Skip to main content

పప్పన్నాలతో వచ్చే ముప్పు - 2

ఇదే శీర్షికతోఇంతకు ముందు ఒక టపా రాసాను.ఆ టపాలో చెప్పిన ఆహార దుబార (విందుల పేరుతొ జరుగుతున్న)కు చక్కటి పరిషక్కారం ఇప్పుడు దొరికింది. వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందని ... నా ముందు టపా లో వాపోతే ,మన సానియా పెళ్లి నా ఆందోళనకు ఒక పరిష్కార మార్గం చూపెట్టింది.
ఇక్కడ ఘనంగా పెళ్లి చేసుకొన్నసానియా తన పాకిస్తాన్ పెనిమిటి షోయబ్ మాలిక్ ఇంటికి వెళ్లి అక్కడ ఎంచక్కా పెళ్లి విందులతో అందరిని అలరిస్తున్నది. అయితే మనలాగా పెళ్లి విందులలో రకరకాల రుచులతో షడ్ర శోపేత భోజనాలు అతిధులకు వడ్డించటం పై పాకిస్తాన్లో నిషేధం ఉన్నదట. నిన్న లాహోరు లో సానియా షోయబ్ 'వలిమ' (పెళ్లి కొడుకు తరుపు వారు ఇచ్చే విందు) లో అతిదులకు 'కోడి కుర్మా' ఒక్కటే వడ్డించారని వార్త. పెళ్లి విందులలో ఒక డిష్ కంటే ఎక్కువ ఉండరాదని అక్కడ చట్టాలు చేసారట. డబ్బు ఉన్నా అందరికి ఇదే రూలు వర్తిసుంది. ఎంత బాగుంది నియమం. దీన్ని మన దేశంలో కుడా అందరికి వర్తించేలా కటినమైన చట్టం చేసుకుంటే ముందు ముందు మనకు వచ్చే ఆహార ముప్పు నివారించ వచ్చు. విషయం లో ఎంత త్వరగా చట్టం తెచ్చుకుంటే అంత మంచిది. ఏమంటారు?

Comments

Anonymous said…
మీతో ఏకీభవిస్తాను.
ప్రజాస్వామ్య దేశాలలో ఇలాంటి నిభందనలు పెట్టడం కష్ఠం. మత వ్యవస్థలలో మాత్రమే సాధ్యం. మతపెద్ద చెబితే దేనికీ ఎవరూ అడ్డు చెప్పరు.

హిందూ మతంలో కాస్తా దుబారా ఎక్కువ. ఒక్క విందు భోజనాలలోనే కాదు, దేవుడికి చేసే పూజలలో, అలంకారాలలో దుబారా కనిపిస్తుంది. ఈ విషయంలో ఇస్లాం బెటర్.
Maruti said…
మీ ఆలోచన బాగుందండి !!
kodali srinivas said…
Anu,Sceptic,మారుతి గార్లకు ధన్యవాదాలు. ప్రజాస్వామ్యం లోమితి మీరిన వ్యక్తి స్వేఛ్చ అనేక అనర్ధాలకు హేతువు అవుతుంది. మన లాంటి ప్రజాస్వామ్య దేశాలలో చట్టాలు ఉన్నా అవి సరిగ్గా అమలులోకి రావటం లేదు. వివేకవంతమైన ప్రజాస్వామ్యం లోనే పాలకులు సామాజక,మానవీయ దృక్కోణంలో చట్టాలు చేస్తారు, అవి ప్రజలు స్వచ్చందంగా పాటిస్తారు.అలాంటి పాలన మనకు ఎప్పటికి వస్తుందో?
kodali srinivas said…
మన కేంద్ర ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ఆహార భద్రత కల్పిచాటానికి నానా అగచాట్లు పడుతున్నది. రాబోయే రోజులలో ఆహార కొరత కొందరికి మాత్రమే పరిమితం అని చెప్పలేం. అది అందరి సమస్య అవుతుంది. ఎ రంగం లోనైనా పొదుపు అనేది ఉత్పత్తి కి సమానం. కాబట్టి ఆహార విషయంలో పొదుపును ప్రోత్స హించాలి. మిత ఆహారం ఆరోగ్యానికి మంచిదైనట్లు,ఆహార పొదుపు దేశ ఆర్ధిక ఆరోగ్యానికి మంచిది. విందు వినోదాలలో ఆహార పొదుపు పాటించేలా ప్రజలను చైతన్యం చేయటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం.
tinataaniki kooda ristrictions...........inkenduku manam chachhi mundu vallaki migiliste pola...........

adi solution kane kaadu

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

భద్రాచల రామాలయం ఎవరు కట్టారు?

