రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ కి ఒక రాజధాని నిర్మించుకోవాలిసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇలా కొత్త రాజధాని ని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించుకొనే సదావకాశం మనకు వచ్చింది.
రాజధాని రూపురేఖలు గురించి, దాని ప్రణాళిక గురించి అర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.
ఈనాడు రాజధాని రాజకీయం రగడ పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
రాజధాని రూపురేఖలు గురించి, దాని ప్రణాళిక గురించి అర్హత ఉన్నా లేకున్నా ప్రతి వారు,ముఖ్యంగా నగర రూపురేఖలు (TOWN PLANING) గురించి కనీస పరిజ్ఞానం లేకుండా తమకు తట్టిన ఆలోచనలు చెప్పుతూ - ప్రజలను తప్పు దారి పట్టిస్తూ స్వార్ద రాజకీయం చేస్తున్నారు.
ఈనాడు రాజధాని రాజకీయం రగడ పై అందరకి ఒక అవగాహనకు రావటానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.
"వసతి ఇతి వాస్తు " - అని నిర్వచనం.
వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు.
వసతి అంటే నివాసానికి సంబందించిన విషయాలను తెలిపేదే వాస్తు.
ప్రాచీన వాస్తు గ్రంధాలలో రాజధానికి సంబంధించిన విషయాలను 'దుర్గ /నగర వాస్తు ' పేరుతో ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిలో రాజధానికి సంబంధించిన విషయాలలో రక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించారు. వీటిలో కొండల పై కట్టేవాటిని 'గిరి దుర్గం' అని చుట్టూ నీరు ఉండే ప్రదేశాలలో నిర్మించే వాటిని 'జల దుర్గం' అని ,అడవిలో కట్టే వాటిని 'వన దుర్గం' అని, సాధారణ ప్రదేశం లో నిర్మించితే ' భూ దుర్గం' అని వర్గీకరించారు. శత్రు భయం లేని చోట భూ దుర్గాలు సర్వ శ్రేష్టం అని చెప్పబడింది.
రాజ్యానికి మధ్యలో, నలుమూలల నుండి రాకపోకలకు అనువుగా ఉండేలా రాజధానిని నిర్మించాలని, అది నివాస యోగ్యం ఉండాలని చెప్పారు. మహా భారతం లో శ్రీకృష్ణుడు పాండవుల కొరకు ఖాండవ వనాన్ని నిర్దాక్షణ్యంగా నిప్పు పెట్టి ఇంద్రప్రస్థం పేరుతో వన దుర్గాన్ని, తన కొరకు సముద్రంలో ద్వారక పేరుతో జల దుర్గాన్ని నిర్మించాడని చెప్పబడినది. అలాగే చరిత్ర పుటలు తిరగేస్తే బోలెడన్ని కొండలపై కట్టిన గిరి దుర్గాలు, నదీ తీరం లో వెలిసిన రాజధానులు దర్శనం ఇస్తాయి.
అలాగే నదికి ఉత్తర తీర దిశలో నిర్మించే నగరాన్ని 'సౌమ్యపురం' అని, దక్షిణ తీరం లో కట్టే వాటిని 'ధర్మ పురం' అని చెపుతూ నదికి ఇరు తీరాలలో నగరాలు నిర్మించ వచ్చునని చెప్పబడింది. నగరానికి ఉత్తర దిశలో మాత్రమే నీరు ఉండాలనే సిద్దాంతం కుడా తప్పే .
అయితే నివాసం గా ఏ ప్రదేశం శ్రేష్టం అనే విషయం గురించి 13 వ శతాబ్దికి చెందిన సుమతీ శతక కవి బద్దెన ఒక వాస్తవిక వాస్తు సూత్రం చెప్పాడు
అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
ఋణము ఇచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడు ప్రవహించు నదియును విద్యావంతుడు గల గ్రామమందు నివసించుము. వారు లేనట్టి గ్రామము నందు నివసించకు అని చెప్పిన మాట నిత్య సత్యం.
