Skip to main content

Posts

పుష్కరాలు ఎవరి కోసం ?

వందల కోట్లు ఖర్చు పెట్టి 2015, జూన్ 14 నుండి మొదలైయే  గోదావరి పుష్కరాలను  దేశంలోనే ఘనంగా జరపాలని రెండు  తెలుగు రాష్ట్రాలు   ప్రణాళికలు సిద్దం చేసాయి. వచ్చే ఏడాది మరల కృష్ణానదికి పుష్కారాలు వస్తాయి.   12 ఎండ్లకోకసారి  పుష్కారాల పేరుతో  ప్రజాధనం నీటిపాలు అయ్యే ఈ 'కుంభ మేళాలు'  నిజంగా ఎందుకోసమో  ఎవరి కోసమో పరిశీలిద్దాం.  ముందుగా గురు పంచాంగం గురించి తెలుసుకుందాం. మన దేశంలో కాలాన్ని గణించటానికి సూర్యమానం, చంద్రమానం లతో పాటు కొన్ని ప్రాంతాలలో బృహస్పతి మానం కుడా ఉపయోగించారు. బృహస్పతి మానం అంటే బృహస్పతి గ్రహగతులను బట్టి కాలాన్ని లెక్కించటం. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురుడు అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం గురుడు భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. దీనిని బట్టి మనకు  12 సంవత్సరాలు కాలం దేవతలకు ఒక దినం అనే  ఒక నమ్మకాన్ని పుట్టించారు. ప్రజల దినసరి కాలగణనకు బృహస్పతి మానం (దేవతల మానం) పనికిరాదు కాబట్టి అది వ్యవహారంలో లేకుండా పోయింది. అయితే దాని అవశేషం మా...

సత్యమేవ జయతే

నిజం నిలకడ మీద  తెలుస్తుందని నానుడి.  సత్యమేవ జయతే అనే ఉపనిషత్ వాక్కు ని మనం రాజముద్రలో నిక్షిప్తం చేసుకొన్నాం.  అబద్దాలతో అందమైన అద్దాల మేడ కట్టిన అసత్యం రాజు ఎట్టకేలకు కటకటాలపాలు అయ్యాడు.  అత్యాస ఎంతటి వాడినైనా అదోగతిపాలు చేస్తుంది అనేదానికి తాజా ఉదాహరణ సత్యం రామలింగరాజే.  ఆర్దిక నేరాలకు సరైన శిక్షలు పడవని భావించే మోసగాళ్ళకు ఇది కనువిప్పు కావాలి.  అలాగే దొంగలను, లంచగొండులను, పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రజాధనం దోచుకున్న వారిని , స్మగ్లర్లు , ఎర్ర చందనం దొంగలను, మైనింగు మాఫియా లను, మతోన్మాద తీవ్రవాదులను సమర్దించే వారిని ప్రజలు ఈసడించే రోజు కుడా త్వరలో వస్తుందని ఆశిద్దాం.  దొరికితే దొంగ అనే పాత వాదన వదిలి  సిగ్గు ఎగ్గు లేకుండా దొరికినా దొంగ కాదు , దొర అనే వారు, అరవీర భయంకర ఎర్ర చందనం దొంగలను అమాయక కూలీలు  అనే తమిళ తంబిలకు తందానా అనే తెగులు సోకిన తెలుగు వారు ముసుగులు తొడుక్కున్న దొంగలే.  వీరిని ఒకకంటిన కనిపెట్టి ఉండాలి,  జనులారా జరా బద్రం  

