Skip to main content

అంకెలు అదృష్టాన్ని అందిస్తాయా?

శాస్త్రమునెల్ల చదివి విజ్ఞాన మెరిగి 
సంశయింపక సర్వధా చర్చ జేసి 
నిజమెరుంగ వలయు  ఇది నేర్వకున్న 
మూఢ విశ్వాసమున జేటు ముడుచుండు !!
అని కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు ఏనాడో హెచ్చరించారు. హేతుబద్ద రహిత సమాజంలో మూఢ విశ్వాసాలనే కలుపు మొక్కలు నిరంతరం మొలుస్తూనే ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూనే ఉండాలి. వీటి వేళ్ళు  సమాజంలో చాలా లోతుగా పాతుకు పోయి ఉన్నాయి. పాతవి పోగొడుతుంటే కొత్తవి చిగురేస్తూ ఉంటాయి. అలాంటి కొత్త తరం విశ్వాసాలలో ఒకటే ఈ " అంకెలు పై నమ్మకం ". న్యూమరాలజి అనే ఈ ' సంఖ్యా జ్యోతిషం'  సంఖ్యలను ఉతంగా చేసుకొని అమాయకులకు సంఖెళ్ళు వేస్తున్న వైనం విస్తుగోల్పుతుంది. 

గణిత శాస్త్రంలో ప్రాధానమైన అంకెలు తొమ్మిది. మన భారతీయులు కనిపెట్టిన శున్యాంకం వల్ల ఎంత పెద్ద సంఖ్య అయిన సులభంగా రాసే వెసులుబాటు వచ్చింది. గణితం సకల శాస్త్రాలకు మాతృ స్థానం. సంఖ్యా గణితం - దాని ఘనత, విజ్ఞాన శాస్త్రంలో సుస్పష్టమైన పాత్ర మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి గణితాన్ని గతి తప్పించి వంచానావిధ్యగా మార్చారు. గణిత సమస్యలకు సమాదానం చెప్పే క్రమములో ఉపయోగించే సంఖ్యలకు అద్బుతమైన శక్తి ఉందనే భ్రమలో రూపొందించిన ఉహా గణితమే ఈ సంఖ్యా జ్యోతిష్యం. దీనిలో బోడిగుండు కి మోకాలికి ముడివేసే విచిత్ర లెక్కల సిద్దాంతం ఉంది. 
              జ్యోతిష్యం లో ఉండే నవ గ్రహాలకు (?) గణితంలో ఉండే తొమ్మిది అంకెలకు అనుసంధానం చేసి అదృష్ట ఫలాలు సృష్టించి ఒక కొత్త కుహనా శాస్త్రానికి ప్రాణం పోసారు.  పాలలో వెన్న దాగి ఉన్నట్లు అంకెలలో అద్బుతమైన శక్తి ఉందనే నమ్మకమే దీనికి ఊపిరి. ప్రతి సంఖ్యను దానిలో ఉండే అంకెలను కుడితే  మనకు ఒకటి నుండి తొమ్మిది వరకు గల ఏదో ఒక మూల సంఖ్య వస్తుంది. ఉదాహరణకు 786 అనే సంఖ్య ను కూడితే (7+8+6) మనకు 21 అనే అంకె వస్తుంది, దానిని మరల కలిపితే (2+1) మూడు అంకె వస్తుంది. ఇలా ప్రతి సంఖ్యను ప్రధాన సంఖ్యగా మార్చటం, దాన్ని బట్టి మంచి చెడులు చెప్పటం ఈ శాస్త్రమూల సిద్దాంతం. దీన్ని మానవులకు వర్తింప చేయటానికి ఇంగ్లీషు పుట్టిన రోజు ప్రామాణికంగా తీసుకుంటారు. ఉదాహరణకు 15-6-1960 అనే తేదిలో అంకెలు కూడితే వచ్చే అంకె ఒకటి. ఇలా ప్రతి వ్యక్తి పుట్టిన తేదిని మూల సంఖ్యగా మార్చి ఫలితాన్ని చెప్పవచ్చు. 
             అలాగే ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉంటుంది, దానిలో అక్షరాలూ ఉంటాయికదా ! ఎన్ని ఉంటాయో లెక్కించవచ్చు. ఇలా  అక్షరాలకు అంకెలకు అవినాభావ సంబంధం ఉందనేది దీనిలో దాగిఉన్న మరో  మర్మం.  దీని ప్రకారం వ్యక్తి పేరును ఆంగ్ల అక్షరాలలో రాసి దాని ప్రకారం మూల అంకెను లెక్కించాలి.  ఉదాహరణకు ఆంగ్లంలో A  మొదటి అక్షరం కాబట్టి దీని సంఖ్య ఒకటి, అలాగే B కి రెండు ...,Z కు 26, ఇలా పేరులో ఉన్న అన్ని అక్షరాలకు అంకెలు జత చేసి వాటిని కూడితే మరల  ఒక మూల అంకె వస్తుంది. ఇప్పుడు పుట్టిన తేది కుదించగా వచ్చిన అంకెతో  పేరు బల అంకె తోడు-నీడగా ఉంటుంది.  ఈ రెంటికి లంకె కుదరాలి. అలా జత  కుదరక పోతే గ్రహాలకు పొత్తు కుదరదట.  పుట్టిన తేది మార్చటం కుదరదు కాబట్టి వ్యక్తి పేరులో కొత్తగా కొన్ని అక్షరాలను జోడించటం గాని లేదా తోలిగించటం వలన జత కుడే అంకె సాధిస్తారు. కొత్త పేరుతో గ్రహాల మధ్య సఖ్యత కుదిరి సౌఖ్యం సిద్దిస్తుందట. ఇలా పెట్టిన పేరు ఫలితాన్ని ఇవ్వాలంటే సదరు వ్యక్తి ఆ పేరును 108 సార్లు రామకోటి రాసినట్లు నెలపాటు రాయాలట. ఇలాగే దివాలా తీసిన పరిశ్రమలు/ వ్యాపార సంస్థలు పేరు మార్చుకుంటే లాభాల బాట పడతాయట. 
