తెలంగాణ రాష్ట్రం గా ప్రత్యేక జీవనం గడపుటానికి కోటి ఆశలతో పరుగిడితున్న సోదర తెలుగు ప్రజానీకానికి శుభాశ్వీసులు.
రాష్ట్రం గా విడిపోయి అన్నదమ్ములగా కలిసుండాలనే మీ / మా కోరిక నెరవేరాలని ఆశిద్దాం. స్వలాభం తో దాయదులను రెచ్చగొట్టే రాజకీయాలను చేసే నీచులను దూరంగా పెడదాం. అభివృద్ధి చేసే పాలన కావాలి. తెలుగు వారు అందరు అభివృద్ధి చెందాలి.
అప్పుతో లోటు బడ్జెట్ తో , రాజధాని లేకుండా ఒంటరిగా ఉన్న సోదర ఆంధ్రుల పై సానుభూతి చెపే ఓదార్యం రావాలి. అత్యధిక తెలుగు జనం ఆంద్ర ప్రదేశ్ లో ఉన్నారన్న సంగతి మననం చేసుకోండి. సమ న్యాయం అంటే అపహాస్యం చేయకండి.
5 కోట్ల సీమా ఆంధ్రులలో 4 కోట్లకు పైగా ప్రజలు కనీసం ఒక సారి కుడా హైదరాబాద్ కు రాలేదన్న సంగతి మరిచి పోకండి. వారిని ద్వేషించ వద్దు
తెలుగు జాతి మనది.
ఇది నిండుగా వెలగాలి.
మన నినాదం
జై తెలుగు తల్లి!
జై తెలంగాణ!
జై ఆంద్ర ప్రదేశ్ !

Comments
Jai Telangana. Jai Hind.