నల్గొండ జిల్లా ఒక కుగ్రామం లో బాణామతి/ చేతబడి పేరుతో చదువు సంద్యలు లేని ఇద్దరు వృద్దులను( ఒకరు గొర్రెల కాపరి, మరొకరు కాపాలాదారుడు ) సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మన సమాజం లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలకు సజీవ సాక్షం గా దర్శనమిస్తుంది. సరైన వైద్యం అందక అనారోగ్యం తో చనిపోతే దానికి క్షుద్ర శక్తుల ను ప్రయోగించాటమే కారణం అనే మూఢ నమ్మకం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ వున్నాయి. మారు మూల పల్లెలలో లోతుగా పాతుకుపోయిన ఇలాంటి విశ్వాసాలను తొలగించటానికి విశేషమైన కృషి చేయ వలిసిన బాద్యత విద్యావంతులందరి పైనా ఉంది. పెత్తందారి వ్యవస్థ నుండి,మత దురహంకారుల నుండి విమోచనం పొంది ఆరు దశాబ్దాలు గడిచినా తెలంగాణా ప్రజలకు ఇంకా మూఢ విశ్వాసాల నుండి విమోచన కలగక పోవటం సిగ్గు చేటు.తెలంగాణా లో తరుచు జరుగుతున్న ఈ అనాగరిక ,ఆటవిక విశ్వాసాలను సమూలంగా నాశనం చేసేలా ఒక ఉద్యమంగా ప్రజా సంఘాలు,హేతువాదులు కృషి చేయాలి.అవిద్య,అజ్ఞానం ల నుండి విముక్తి కలిగేలా ఈ ఉద్యమం సాగాలి.
జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

Comments