ఆంధ్రుల రాజధాని అమరావతి

పేరులో ఏముంది? అనేవారు కొందరైతే పేరులోనే ఉన్నది పెన్నిది అనేవారు మరికొందరు.  ప్రపంచం ఆశ్చర్యపడేలా ఆంధ్రులకు అద్భుత రాజధాని కావాలని కాంక్షించే వారికి దానికి తగిన పేరు కుడా ఉన్నతంగా ఉండాలని ఉబలాటపడటం సహజమే. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు  దూరదృష్టితో  నవ్యాంధ్ర రాజధానికి అమరావతి   అని పేరు పెట్టటం అన్ని విదాల  ఆమోదయోగ్యమైన నిర్ణయం.   ఎప్పుడో  2000 ఏళ్ల క్రితమే    ఆంధ్రుల రాజధాని గా   విలసిల్లిన  ధాన్యకటకం ( ధరణికోట) ఆ  తరువాత అమరావతిగా ప్రపంచ ప్రసిద్ది చెందినది.  ఈ పట్టణం పేరు  తిరిగి స్పురించేలా  నేడు మరల నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అవతరించటం శుభపరిణామం.  తాత పేరు మనుమడికి పెట్టె సాంప్రదాయం మన తెలుగునాట సర్వ సాదారణ విషయమే. తాత పేరు, కీర్తి నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ వరవడి కొనసాగుతుంది. కొత్త అమరావతి గత కీర్తులను అధికమించాలనే అందరి ఆకాంక్ష.  బౌద్ధం,జైనం , శైవం వంటి భిన్న మతాల, సంస్కృతులకు కాణాచిగ ా పేరొందిన  అ...

వాస్తు భూతం మళ్లీ పుట్టింది - గల్పిక

బంగారు భూమిలో  భాగ్య నగరం నడిబొడ్డున నిశరాత్రిలో  ఓ గార్దబం గుడ్డేట్టింది. ఆ గార్దభాండం బళ్ళున బద్దలై  దాని నుండి వికృతాకారం తో పెడబొబ్బలు పెడుతూ  భూ ఆకాశాలను తాకుతూ ఓ మహాభూతం ఉద్బవించింది. రాబోయే కీడును సూచిస్తూ గుంట నక్కలు, గుడ్లగూబలు నిశరాత్రి లో భయంకరంగా అరిచాయి. పాల పిట్టలు పరుగులు తీస్తే, ఊరకుక్కలు ఏడుపు లంకించుకున్నాయి. అకాలంగా ఆకాశంలో కారు  మబ్బులు కమ్మి ఉరుములు మెరుపులతో గులాభిరంగు వాన కుండపోతగా కురిసింది.  అకస్మాతుగా కనపడిన ఈ అపశకునాలు గుచ్చి గుచ్చి చూసి పిచ్చి పండితమన్యులు  బంగారు భూమికి  భూత కీడు దాపురించినదని,  ఆనాటి వాస్తు భూతం మళ్లీ పుట్టింది అని  సెలవిచ్చిచారు.   ఈ భూత ఉత్పాతం వల్ల రాబోయే రోజులలో బంగారు భూమికి ఎంత కీడు చేస్తుందో నని తెరాసురల  అధిష్టాన, ఆస్థాన దేవతలు, పొద్దుకూకులు తెలంగాణ జపం చేసే ఉస్మానీశ్వరులు, ఆచార్యులు, గులాభిలో ఎర్ర రంగును చూసే శుక్ల దృష్టి గల క్రామేధావులు, పోరాడితే ప్రాణం తప్ప పోయేదేమనే పోకిరి...

క్రేజీ ప్రభుత్వానికి స్వాగతం!

దేశ రాజధాని దిల్లి లో 70 శాసన సభాస్థానాలలొ 67 సాధించి అరవింద్ కేజ్రివాల్  ఆధ్వర్యంలో కొలువు తిరబోతున్న జన ప్రభుత్వానికి స్వాగతం.  చలి చీమలు అన్ని కుడి బలమైన సర్పాన్ని చంపినట్లు, గడ్డి పోచలు అన్ని ఏకమై మద గజాన్ని బందించినట్లు సామాన్యులు ఒక్కటై రాజకీయ కీచకులను కిందకు త్రోసి   అద్వితీయ విజయాన్ని ఆమ్ఆద్మీకి  అందించి  తమ ప్రతినిధులను పరిపాలకులుగా  ఎన్నుకోవటం నిజంగా శుభ పరిమాణం.  ఈ ఎన్నికలో  అవినీతిని, అవకాశ కుళ్ళు రాజకీయాన్నిఅమ్ ఆద్మీ పార్టీ  చీపురు కట్టతో శుభ్రం చేసింది.  డబ్బు పెట్టె వారే ఎన్నికలలో పోటి చేయాలనే ధన మధాంధవాదాన్ని పటాపంచలు చేసి సేవా భావం, మంచి వ్యక్తిత్వం ఉన్న ఎవరైనా ప్రజా ప్రతినిదులుగా పోటీచేసి గెలవచ్చు నని ఈ ఎన్నికలు రుజువు చెసాయి. అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం లో వచ్చిన ఈ మార్పు దేశాన్ని ప్రేమించే వారందరికీ సంతోషదాయకం.  గజ కర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలలో ఆరితేరిన కాంగ్రెస్/ బిజె.పి. ల ఎత్తులను చిత్తు చేసిన  ఆమ్ ఆద్మీ వారి ప్రజా ప్రభుత్వం ప్రగతి పధంలో...

