వాస్తువు శాస్త్రమా? కాదా ? అనే విషయంలోఈనాడు విభిన్న వాదనలు ఉన్నాయి. ఈ వాదనలలో వాస్తవాన్ని గ్రహించే ఔన్నత్యం,వివేకం కొరవడటం శోచనీయం.
భారతీయ రియల్ ఎస్టేట్ రంగం లో నేడు వాస్తు చూపిస్తున్న ప్రభావం దాని ఉనికికే ముప్పు తెచ్చే స్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదేమో!
నిజానికివాస్తు అంటే నివాసగృహం లేదా నివసించే ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది,పరి రక్షించేది అనిఅర్ధం. వెరసి 'వాస్తు శాస్త్రం' అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలనుశాసించే మన ప్రాచీన నివాస నిర్మాణ శాస్త్రంగాచెప్పుకోవచ్చు. అయితే నేడు శాస్త్రం అనే పదాన్ని 'సైన్సు'కు పర్యాయ పదంగా వాడుతున్నారు.
వాస్తువు శాస్త్రమా? అనే విషయంల నేటి సైన్సు పరిధిలో ఎంత విలువ ఉంది ? సైన్సుకు వున్నా లక్షణాలు దీనికి వున్నాయా లేవా? అనే విషయంలోనే జరిగే వాదోపవాదాలు క్షుణ్ణంగా పరిశీలించాలి.
వాస్తు పై జరిగే చర్చలో కేవలం ఫలిత వాస్తును మాత్రమే పరిగణలోకి తీసుకోరాదు.అలాగే అనుభవాల పేరుతో చెప్పే వాస్తు సిద్ధాంతుల మాటలు ముమ్మాటికి నిజమని అనుకోరాదు. వాటిలో 99 శాతం అబద్దాలు, అతిశయోక్తులు.
నిజానికి,ఆనాడు వాస్తులోచెప్పబడిన ఫలితాలు ఆశాస్త్రాన్ని తు.చ. తప్పకుండాఆచరించటానికి, ఫలితాల పేరుతో ప్రజలను భయపెట్టి శాస్త్రాన్ని నూరు శాతం అమలు జేయటానికి చేప్పబడినవే.
సాంకేతిక విషయాన్ని వదలిపెట్టి గుడ్డిగా ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వాస్తు ముమ్మాటికి శాస్త్రం కాదు. వాస్తులో చెప్పబడిన ఫలితాలను బట్టి వాస్తును అంచనా వేయటం జరిగితే అది ముమ్మాటికి ఒక 'మూఢ నమ్మకం' గానే మిగులుతుంది.
వాస్తు లో చెప్పబడిన విషయాలలో ఎవైన తేడాలు ఇంటిలో ఉంటె అవి మనఫై 'ఆర్దిక,ఆరోగ్య, కుటుంబ సంబంద విషయాలలో ప్రభావం చూపుతుంది' అనే వాదనలో వాస్తవం ఇసుమంతైనా లేదు.
'అదిగోపులి అంటే ... ఇదిగో తోక' అనేవారు , 'దున్నఈనింది అంటే... దూడను కట్టేయమనేవారు' ఎప్పుడు ఉంటూనే వుంటారు. వీరిమాటలు విని భయాందోళనలు చెందనవసరం లేదు.
పాలకూర లో 'పాలు', నేతిబీరకాయలో 'నెయ్యి' వుంది అనే మాటల్లో వాస్తవం ఎంతో వాస్తు లో వాస్తవంకూడా అంతే! కష్ట పడకుండా కాలైనా వంగదన్నట్లు,కష్టపడకుండా కేవలం వాస్తు తో విజయాలుసాధించటం దుర్లభం.
వాస్తుబలం కంటే 'ఆత్మబలం' పెంచుకుంటే విజయం మన చెంతకు వస్తుంది. చాందస భావాలను విడిచి విశ్వవ్యాప్తంగా పురోగమిస్తున్న సాంకేతిక విజ్ఞాన్ని సాదరంగా స్వాగతం పలుకుదాం.

Comments