నేడు భద్రాచలం లో ఉన్న రామాలయం భక్త రామదాసు చే కట్టించబడినది కాదు.  ఇప్పుడున్న సీతరాముల  గుడి  శ్రీ కల్లూరి  చంద్రమౌళి గారి ఆధ్వర్యం లో పునర్మించబడిన దేవాలయం మాత్రమే.  భద్రాచలం రామాలయం  అనగానే అందరికి స్పురణకు వచ్చే పేరు భక్త రామదాసుగా ప్రసిద్ది చెందిన కంచర్ల గోపన్న. తానీషాకు పన్నులు కట్టకుండా ఆ డబ్బుతో 17 వ శతాబ్దంలోరామదాసుచే  నిర్మించబడిన  సీతారాముల  దేవాలయం  చాలా చిన్నది. సాదా సీదా ఉండే ఆ ఆలయం లో ఎటువంటి శిల్ప కళా వైభవం లేదు.  ఇది  1960 నాటికి బాగ శిధిలమై కూలిపోయే స్థితికి చేరుకుంది. ఆకాలంలో చంద్రమౌళి గారు దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా నియమితులైయ్యారు. స్వతహాగా రామ భక్తుడైన చంద్రమౌళి గారు భద్రాద్రి దేవాలయ పరిస్థితి చూసి వెంటనే ఆలయ పునఃనిర్మాణానికి నడుం కట్టారు. ఆయన అధ్యక్షులుగా రామాలయ జీర్ణోద్ధరణ సంఘం ఏర్పాటయింది. చంద్రమౌళి రాష్ట్రం నలుమూలల తిరిగి, జోలె పట్టి  లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు. ఆనాడు ఆంద్ర ప్రభ దిన పత్రిక ...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

తెగులు జాతి మనదోయి

దేశమంటే మట్టేనోయి మట్టిటంటే ప్రాంతమేనోయి  నీ సీమ,దోమ నీదేనోయి నా ఊరు,కారు నాదేనొయి నీ భాష వేషం నీదొనొయి  నా గోస గోచి నాదేనోయి  జాతి,నీతి ఒక బూటకమేనోయి తెలుగుతల్లి,తెలగాణవల్లి ఒక కల్పనేనోయి  భాందవ్యాలు వట్టి భ్రమేనోయి  బంధుత్వాలను బద్దలు చేయవోయి  భాగాలుగా విభాజించుకోవోయి భజన చెక్కలు పట్టుకోవోయి   కోటాలు రాబట్టుకోయి వాటాలు కొట్టు కోని బాగుపడవోయి  తెలుగు జాతి మనదోయి రెండుగా పగులు జాతి మనదోయి!  ఆవేశం ఎక్కువేనోయి  ఆలోచన శూన్యమేనోయి  వితండం విప్లవం విపరితమేనోయి  వివేకం విచక్షణ విసుమంతేనా లేదోయి   సొంత లాభం చూచుకోవోయి తోటి వాడిని తొక్కి పడదోయవోయి  తెలుగు జాతి మనదోయి  నిండుగా రగులు జాతి మనదోయి!  అవినీతికి హారతులు పడతాం  చెరసాలకు పరుగులు పెడతామోయి  కులాలకు కుంపట్లు పెడతాం  డబ్బుకు,డాబుకు డప్పు కొడతామోయి  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీటం ఎక్కినా మన తీరు మారదోయి!  తెలుగు జాతి మనదోయి మెండుగా గుబులు జాతి మనదోయి!  గతాన్ని గుర్తుంచుకోవద్దోయి  స్వార్దానికి చెయ్యెత్తి జై కొట...