Skip to main content

Posts

మనువు దృష్టిలో జ్యోతిషము

"జ్యోతిషము, హస్త సాముద్రికము అనేవి పచ్చి మోసాలు"  ఈ మాట ఎవరో శాస్త్రీయ దృష్టి కలిగిన ఆధుని కుడు అన్నది కాదు.  ఇది భారతీయ స్మృతి కారుడు మనువు పేర్కొన్నది.  మనువు  రాసిన ‘మను ధర్మ శాస్త్రం' ద్వారా వర్ణాశ్రమ ధర్మాలను వ్యవస్థీకృతం చేసి, సామాజికంగా కర్కశమైన కుల నియమాలను, కఠినమైన కట్టుబాట్లను ఏర్పరచి సమాజాన్ని నిమ్నోన్నత సామాజిక వర్గాలుగా ముక్క చెక్కలు చేశాడన్న దుష్కీర్తిని మూటగట్టుకున్న మనువు తాను రూపొందించిన ‘మనుస్మృతి' లోని నవమాధ్యాయంలోని 258 వ శ్లోకంలో ఏమన్నాడో చూడండి - (నేపథ్యం : రాజు తన రాజ్యంలోని ప్రజల సంక్షేమం దృష్ట్యా ఎవరెవరి పట్ల జాగరూకత కలిగి ఉండాలో చెపుతాడు మనువు. రాజు తన చారుల ద్వారా దొంగల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజాధనాన్ని దోచుకునే దొంగల్లో రెండు రకాలు. మొదటి రకం ప్రత్యక్ష దోపిడీ చేసేవారు. వీరిని మనువు ‘ప్రకాశ వంచకులు’ అన్నాడు. వీరు పట్టపగలు - అంటే ప్రత్యక్షంగా, బహిరంగంగా - ప్రజలను దోచుకునేవారు. వివిధ వ్యాపారాలు చేస్తూ, ప్రజలకు తూకం తక్కువ సరకులు, కల్తీ సరకులు మొదలైనవి అమ్మేవాళ్ళు. రాత్రి వేళల్లో ...

మూఢ నమ్మకాల నిర్ములన చట్టం - సాధన సదస్సు

మూఢ నమ్మకాల నిరుమూలన  చట్టం  - ఆవశ్యకత  - సాధన  కొరకు గుంటూరులో 25-06-2017 మల్లయ్య లింగం భవన్లో హేతువాదులు , అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు ఒక సదస్సు ఏర్పాటు చేసారు. దీనిలో హేతువాది పి. సుబ్బరాజు గారిచే రూపొందించబడిన మూఢ నమ్మకాల నిర్ములన చట్టం యొక్క ముసాయిదా ప్రతిని ( ఇంతకు ముందే మహారాష్ట్ర లో ఉన్న చట్టం నేపథ్యంలో) ప్రవేశపెట్టి దాని లోతుపాతులను చర్చించారు. ఉదయం జరిగిన సమావేశంలో ఆంద్ర ప్రదేశ్ హేతువాద సంఘం అధ్యక్షులు నార్నె వేంకట సుబ్బయ్య గారు, శాసన మండలి సభ్యులు రామ కృష్ణ  , మాజీ ANU  రిజిస్టార్ ఆర్ . సాంబశివరావు, రచయత ప్రొఫెసర్ కొడాలి శ్రీనివాస్, మద్దుకూరి అశోక్ గారు ప్రసంగించారు.  సాయంత్రం సభలో వివిధసంఘాల ప్రతినిధులు  ఈదర గోపీచంద్, జంపని కృష్ణ కిషోర్ , హేతువాది సంపాదకులు  ఐ. వి. గారు, ఊట్ల రంగనాయకులు గారు  ప్రసంగించారు.  ప్రజలలో చైతన్యం కలిగించగలిగితే మూఢ నమ్మకాలు వాటంతకవే పోతాయి అని అప్పటి వరకు ఇప్పుడున్న చట్టాలు సరిపోవని అభిప్రాయపడుతూ ఈ చట్టం గురించి ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించి...

దేవుళ్ళ కబ్జాలో రహదారులు !!!

