మూఢ నమ్మకాల నిరుమూలన చట్టం - ఆవశ్యకత - సాధన కొరకు గుంటూరులో 25-06-2017 మల్లయ్య లింగం భవన్లో హేతువాదులు , అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు ఒక సదస్సు ఏర్పాటు చేసారు. దీనిలో హేతువాది పి. సుబ్బరాజు గారిచే రూపొందించబడిన మూఢ నమ్మకాల నిర్ములన చట్టం యొక్క ముసాయిదా ప్రతిని ( ఇంతకు ముందే మహారాష్ట్ర లో ఉన్న చట్టం నేపథ్యంలో) ప్రవేశపెట్టి దాని లోతుపాతులను చర్చించారు. ఉదయం జరిగిన సమావేశంలో ఆంద్ర ప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వేంకట సుబ్బయ్య గారు, శాసన మండలి సభ్యులు రామ కృష్ణ , మాజీ ANU రిజిస్టార్ ఆర్ . సాంబశివరావు, రచయత ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్, మద్దుకూరి అశోక్ గారు ప్రసంగించారు. సాయంత్రం సభలో వివిధసంఘాల ప్రతినిధులు ఈదర గోపీచంద్, జంపని కృష్ణ కిషోర్ , హేతువాది సంపాదకులు ఐ. వి. గారు, ఊట్ల రంగనాయకులు గారు ప్రసంగించారు. ప్రజలలో చైతన్యం కలిగించగలిగితే మూఢ నమ్మకాలు వాటంతకవే పోతాయి అని అప్పటి వరకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవని అభిప్రాయపడుతూ ఈ చట్టం గురించి ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించి దానికి చట్ట బద్ధత వచ్చేలా కృషి చేయాలని వక్తలు కోరారు. ఈ సదస్సుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుండి హేతువాదులు హాజరైనారు.
 |
| ప్రసంగిస్తున్న సుబ్బా రాజు , వివిధ సంఘాల ప్రతినిధులు |
 |
| ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్ |
 |
| శాసన మండలి సభ్యులు రామ కృష్ణ |
 |
| సదస్సుకు హాజరైన హేతువాద మిత్రులు |
వార్తలు
Comments