Skip to main content

రండి మన ఆంద్ర ప్రదేశ్ ను పునర్మించుకుందాం

స్వార్ద రాజకీయాలకు, కుటిల నీతికి  తెలుగు నెల రెండు ముక్కలై పోయింది. తెలుగు జాతి చితికి పోయింది. 
ఆనాడు మద్రాస్ నుండి ఆంధ్రగా విడిపోయినప్పుడు కుడా ఇవే స్వార్ద రాజకీయ శక్తులు తమ స్వలాభం కొరకు సిమాంద్ర ప్రజల ప్రయోజనాలను పణం పెట్టారు. కాంగ్రెస్ కుటిల  రాజకీయ ఎత్తు గడలతో ముందు  కర్నూలు ను రాజధానిగా చేసి తరువాత హైదరాబాద్ కు తరలించారు. ఒకవేళ ఆనాడే ఆంద్ర రాజధాని విజయవాడ లో ఉంటె అసలు విశాలాంధ్ర ఉహే వచ్చేదికాదు.  ఆ తరువాత జై తెలంగాణ , జై ఆంద్ర  ఉద్యమాలలో కుడా ఇలాంటి స్వార్ద రాజకీయాలే పనిచేశాయి. మరల గత దశాబ్దం నుండి జరిగిన రాజకీయలు పరాకాష్ట కు చేరుకొని ఈ నాటి ఈ దుస్థితికి చేరుకొంది. 
ఆనాడు కాకతీయ సామ్రాజ్యం విచ్చిన్నమైంది . విజయనగర సామ్రాజ్యం కకావికలం అయింది . నిజాం చేతిలోచిక్కిన తెలుగు నెల ఇంగ్లీషు వాడికి అమ్ముడు పోయింది. అయినా మరల తెలుగు జాతి బతికి బట్ట కట్టింది.  
కాకతీయుల పతనం తరువాత ఆత్మాభిమానం తో ఓరుగల్లు వదలి హంపి చేరారు. హంపి పతనం తో పెనుగొండ కు ఆ తరువాత మదురై , చెన్నపట్నాల కు, చివరకు కర్నూలు నుండి  హైదరాబాద్ కు వలస వచ్చిన ఆంధ్రులకు రాజధాని వదలటం కొత్త కాదు.  వీరోచిత ఘన చరిత్ర గల తెలుగు వారికిఎన్నో ఆటుపోట్లు. మరల ఇప్పుడు 
రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన రాష్ట్రం లో కుడా  జ్ఞాతుల రాజకీయ పోరులో,రాబందుల చేతులలో  దగాపడి ఈ నాడు హైదరాబాద్ ను వదలి వెళ్ళవలిసిన అగత్యం ఏర్పడటం శోచనీయం. 
ఆత్మ గౌరవం  ఆంధ్రుల నైజం. పౌర్షం మన రక్తం లోనే ఉంది .  పొట్ట కూటికి పరాయి పంచన పడివుండే తత్వం మనది కాదు. ఓటమికి కుంగిపొయె జాతి కాదు.  కష్టపడటం మన లక్షణం.
బ్రతకటానికి బరోసా ఇస్తామన్న ఈ రాజకీయ నీచులను నమ్మి మరల మోసపోవద్దు. అవసరానికి ఆలింగనం చేసుకొనే గుంట నక్కల మాటలు విని పెట్టుబడులు పెట్టి  చేతులు కాల్చుకోకండి  మనకు రావలిసిన దాయాది బాగం మనం తీసుకుందాం.  
రండి మన శక్తి యుక్తులను , సంపదలను మన వద్దే పెట్టుబడి పెట్టి మనదైన తెలుగు రాష్ట్రాన్ని నిర్మించు కుందాం. మన జాతిని ఉన్నతంగా తిర్చిదిద్దుకుందాం. మన ఆంద్ర ప్రదేశ్ ను పునర్మించుకుందాం. అందరికి ఆదరణ ఇచ్చే అందమైన రాజధానిని కట్టుకుందాం . తెలుగు జాతికి శాశ్విత చిరునామా కల్పిద్దాం.  ఉజ్వలమైన భవిషత్ ను మన వారికి అందిద్దాం.   

Comments

మీరు శ్రీబాగ్ ఒడంబడిక చదవలేదా?
Anonymous said…
అంతేనా? రాయలసీమ/ఆంధ్రా కొట్టుకోవని నమ్మకమేంటి? కొన్నేళ్ళు సాగాక రాజధాని వున్న ప్రాంతం వాడు తక్కినోళ్ళని దొంగలు, నాలుకలు చీరేస్తాం, విగ్రహాలు పడ్దొబ్బుతామంటే ఏంజేస్తారు? మళ్ళీ పునః పునర్మించుకుంటారా?
Anonymous said…
highly inspiring. andhra people need this type of support at present.
with tears................
Krishna said…
Very nice analysis..we have to spread this message to current generation..we have very talented people in Andhra/Rayalsima region,bringing everyone on same goal is high priority..let's adopt every village and form as groups and encourage local people to work towards developments..we have enough resources to grow. fighting with each telanagana/andhra doesn't make sense..if telanagana people say some words..ignore them for few years..they will come back to us in future..let's prepare everyone for future AP development..build people, things will change automatically..education is this highest wealth in our blood..

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...