వీధుల్లో, ప్రభుత్వ స్థలాల్లోప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్మించే ప్రార్ధనా మందిరాలకు, విగ్రహాలకు అనుమతి ఇవ్వరాదని అన్ని ప్రభుత్వాలకు ఇంతకు ముందే సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వటం దేశానికి శుభోదయం. దానిని పెడచెవిని పెట్టటం దివాలాకోరు రాజకీయం.  దేవుని పేరుతొ సంఘానికి / సమాజానికి అసౌకర్యాన్ని ఆటంకాలను కల్పించే ఈ ప్రార్ధనా మందిరాలను, నేతల విగ్రహాలను రోడ్లపై ప్రతి చోట మనం గమనించుతున్నదే. రహదారులు రాక పోకలకు మాత్రమే నన్న జ్ఞానం కొరవడి, పంతాలు పట్టింపులకు పోయి మనకు మనమే కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం.  వాస్తు శాస్త్రం లో దేవాలయాలు నిర్మిం చటానికి అనువైన ప్రదేశాల గురించి కొన్ని మార్గ దర్శకాలు వున్నాయి. ప్రశాంత ప్రదేశాలలో, అసౌకర్యం కలుగకుండా వీటిని నిర్మించుకోవాలి. దేవాలయ వాస్తు ప్రకారం వీధుల్లో అడ్డంగా గుడులు/ఆలయాలు కట్టరాదు. గుడి చుట్టూ ప్రదక్షిణాలకు తగినంత ఖాళీ ప్రదేశం వదలి తీరాలి. అపరిశుభ్ర ప్రదేశాలలో, జనావాసాల మధ్య వీటిని నిర్మించరాదు. ఈ జ్ఞానం వీధుల్లో గుడి కట్టే వారికి కాని, దాన్ని బలపరిచే/ప్రోత్సహించే వారికి కాని...

జ్యోస్యం - నిజానిజాలు

"జ్యోతిష్యం నిజంగా జరుగుతుందని భావిస్తే ... దాన్ని నిప్పుల్లో వేయి, అది అబద్దాల పుట్ట అని తలిస్తే ... దాన్ని నీళ్ళలో వేసేయండి" అని బృహత్ సంహిత/బృహత్ జాతక వంటి గ్రంధాలకు వ్యాఖ్యానం రాసిన భటోత్పలడు జ్యోతిష్యం గురించి చెప్పాడు.  జాతక ఫలితాలు నిజమౌతాయని ప్రజలు తలిస్తే మనుషులు నిర్విరులు అవుతారు,కార్యాశక్తిని కోల్పోయి సోమరులుగా తయారౌతారు. సమాజం భయాందోళనలతో జీవిస్తుంది. అరాచకం, అశాంతి ప్రబులుతుంది. ఇన్ని అనర్దాలు కల్పించే దిన్ని ఆనవాళ్ళు కానరాకుండా నిప్పుల్లో వేసి తగలపెట్టాలి. అలా కాదు జ్యోతిష్యం ఎప్పుడు నిజం కాదు, అబద్దాల పుట్టని భావిస్తే దానివల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనం కలగదు. కేవలం కాలహరణ చేసే ఈ విద్య అమాయకులను మభ్యపెట్ట టానికి, ప్రజలను దోచుకోవటానికి మాత్రమే పనికివస్తుంది. కాబట్టి ఈ అబద్దాల రాతలు కనిపించకుండా దాన్ని నీటిలో వేయండి.  ఏతా వాతా చెప్పేదేమంటే సమాజహితం కోరేవారు వెనకా ముందు ఆలోచించకుండా జ్యోతిష్యాన్ని తక్షణమే తుదముట్టించాలి.

నాడీ జ్యోస్యం -నిజానిజాలు

వ్యక్తుల  జీవితాలకు సంభందించి జరిగిన ,జరుగుతున్న, జరగబోతున్న విషయాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాసను ఆసరాగాచేసుకొని రకరకాల పద్దతులలో జ్యోస్యాలు చెప్పే దైవజ్ఞులు పుట్టుకొస్తున్నారు.  కొత్త సీసాలో పాత సార పోసేచందానా  'నాడీ జ్యోతిష్యం' పేరుతో ఒక జ్యోతిష్యం రూపుదిద్దుకుంది. ఇది కుడా కొత్త ముసుగులో  దాగిఉన్న ఒక వంచనావిద్యయే.   ఈ వంచనా విద్య తమిళనాడు లో వైదీశ్వరి కోయిల్ లో పుట్టి దేశవ్యాప్తంగా విస్తరించింది.  ఎ శాస్త్రం అయినా ప్రజలలో విశ్వాసం కలుగాజేయాలంటే అది ఋషి ప్రోక్తం అనో ,దైవ ప్రోక్తం అనో చెప్పటం అనాది గా మన దేశం లో వస్తున్న ఆనవాయితి.  ఆ కోవలోనే శివ, ఆగస్య,శుక,కాక భుశిండ  మహర్షుల  ప్రోక్తం గా చెప్పబడే ఈ నాడీ శాస్త్ర గ్రంధాలు చోళ రాజుల కాలంలో తమిళము లోకి అనువదించ బడ్డాయని, వాటిని బట్టి వంశపారంపర్యంగా తాము జ్యోస్యాలు చెప్పుతున్నామని  ఒక కల్పిత కధను నాడీ జ్యోతిష్యం చెప్పే తమిళ తంబిలు మనకు చెబుతారు. వీటికి సంబంధించిన ప్రామాణిక మూల గ్రంధాలు ఏవి లేవు.  నిజానికి ఆ తాళ పత్ర ...

