India Post released a stamp of Tripuraneni Gopichand on 8th September 2011. త్రిపురనేని రామస్వామి ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది నాస్తికుడు , సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లాఅంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త ,కవిరాజు త్రిపురనేని రామ స్వామి . తండ్రి కొడుకులు లిద్దరికీ మన తపాల శాఖ ప్రత్యక తపాల బిళ్ళలను విడుదల చేయటం అపూర్వ విషయం. హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో రామస్వామి గారి వద్ద పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. 1932 లో వివాహం;1933లో బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటి...