Skip to main content

Posts

వర్షాల కోసం వరుణ యజ్ఞం !!!

కలి కాలం ... కాదు , కాదు కల్ల కాలం !!! వానలు కురవాలి వాన దేవుడా ! చెరువులన్నీ నిండాలి వాన దేవుడా !! వానలు కురవాలని, కప్పలకు పెళ్ళిళ్ళు జరుపుతూ జానపదులు పాడుకునేలల్లాయి పదాలు నేడు ప్రభుత్వాన్ని నరిపే నాయకాగ్రేస్వర్లు సెలవిస్తున్నారు. వర్షాల కోసం వరుణ యజ్ఞం చేయాలని, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు, నమాజులుచేయటానికి మన దైవ దూతలు ఆజ్ఞలు జారిచేస్తున్నారు. ఇంతకంటే దిక్కుమాలినదగాకోరు తనం ఎక్కడా కానరాదు. ఆదిమ సమాజంలో, వర్షాలు ఎప్పుడు పడతాయో,ఎలా పడతాయో తెలయని కాలంలో, ప్రజలు వర్షాల కోసం వరుణయజ్ఞం చేసారంటే తప్పులేదు. కాని విజ్ఞానం మెండుగా వున్నా, నేడు వానలు కురవాలని యజ్ఞాలు,యాగాలుచేయాలనటం, ప్రజల్లో మూఢ నమ్మకాలను ప్రోస్తాహించటమే. ఇలా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయటంక్షమించరాని నేరం. ప్రజలను మూఢ నమ్మకాల్లో ముంచి తమ పబ్బం గడుపుకునే ఇలాంటి రాజకీయ రాభంధులను తరిమి తరిమి కొట్టాలి.

శ్రీ శ్రీ /నార్ల పై స్టాంప్స్ విడుదల చేయాలి

ఈ సంవత్సరం మహా కవి శ్రీ శ్రీ మరియు విఖ్యాత పాత్రికేయులు , కవి శ్రీ నార్ల వారి శత జయంతులు జరుగు చున్న వేళ వారి గౌరవార్థం ప్రతేక తపాల భిళ్ళలు విడుదల చేసేలా ఆయా శతజయంతి ఉత్సవ సంఘాలు కృషి చేయాలి . తపాల బిళ్ళల పై తెలుగు హేతువాదులు ఇంతకుముందు మన తెలుగు హేతు వాదుల పై మూడు స్టాంప్స్ వచ్చాయి . వారి పై విడుదలైన స్టాంప్స్ వివరాలు ౧ . వేమన విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యా లు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, వేమన . ఆటవెలిది తో అద్భుతమైన కవిత్వం , అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, వి లువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, హేతువాది యోగి వేమన. ౨ . త్రిపురనేని రా మస్వామి కవిరాజు గా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది, రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి ౧౮౮౭ అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు. ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలను సాథనముగా త్రిపురనేని ...

తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు

లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేక తపాల బిళ్ళలను వి డుదల చేసి , వారి కృషిని ముం దు తరాలకు గుర్తుండేలా పదిల పరుస్తాయి . అలాగే ఒక జాతి సంస్కృతి , సాంప్రదాయాలపైన , వేష భాషల పైన , వైతాళికుల పైన ప్ర త్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు . వీటిని బట్టి ప్రపంచ వ్యా ప్తంగా ఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు . మన పోస్టల్ శాఖ వారు తెలుగువారిపై వెలువరించిన స్టాంప్స్ గురించి తెలుసుకుంటే ఈ విషయంలో మనం ఎంత ఎనుకున్నమో అవగతం అవుతుంది . భారత ప్రభు త్వం ఇ ప్పటి వరకు వెలువరించిన షుమారు ౪౦౦౦ స్టాంప్స్ లో తెలుగు వారి పైన , తెలుగు జాతి పైన విడుదల చేసినవి కేవలం ౪౦ మాత్రమే అంటే మన వారి పై చూపుతున్న చిన్న చూపు అర్ధమోతుంది . రాష్ట్రపతి , ప్రధాన మంత్రి వంటి వారికి , వారి మరణా న్తరం ప్రత్యేక తపాల భిళ్ళను విడుదల చేయటం ఆనవాయితి . అయితే కీ . శే . మన పి . వి నరసింహా రావు గారికి , సంజీవ రెడ్డి గారికి ఇంతవరుకు స్టాంప్స్ విడుదల చేయలేదంటే వారి పట్ల , మన తె లుగు జాతి...

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం !

ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది. జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది. అందుకే సమాజ శ్రేయసును దృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను, అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా, సున్నితంగా, నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం.  త్వరలో మాచే ప్రచురించే పుస్తకం "వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను. తగిన పారితోషకం ఉంటుంది.  అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి. వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటం లో  మీవంతు సహకారం అందించండి.

వాస్తు పితలాటకం !!!

వాస్తు పిత లాటకం !!! కొత్త మంత్రులుకు కార్యాలయాల కేటాయిపులోవాస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నరన్న వార్తలు వింటుంటే మన పరి పాలకుల ప్రతిభ నామమాత్రమేనని, వాస్తు బలం మాత్రమే ప్రజలకు/ దేశానికి శ్రీరామ రక్ష అని అర్థమోతున్నది . య థా రాజా - తథా ప్రజా ఇలాంటి మూఢవిస్వసాలున్న వారి పాలనలో ప్రజలందరి భవిష్యత్తు ఆధార పడి ఉండటం మన వ్యవస్తలో ఉన్న ప్రధాన లోపం .వ్యక్తిగత విశ్వాసాలు ప్రజల ఫై రుద్దే రాజకియనయుకుల తీరు మరేదేన్నటికో! రాజకీయ నాయకులందరికీ కార్యా కారణాల పై శి క్ష ణా తరగతులు పెడితే బాగుంటుదేమో ఆలోచించండి .

ఎలక్షన్లు

యాడాదికో తూరి అమ్మోరి జాతర ! ఐదేళ్ళకో సారీ ఎలక్షన్ల తిరునాళ్ళు!! మందు , విందు , పొత్తులు డబ్బులు , డప్పులు , దండలు ,దండాలు వాగ్ధానాలు - అంకమ్మ శివాళ్ళు షరా మాములే ! మూగజీవాల రోదనలతో ముచ్చటగా ముగిసిన జాతర అమ్మవారు గుడిలోకి ... అయ్యవారు గద్దె ఫైకి !! కోరికలు తిరుతాయన్న ఆశతో భక్త జనం ఐదేళ్ళు ఎదురుచూసే పిచ్చి జనం ...

హేతువాదం ఎందుకు ?Hetuvaadam Enduku?

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు "హేతువు" లేదా "కారణం" అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. (Rationalism, a philosophical position, theory, or view that reason is the source of knowledge) అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం. స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత. హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం. హేతువాదం సమాజంలో బలంగా ఉంటేనే ప్రగతిని సాధించగలం. మూడనమ్మకాలు,అశాస్త్రీయమైన భ...