వాస్తు -బంగారు తెలంగాణ

రాజుల సొమ్ము రాళ్ళ పాలు అని పాత మాట. ప్రజల సొమ్ము వాస్తువశం అని నేటి మాట. తెలుగు రాష్ట్రాలను పాలించే తెగులు నాయకులకు అధికారపీటం దక్కగానే వాస్తు భయాలు వెంటాడుతున్నాయి. నేతలలో వివేకం లోపించి విశ్వాసాలు చోటుచేసుకుంటున్నాయి.  దినదిన గండం ఐదేళ్ళ పదవి అన్నట్లు వచ్చిన/దక్కిన పదవికి ఎక్కడ వెసరు వస్తుందో అన్న మీమాంస లేదా ఏ అర్దాంతర ఆపద వస్తుందోనని భయం... ఇలాంటి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటుంది.  ఈనాడు సౌజన్యంతో  తెలంగాణ ముఖ్య మంత్రి గారికి కొత్తగా వాస్తు భయం పట్టుకుంది. ఆయనకు వాస్తుపై పిచ్చిఅభిమానం ఉంటె వారి సొంత ఇంటికి, అదీ చాలకపోతే తెరాస పార్టీ తెలంగాణ భవనంకు, ఇంకా సరిపోకపోతే వాళ్ళ స్థిరాస్తులకు సొంత డబ్బుతో వాస్తు సరి చేసుకోవాలి. పిచ్చోడి చేతికి రాయి దొరికింది అన్నట్లు ఆయన వాస్తు వక్ర దృష్టి రాష్ట్ర సచివాలయం పై పడింది.  ఘన చరిత్ర ఉన్న రాష్ట్ర సచివాలయానికి వాస్తు బాగాలేదట. భయంకరమైన వాస్తు దోషం ఉందట.(ఎవరు చెప్పారు?) గత చరిత్ర చూస్తే 'గలీజు' ఉండి ఎ ముఖ్యమంత్రి ముందుకు పోలేదట. అందుకని 150 కోట్ల రూపాయలు పెట్టి ఎర్రగడ్డలో ఆసుపత్రిని కూలగొట్టి తనకు సరిపడే వ...

నవ్యాంధ్ర రాజధాని - రాజకీయం

కేవలం 13 జిల్లాలకు ఇంత పెద్ద రాజధాని కావాలా? దానికొరకు  ప్రజలకు తిండి పెట్టె పచ్చని పంట భూములు పణంగా పెట్టాలా? ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి?  ఇత్యాది యక్ష ప్రశ్నలతో ఈ మధ్య కొందరు బ్లాగర్లు, మేతావులు  ప్రజా పరిరక్షణ పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు.ఈ వాదన చేసే వారు కొన్ని వాస్తవాలు గ్రహించాలి.  ఇది అవశేష13 జిల్లాలకు రాజధాని కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అనే స్పృహ ఉండాలి.  ఆంధ్రుల ఆత్మ గౌరవానికి, అభున్యతికి ఒక అపురూప జనపధం గా పరిగణించాలి.  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు చిరునామా అన్న విషయం గుర్తుంచుకోవాలి.  అలాగే రాజధాని అంటే అసంబ్లీ హాలు  ... మాత్రమే అనటం హాస్యాస్పదం. ఈ వాదన చేసే  వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి . చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానం తో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు. అది ముంబాయి, కొలకొత్త, హైదరాబాద్ వంటి అస్తవ్యస్త మహా నగరాలు గా మారకూడదనే ముందు చూప...