Skip to main content

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 5

    వాస్తు పేరుతో సమాజంలో మౌఢ్యం రాజ్యమేలుతుందని, వాస్తు ఫలితాలు చూపి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వాస్తు ఫలితాలలో నిజం ఏమాత్రం లేదని, రావిపూడివారు 'వాస్తువు శాస్త్రమా? ' లో అడుగడునా పలుమార్లు నొక్కిచెప్పారు. ఇలా ఇంతకు ముందే వాస్తు ఫలాలు అబద్దాలని చెప్పిన ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, హేతువాదులు, నాస్తికులు అనేక మంది ఉన్నారు. వీరిలో అత్యధికులు వాస్తు శాస్త్రం అనేది ఒకనాటి భారతీయ నిర్మాణ శాస్త్రం అనే వాస్తవాన్ని అంగీకరించటానికి ఏమాత్రం సంకోచించ లేదు. కేవలం రావిపూడి వెంకటాద్రి వంటి ఒకరిద్దరు మాత్రమే ఈ వాస్తవాన్ని గ్రహించటానికి సంసిద్దంగా లేరు.
    ఏ విషయమైనా విమర్శకు గురి అయితేనే దానిలో లోటుపాట్లు బహిర్గతం అవుతాయి. క్రీ.పూ.4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే 16వ శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉండేవి. వీరి రచనలను విమర్శించటం ఆనాడు మత ద్రోహం గా భావించేవారు. అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. ఇది తప్పు అని గెలీలియో నిరూపించాడు. పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా రుజువు చేశాడు. సిద్ధాంతం, ప్రయోగం, రుజువు చేయగలిగిన ఇలాంటి వాటిని మనం శాస్త్రీయ ప్రయోగాలని అంటాం. భౌతిక ప్రయోగ పరిధిలోకి రాని అభౌతిక వాస్తు ఫలితాలను ఎలా రుజువు చేయగలరో రావిపూడి వారు సెలవియ్యాలి. మరల వారే వాస్తు ఫలితాలు వాస్తవం కాదు కాబట్టి వాస్తవం కానిదేదీ శాస్త్రం కావడానికి వీలు లేదని అంటారు. "పూర్వం వాస్తు శిల్పులు (వాస్తు పండితులు కారు సుమా) గృహనిర్మాణంలో ఆయా ప్రాంతాల్లో దొరికే సామాన్లను బట్టి వాటి గట్టితనాన్ని బట్టి, అవి మోయగలిగే బరువును బట్టి గదుల కొలతలు నిర్ణయించేవారు" అని అంటూ "ఇల్లు కట్టించే వాడి వాస్తువు వేరుగా పడగొట్టించే వాడి వాస్తువు వేరుగా ఉండేది శాస్త్రం ఎలా అవుతుంది?" అని పరస్పర విరుద్ధంగా ప్రశ్నిస్తారు. 
    ఇంకా వారి పుస్తకానికి టాగ్ లైన్ 'Is Geomancy a Science' అని పెట్టారు. చైనాలో స్మశానంలో ముగ్గులు లేసి రంగులు చల్లి మంచి చెడులు చెప్పే మార్మిక కళను జియోమెన్సీ అని అంటారు. జియోమెన్సీ తో వాస్తువుకి ఏమి సంభంధం ఉందో వారికే తెలియాలి. తాత మోకాటికి అవ్వబోడి తలకు ముడి వేసినట్టు వాస్తును జియోమెన్సీ కి లంకె పెట్టారు. రావిపూడి వారి రాతల తీరు చూస్తే ఎక్కడ వాస్తును ప్రాచీన నిర్మాణ శాస్త్రంగా అంగీకరించవలసి వస్తుందోనన్న తడబాటు వాటిలో కన్పిస్తుంది.