రేఖల్లో రాతలు దాగుంటాయా?

రాతలు రాజ్యాలు ఏలుతాయి అని అంటుంటే ... గోచారం గాడిదలు కాయాలని చెప్పిందని ఒక నానుడి. అంటే చేతి రేఖలను బట్టి చెప్పే జాతకం రాజ్యాన్ని పాలిస్తావు అని చెబుతుంటే, గ్రహ స్థితి గతులను బట్టి చెప్పే జాతకం గాడిదలు కాసే హీనజీవనం గడుపుతావని సెలవిస్తాయని ఉవాచ. ఈ జాతక విద్యలు దొందు దొందే అనేది జగమెరిగిన సత్యం. ఇవే కాదు ఎఇద్దరు చెప్పిన జ్యోస్యాలు ఒకే రీతిన ఉండవన్నది వాస్తవం.  అరి చేతి రేఖల్లో మన తల రాతలు  దాగి ఉంటాయని ,వాటిని బట్టి మనుషుల  జాతకం చెప్పే ఒక ఉహాజనిత వంచనా కళే  ఈ  హస్త సాముద్రికం. పామిస్త్రీ, చేరోమేన్సి, చేరోగ్రాఫి అనే  పేరుల తో దేశ దేశాల్లో  చెలామణి అయ్యే ఈ కళ మొదట గ్రీకుల నుండి మనకు సంక్రమించి మన అంగ సాముద్రికంలో హస్త సాముద్రికం పేరుతో ఒక భాగంగా చోటు సంపాదించుకుంది.   మనుషుల ఆకృతిని బట్టి ,అవయవాల తీరును బట్టి వాళ్ళ వ్యక్తిత్వం, భవిషత్తును చెప్పే శాస్త్రమే ఈ అంగ సాముద్రికం. దీనిలో పురుష  సాముద్రికం , స్త్రీ  సాముద్రికం  అని రెండు భాగాలు. మనుషుల వడ్డు పొడవులను బట్టి, రంగు ...

అంకెలు అదృష్టాన్ని అందిస్తాయా?

శాస్త్రమునెల్ల చదివి విజ్ఞాన మెరిగి  సంశయింపక సర్వధా చర్చ జేసి  నిజమెరుంగ వలయు  ఇది నేర్వకున్న  మూఢ విశ్వాసమున జేటు ముడుచుండు !! అని కవిరాజు త్రిపురనేని రామస్వామి గారు ఏనాడో హెచ్చరించారు. హేతుబద్ద రహిత సమాజంలో మూఢ విశ్వాసాలనే కలుపు మొక్కలు నిరంతరం మొలుస్తూనే ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూనే ఉండాలి. వీటి వేళ్ళు  సమాజంలో చాలా లోతుగా పాతుకు పోయి ఉన్నాయి. పాతవి పోగొడుతుంటే కొత్తవి చిగురేస్తూ ఉంటాయి. అలాంటి కొత్త తరం విశ్వాసాలలో ఒకటే ఈ " అంకెలు పై నమ్మకం ". న్యూమరాలజి అనే ఈ ' సంఖ్యా జ్యోతిషం'  సంఖ్యలను ఉతంగా చేసుకొని అమాయకులకు సంఖెళ్ళు వేస్తున్న వైనం విస్తుగోల్పుతుంది.  గణిత శాస్త్రంలో ప్రాధానమైన అంకెలు తొమ్మిది. మన భారతీయులు కనిపెట్టిన శున్యాంకం వల్ల ఎంత పెద్ద సంఖ్య అయిన సులభంగా రాసే వెసులుబాటు వచ్చింది. గణితం సకల శాస్త్రాలకు మాతృ స్థానం. సంఖ్యా గణితం - దాని ఘనత, విజ్ఞాన శాస్త్రంలో సుస్పష్టమైన పాత్ర మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి గణితాన్ని గతి తప్పించి వంచానావిధ్యగా మార్చారు. గణిత సమస్యలకు సమాదానం చెప్పే క్...