ఇవి ఆనాటి రాజుల రాజధానులకు సంబందించినవి అయినా ఈ లక్షణాలు నూతన ప్రజా రాజధానికి కుడా అవశ్యమే. రాజధాని అనేది పరిపాలన కొరకు మాత్రమే పరిమితం కాకుండా ఉపాది కల్పనకు ఒక చోదక స్థావరం గా ఉండాలి
ఉన్నంతలో ఈ రాజధాని లక్షణాలు విజయవాడకు మాత్రమే ఉన్నాయి. పరిశ్రమలు కట్టగలిగే ఆర్దిక బలం గలవారు, విద్యావంతులు, వైద్యులు, ఎల్లప్పుడూ పారే కృష్ణా నది తో నీటి వసతి ... ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే ఇది నివాస ప్రదేశం గా ఆనాటి నుండి నేటివరకు విరాజిల్లుతున్నది. అలాగే నవ్యాంధ్ర ప్రదేశ్ కు ఇది నడిబొడ్డు. రాష్ట్రం నలుమూలల నుండి రాకపోకలకు అనువైన ప్రదేశం. రోడ్డు -రైలు -విమాన మార్గాలు ఉన్న ప్రదేశం.
సృజనాత్మక ప్రదేశం, శత్రు భయం లేని ప్రాంతం. సురక్షిత స్థలం. ప్రాచీన చరిత్ర గల పోతు గడ్డ.
కొందరు ప్రచారం చేస్తున్నట్లు భూకంపాలు, తుపానుల వల్ల పెద్ద ప్రమాదాలు ఏమి రావు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో వీటిని అధికమించ వచ్చు.
ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరం కొరకు ఐదు వేల ఎకరాల పంట భూములు పణంగా పెట్టలేమా? ఇలా వాదిస్తే సాగర్, శ్రీశైలం, పులిచింతల వంటి ప్రాజెక్టులు కట్టేవారమా? రేపు పోలవరం వద్దా? ఒకప్పుడు ఇలాంటి వాదనే తెచ్చి విజయవాడను రాజధానిగా కాకుండా అడ్డుకున్నారు.
కృష్ణా నదికి ఇరు ప్రక్కల విజయవాడ - తుళ్ళూరు - గుంటూరు ప్రాంతాలతో నదీ ముఖ రాజధానిగా ఇది విరాజిల్లుతుంది అనే అభిప్రాయం మేదావులలో ఉంది.
నగర రూపకల్పన నగర రూప శిల్పులు చేయాలే కాని రాజకీయ వేత్తలు కాదు. రాజధాని నగర వైశాల్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనే సాంకేతిక విషయాల జోలికి మనం వెళ్ళటం మంచిది కాదు.
నూతన రాజధాని నిర్మాణము లో స్థానిక ప్రజలలో అపోహలు కల్పించి అడ్డు పుల్లలు వేసి చరిత్ర హీనులు కాకండి.
ఇప్పటికే ఆంధ్రులకు తీరని అన్యాయం చేసి లక్షలు బొక్కిన పంది కొక్కులు సన్నాయి నొక్కులు తో సరికొత్త కుట్రకు పన్నాగాలు వేస్తున్నాయి. ఇలాంటి వారిని దరిచెరనివ్వరాదు
భావి తరాలు భవిషత్ ను దృష్టి లోనుంచుకొని సొగసైన, సౌకర్యవంతమైన, సుసంపమైన పచ్చని పర్యావరణ హితమైన సుందర రాజధానిని తెలుగు జాతి గర్వపడేలా, పరులు మెచ్చేలా గొప్పగా నిర్మించుకుందాం.
ఈ బృహత్తర మహా నగర నిర్మాణం లో మనం సైతం సహాయ సకారాలు అందించుదాం.
మరి కొన్ని వాస్తు విషయాలకు ఈ కింది లింక్ లో చూడగలరు
http://vaasthuvidya.blogspot.in/2015/01/2.html

Comments
అప్పిచ్చువాఁడు వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
చొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
(ఇతర మార్పులు: విరామచిహ్నాలు వాడటం సంప్రదాయం కాదు. విసంధిగా వ్రాసినప్పుడు ద్విజుడున్ చొప్పడిన అనే వ్రాయాలి. వ్యాకరణకార్యం జరిగినట్లైతే దివిజుడుం జొప్పడిన అని వ్రాయాలి. ఇక్కడ ఎలాగైనా వ్రాయవచ్చును. కాని 'ద్విజుడున్ జొప్పడిన' అనకూడదు. వ్యాక్రరణకార్యం లేనప్పుడు చొ అనేది జొ గా మారదు కదా.)
వ్యాస ఉద్దేశాన్ని గ్రహించండి. హేతు బద్దత అనేది కాలాతీతం.
ఈ విషయం లో మీ శంక ఏమిటో , ఎందుకో తెలిపితే ... బాగుంటుంది