అప్రాచ్చుతుల నుండి దిగుమతైన ఈ కొత్త పిచ్చి ఇప్పుడిప్పుడే మన సమాజంలో చాప కింద నీరులా వ్యాపిస్తుంది. చానళ్ళలో ప్రకటనలు కుడా వెల్లువెత్తుతున్నాయి.  
పాత జ్యోతిష్యం జన్మదినం బట్టి పేరులో మొదటి అక్షరం ఎలా ఉండాలో చెబితే ఈ సంఖ్యా జ్యోతిష్యం పేరులో ఇంగ్లీషు అక్షరాలూ ఎలా ఉండాలో చెబుతుంది. ఈ రెంటికి మధ్య పేర్లు పచ్చడి పచ్చడి అవుతున్నాయి. 
             మానవ జీవితాలపై గ్రహాల ప్రభావం శూన్యం అని విజ్ఞాన శాస్త్రం ఘోషిస్తూ ఉంటే కొత్తగా న్యూమరాలజీ పేరుతో అదృష్ట సంఖ్యలు అంటూ కొత్త నమ్మకాలు ఏర్పరుచుకోవటం వివేకవంతమైన పని కాదు. కల్పనకు  వాస్తవానికి ఎంత వ్యత్యాసం ఉందొ అంతే వ్యత్యాసం గణిత శాస్త్రానికి ఈ గుణిత సంఖ్యా శాస్త్రానికి ఉందని తెలుసుకోవాలి .  ఎండమావిలో నీరు ఉందనేది  ఎంత భ్రమో  అంకెలు  అదృష్టాన్ని అందిస్తాయనేది కుడా అంతే  భ్రమ.  
            అలాగే ఈ న్యూమరాలజీ వంట పట్టించుకున్న వారు తమ కొత్త వాహానాలకు కావలిసిన లక్కి నెంబర్ కొరకు తీవ్రమైన పోటీ పడుతున్నారు. మంచి జరగాలంటే యజమాని పేరును బట్టి ఏ నెంబరు బండికి ఉండాలో చెబుతారట. ఇక్కడ మంచి అంటే బండికి ప్రమాదం జరగక పోవటమే. ఇది డ్రైవర్ జాగరూకతను బట్టి ఉంటుంది కాని నెంబర్ ప్లేట్ బట్టి కాదుగా! కొంతమందికి తొమ్మిది అంకె తో ఉన్న వాహనం కలిసివస్తుందట. తొమ్మిదంటే చాలా మందికి పిచ్చి వ్యామోహం, తొమ్మిది అంకెతో ఉన్న వాహనాలు సురిక్షితం అన్న గణాంకాలు ఏవి కానరావు. అలాగే ఎటు కూడినా తొమ్మిది వచ్చేలా తొమ్మిది గళ్ళ జంత్రి (3X3) ని రాగి రేకుపై ముద్రించి అదృష్ట యంత్రం పేరుతొనో, తాయుజు పేరుతోనో అమాయకులకు అంటగట్టే  అవారాగాళ్ళు కూడా ఉన్నారు. గణితంలో తొమ్మిది అంకెతో అనేక గమ్మతులు కాగితంపై చేయవచ్చు కాని నిజ జీవితంలో చేయలేమన్న విషయాన్ని గ్రహించాలి. 
అలాగే ఈ సంఖ్యా శాస్త్రంతో సంబంధం లేకుండా కొన్ని సంఖ్యలు అచ్చిరావనే భావన దాదాపు  అన్ని సమాజాలలో పాతుకుపోయింది. చైనా లో నాలుగు అంకెను 'సీ' అని పలుకుతారు , సీ అంటే చైనా భాషలో మరణం అని  అర్ధం  కాబట్టి వారికి 'నాలుగు'  అంకె అంటే భయం.   క్రీస్తు చివరి విందులో పాల్గొన్న వ్యక్తులు 13 మంది కాబట్టి క్రైస్తవులకు 13 అంకె అంటే కలవరం. అలాగే హిందువులకు 8, 18 , 108 సంఖ్యలంటే  భక్తి , 3 మరియు 7 అంకెలతో పాటు అష్టమి (8), నవమి (9) అనే తిధులు అంటే భయం. ముస్లింలకు ఖురాన్ మొదటి వాఖ్యంకు సంఖ్యా రూపం అయిన 786 అంటే భక్తి భావం, 13 మరియు 14 అంటే భయం గుడుకట్టుకొని ఉన్నాయి. అంకెలపై ఇలాంటి అర్ధం లేని అపోహలు, ఆశ భయాలను ఎంత త్వరగా త్వజిస్తే అంత త్వరగా అభివృద్ధి చెందగలం. 

Comments

Anonymous said…
మీ లక్కీ నంబర్ ఐదు.
kodali srinivas said…
Actor Jr NTR has created a record by paying Rs 10.5 lakh to get his lucky 9999 as the registration number for his new BMW 7 series car. The Rs 1.21 crore car will finally have the registration number TS 09 EL 9999.
Unknown said…
సర్ ... నేను మీ పోస్టులను Facebook లొ పోష్టు చేస్తున్నాను.

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...