ్వల పైకి ఎగరటం తధ్యం. నవ్విన నాప చేనే పండిద్ది. దుబరాకు దూరదృష్టి కి తేడా తెలిస్తే రాజధాని పెట్టె ప్రతి పైసా భావితరాలకు బాగు కొరకు పెట్టె పెట్టుబడి అని గ్రహించ గలరు
శ్రీనివాస్ గారూ, మీరు చెప్పినవి బాగానే ఉన్నాయి కానీ ఇది ఎలా జరుగుతుందో కోరవయ్యింది. ఒకవేళ సరేనని ఒప్పుకున్నా అది జరిగాక ఇటువంటి grandiose schemes మొదలు పెట్టొచ్చు కదా!

ప్రతిదానికి తెలంగాణా మీద పడడం ఎందుకు? చెప్పినవి చేసి చూపిస్తే తెలంగాణా వారు కూడా హర్షిస్తారు.
Anonymous said…
తొక్కలో ముక్కలా, మరి తమరి అడ్డగోలు ఏడుపు ఎందుకో? పాక రాష్ట్రం దుడ్డు సంగతి నీకెందుకు మీ బంగారు తెలంగాణ చూసి మురిసి ముక్కచెక్కలు కాక?
కుక్కతోక వొంకర తొక్కలోముక్కల నోటి కంపు ఒకటే.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...