ఇరు మతాల వారి మద్య సయోధ్య చేయటానికి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పు అమోదించ దగ్గదే. దీనిద్వారా లబ్ది పొందలేమనే రాజాకియులు అప్పుడే రాద్దాంతం మొదలు పెట్టారు.1500 గజాల చిన్న స్థలం పై మరల ఇరు మతాల వారిలో ఆవేశ కావేషాలు రగల్చి,ఆమంటలలో ఓట్ల పండుగ చేసుకోవటానికి నీచ రాజకీయం కాచుకు కూర్చుంది. ఈ గుంట నక్కలు అయోధ్య లో మసీదు-మందిరం ల మధ్య రగిలిన చితి మంట ఆరిపోకుండా తలా ఒక పుల్ల వేస్తూనే ఉంటారు. ఈ కేసు సుప్రీం కోర్టు వెళ్ళినా ఆ తరువాత అది ఎ తీర్పు ఇచ్చిన అది అమలు అవుతుందా అనేది కుడా ప్రశ్నార్ధకమే! తీర్పు ఏదైనా శిరాసావంచమనే పెద్దలు రేపు తమకు అనుకూలంగా తీర్పు లేకపోతే దేశాన్ని తిరిగి రావణ కాష్టం చేయరన్న గ్యారింటి ఏమి లేదు. కాబట్టి ఇరు మతాల వారు ఈ రాజకీయ ఉచ్చులో పడకుండా అయోధ్య తీర్పును మార్గ దర్శకంగా కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుంటే దేశానికి,జాతికి శుభం.ఈ విషయంలో మన శాంతి భగ్నం కలిగించే గుంట నక్కలు పొంచిఉన్నారు - ప్రజలారా ! పారా హుషార్!!
జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

Comments