రాజీపడని విజ్ఞానం

    వాస్తువు శాస్త్రమైతే దానికి ఉన్న ప్రాతిపదికలు ఏమిటో చెప్పాలని రావిపూడి గారు పదేపదే అడిగారు. వారు ఒప్పుకున్నా లేకున్నా వాస్తు అనేది ముమ్మాటికీ ప్రాచీన భారతీయ నిర్మాణ శాస్త్రమే. ఇది సమగ్రమైనదా, లోటుపాట్లు లేవా అనే విషయం ఇక్కడ చర్చకాదు. చరిత్రను పరిశీలిస్తే వాస్తు శాస్త్రం 10వ శతాబ్దం వరకు ప్రగతి పథంలో పయనించి ఆతరువాత ఎదుగూ బొదుగూ లేక నిర్జీవ శాస్త్రంగా మిగిలిపోయింది అని తెలుస్తుంది. అందువల్ల ఈ శాస్త్రంలో ఉన్న నిర్మాణ విషయాలు నేటి ఆధునిక నిర్మాణాలకు ఎంత మాత్రం ఉపయోగపడని మాట వాస్తవం. కాలానుగుణంగా సివిల్ ఇంజినీరింగులో వచ్చిన సాంకేతిక విజ్ఞానాన్ని జోడించు కుంటూ ఇది వృద్ధి చెందలేదన్న కారణం చేత దీనిని నిర్మాణ శాస్త్రం కాదని త్రోసి వేయజాలం. హిందూ దేవాలయాల నిర్మాణంలో ఇప్పటికి వాస్తు సూత్రాలే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం పరిగణలోకి తీసుకోవాలి. మనం అవునన్నా కాదన్నా ఈ సమాజం మంచిగానో, చెడ్డగానో ఒక క్రమపద్ధతిలో నిర్మించబడినది. నిర్మాణాలలో ఒక క్రమం ఉందంటే దానిలో ఎంతో కొంత విజ్ఞానం ఉన్నట్లే కదా! అలాగే ఆనాటి నుండి నేటి వరకు జనం చెట్లపైన , పుట్టల్లోనూ, గుహల్లోనూ ఉండలేదు కదా ! ఏ మాత్రం శాస్త్రజ్ఞానం లేకుండానే గ్రామాలు, నగరాలు, పట్టణాలు ఏర్పడ్డాయా? కోటలు, మేడలు, మిద్దెలు, దేవాలయాల వెనుక నిర్మాణశాస్త్రం పాత్ర లేదని ఎలా తీర్మానించగలరు? గృహోపకరణాలు, ప్రయాణ సాధనాల తయారీ వెనుక, చెరువులు, జలాశయాలు, ఆనకట్టలు వంటివి ఏర్పాటు చేయుటలో వాస్తువు పాత్ర లేదని ఎలా చెప్పగలరు? వీటి అన్నిటి వెనుక ఆనాడు వాస్తు శాస్త్రం ఉందని చెప్పటానికి నాకెటువంటి భేషజాలు లేవు, అజ్ఞానంతో రాజీపడవలిసిన అగత్యం అంతకంటే లేదు.
అయితే నేడు వాస్తు పేరుతో సమాజంలో చలామణిలో ఉన్న విషయాలలో వాస్తులో ఆనాడు చెప్పిన నిర్మాణ విషయాలు లేవు. ఇంటికి పునాదులు ఎలా ఉండాలి , పిల్లర్లు, బీములు, స్లాబులు ఇత్యాది విషయాలలో నేటి నవీన విజ్ఞానమే వాడుతున్నాం. ఈ నిర్మాణ విషయాలలో ఆనాటి వాస్తును పాటించక పోయినా రాని కష్టనష్టాలు మిగిలిన విషయాలలో పాటించక పోతే వస్తాయని చెప్పటం పెద్ద మోసం.
వాస్తు ఫలితాలు నమ్మాలా?
ఒకనాడు ఇంటిని కట్టుకోవాటానికే ఈ వాస్తు (నిర్మాణ శాస్త్రం) రూపొందిందని ఇంటిని కూలగొట్టు కోవటానికి కాదు. కుటుంబంలో వచ్చే ఆర్థిక, ఆరోగ్య, అనుబంధ సమస్యలకు వాస్తు ఎంతమాత్రం కారణం కాదని విస్పష్టంగా వివరిస్తూ నేను చెప్పింది రావిపూడి గారు పట్టించుకోలేదంటే అసలు వారు నా రచనలు ఆసాంతం చదివారా లేదా అని సందేహం వస్తుంది.
నేడు వాస్తు పేరుతో చెబుతున్న సవాలక్ష అబద్దాలు, అతిశయోక్తులుకు అడ్డు కట్ట పడాలంటే ముందు పూర్వం వాస్తులో చెప్పింది ఏమిటో తెలుసుకోవాలి. నవీన వాస్తు పేరుతో విషయాలను వక్రీకరించి వంచనకు పాలుపడుతున్న వారిని అదుపు చేయాలంటే వాస్తులో చెప్పబడిన ఫలితాలపై అవగాహన కల్పించాలి.
    మన ప్రాచీన శాస్త్రాలలో మంచి, చెడులను చెప్పటానికి, ఆచరణ కొరకు అనేక విధాలుగా ఆశ భయాలను కల్పించేలా ఫలితాలు చెప్పేవారు. అనేక వ్రత పూజా విధానాలలో కూడా ఈ తరహా ఫలితాలు గమనించవచ్చు. వీటినే అర్ధవాదలు అంటారు. వాస్తులో చెప్పబడిన ఫలితాలను 'అర్దవాదలు' గా తీసుకోవాలి. ఇవి పసి పిల్లలను కట్టడి చేయటానికి బూచి ఉందని చెప్పే చందాన ఉన్నాయి. వాస్తు ఫలితాలను రుజువు చేయమని అడగవలిసిన ఆవశ్యకత కూడా లేదు.
