"వీరగంధము తెచ్చినారము - వీరుడెవ్వరో తెల్పుడీ
దేశం లో పాతుకు పోయిన ఈ అవినీతి జాడ్యాన్ని అంతమొందించటానికి అన్నా హజారే చేసే ఉద్యమంలో ఒక మంచి పౌరునిగా పాలు పంచుకోవాల్సిన సమయం వచ్చింది.
మరో స్వతంత్ర పోరాటం వంటిదే ఈ నాటి ఈ అవినీతి వెతిరేక ఉద్యమం. అవనీతి పై జరిగే ఈ ధర్మ పోరాటం లోఒక వీరుడిగా కత్తి పట్టి ,కంకణం కట్టుకోండి.
అవినీతికి కొమ్ము కాసే రాజకీయులను, వ్యక్తులను ఒక కంట కనిపెట్టండి.
అవినీతిని బలపరిచే దుష్ట రాజకీయాన్ని దునుమాడదాం. అవినీతికి భాహాటంగా బలపరుస్తూ M.L.A, M.P. పదవులకు రాజీనామాలు ఇచ్చిన స్వార్ద పరులకు బుద్ది చెపుదాం.
అవినీతి డబ్బుతో అడుగడుగునా వేస్తున్న మహా అవినీతి నేత విగ్రహాలను ఆపుదాం.
అవినీతి సొమ్ముతో మదమెక్కిన నీచులను చీకొట్టి సమాజం నుండి వేలివేద్దాం.
రండి ! మరో స్వతంత్ర పోరాటం పిలుస్తుంది !!

Comments