నేడు చలామణిలో ఉన్న ఈ అశాస్త్రీయమైన వాస్తుతో అందరిని కొంత కాలం మోసం చేయవచ్చు, కొందరిని మరికొంత కాలం మోసం చేయవచ్చు. కానీ ఎవ్వరిని ఎల్లకాలం మోసం చేయలేమనేది కఠోర సత్యం. పిల్లి శాపాలకు ఉట్లు తెగనట్లుగానే, వాస్తుతో అద్భుతాలు సంభవిస్తాయని అనుకోవటం అజ్ఞానం. అర్ధం లేని విశ్వాసాలకు, కాలదోషం పట్టిన సూత్రాలకు నేటి సమాజంలో స్థానాన్ని కల్పించటం అవివేకం. ఛాందస భావాలను విడిచి విశ్వవ్యాప్తంగా పురోగమిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని సాదరంగా స్వాగతం పలుకుదాం.
ముగింపు
    నా పుస్తకం 'వాస్తులో ఏముంది?' రచనా కాలానికి (1996) రావిపూడి వెంకటాద్రి గారు కానీ మరి ఏ ఇతర నాస్తిక హేతువాదులతో, సంఘాలతో నాకు పరిచయమే లేదు. మొదటిసారి 1999 లో ప్రచురించిన రావిపూడి వెంకటాద్రి గారి రచన వాస్తవు శాస్త్రమా? చదవటం ఆతరువాత వారిని చీరాలలో కలవటం జరిగింది. నా పుస్తకంపై వారి విమర్శకు వివరణ ఇవ్వటం జరిగింది. ఆ తరువాత వారితో కలిసి నేను గుంటూరు, తెనాలి సభలలో కూడా ప్రసంగించటం జరిగింది. 2001లో నా రచన 'వాస్తులో వాస్తవాలు' వచ్చింది. హేతువాద సంఘం వారి ఆధ్వర్యంలో తిరుపతి, ఒంగోలు, మిరియలగూడ లలో జరిగిన సభలలో ప్రసంగించాను. అయినా ఎందుకో (?) వారు తన వాదనకే కట్టుబడి దానినే 'వాస్తువు శాస్త్రమా?' రెండవ ముద్రణలో సమాజానికి అందజేశారు. వారు తన పుస్తకంలో పేర్కొన్న "విజయ విహారం" పత్రికలో వాస్తు సంవాదంలో నేను రాసిన వ్యాసం 'వాస్తు సజీవ శాస్త్రమా?' కూడా ఉంది. కానీ దాన్ని వారు పట్టించుకోలేదు. 'హేతువాదులు గాడిదను గుర్రాన్ని ఒకే గాటను కడతారని' అదే పత్రికలో రాసిన వ్యక్తి మాటలలో తనకు పనికివచ్చే మాటలు తీసుకొని వాటిని ఉదహరించారు. జ్యోతిష్యం నిజం, వాస్తు అబద్దం అనే భావాలతో ఉన్న సదరు వ్యక్తి వీరి విమర్శకు బహు దూరం.
    తప్పును తప్పు అనలేకపోవటం కూడా తప్పే. హేతుబద్ధం కానీ వాదనలు, సిద్ధాంత అభిజాత్యం మూఢత్వాన్ని బాటలు వేస్తాయనే భావనతో ఈ వివరణాత్మక విమర్శ రాయటం జరిగింది. దీనిలో చర్చించిన విషయాలన్నీ 12-08-2001 లో నేను రావిపూడి గారికి రాసిన ఉత్తరం లోనివేనని గ్రహించగలరు.
    నేటి వాస్తు సిద్ధాంతుల రాద్ధాంతాలను ఎండగట్టి ఉతికి ఆరేయటంలో రావిపూడి వెంకటాద్రి గారి చేసిన తర్కంలో కొన్ని లోపాలు ఉన్నా వారు ఫలితాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. వారి చిత్త శుద్ధిని శంకించటం లేదు. హేతువాద, మానవవాద ఉద్యమంలో అవిరామంగా చేసిన వారి కృషి అభినందనీయం. మూఢవిశ్వాసాలపై వారు దీర్ఘకాలంగా సాగించిన పోరాటం అనన్యసామాన్యం. అలాగే హేతుబద్ధ విమర్శలను స్వీకరించి తన రచనలను కొనసాగించాలని కోరుకుందాం.

    సమాజహితాన్ని ఆశించి సదుద్దేశంతో ప్రాచీన వాస్తులో చెప్పబడిన విషయాలను వివరిస్తూ 1996 లో రాసిన నా పరిశోధనా గ్రంథం వాస్తులో ఏముంది?. నేడు వాస్తు పేరుతో కొనసాగుతున్న అశాస్త్రీయ పోకడలను, వాస్తు మాటున జరుగుతున్న వంచన లోని గుట్టుమట్టులను బహిర్గతం చేసిన తొలి పరిశోధనా గ్రంథం.
EI - విజయవాడ - ఆచార్య కొడాలి శ్రీనివాస్

    28-12-1996 లో ప్రచురించబడిన ఈ పుస్తకం విడుదలై ఈ ఏడాది 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్నఈ రజితోత్సవ సందర్భంగా ప్రచురించాలనుకొంటున్న రెండవ ముద్రణలో ఈ వ్యాసం చేర్చబడుతుంది.
ఆచార్య కొడాలి శ్రీనివాస్

Comments

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...