Skip to main content

Posts

భద్రాచలరామాలయం -వాస్తు దోషాలు

మూలవిరాట్ విగ్రహం -   భద్రాచలం   భక్త రామదాసు చే భద్రాచలం లో 1670 ప్రాంతంలో కట్టబడిన శ్రీ  సీతారామచంద్రుల దేవాలయం శిధిలావస్థకు చేరుకోగా 1960 లో శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో క్రొత్తగా నిర్మించారు.రామదాసు కట్టించిన ఆనాటి  దేవాలయం నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రమాణాలకు విరుద్దంగా ఉన్నట్లు ఆలయ స్థపతి గణపతి స్థపతి చంద్రమౌళి గారి దృష్టికి తీసుకు వచ్చారు. ఆలయాన్ని తిరిగి నిర్మించు తున్నాము కాబట్టి శాస్త్ర ప్రమాణంగా  నిర్మిం చితె మంచిదని చెప్పగా వాటిలో సహేతుకమైన వాటిని పాటించాలని చంద్రమౌళి గారు అభిప్రాయ పడ్డారు. ఆనాడు వాస్తు దోషాలుగా భావిస్తున్న  వాటిలో  ముఖ్యమైనవి,ప్రధానమైనవి మూడు వాస్తు దోషాలు. ౧.ఈ దేవాలయం సింహ ద్వారం పశ్చిమాభిముఖంగా ఉండటం. సాధారణం గా వైష్ణవ దేవాలయాలు తూర్పు దిశకు అభిముఖం గా నిర్మించటం ఆగమ వాస్తు నియమం. ౨.మూలవిరాట్ విగ్రహం లో లోపాలు ఉండటం. శ్రీ రామ చంద్రునికి ఎడమ ప్రక్క సీత, కుడి ప్రక్క లక్షమణ స్వామీ ఉండాలి. అయితే లక్షమణ విగ్రహం కుడా ఎడమ ప్రక్కనే ఉంది. సీతమ్మ వారు రాముని తొడపై కూర్చున్న భంగిమ ...

శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి అభిమానులకు విజ్ఞప్తి

Kalluri Chandramouli 1898-1992 గుంటూరు లోను మరియు మోపర్రు లోను శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి విగ్రహ ప్రతిష్ట చేయాలని వారి అభిమానులు తలంచి, ఈ కార్యక్రం లో పాలు పంచుకోవలిసినిదిగా శ్రీ కల్లూరి చంద్రమౌళి గారి అభిమానులకు విజ్ఞప్తి చేయుచున్నారు. ఈ కార్యక్రంలో ఒక భాగంగా చంద్ర మౌళి గారిపై  పై ఒక ప్రత్యేక సంచిక వెలువరించాలని చంద్ర మౌళి విగ్రహ కమిటి భావిస్తుంది.శ్రీ చంద్రమౌళి గారి జీవిత విశేషాలు,వారి రచనలు, ఫోటోలు సేకరించాలని తలంచినాము. ఈ విషయం లో మీ సహాయ సహకారాలు అందించ వలిసిందిగా విజ్ఞప్తి చేయుచున్నాము. గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసు...

హిత వచనాలు..ఖలీల్ జిబ్రాన్

మీ పిల్లలు మీ సొంతం అనుకోకండి  వాళ్ళు మీ  జీవితేచ్చకు  జన్మించిన వాళ్ళు . వాళ్ళు మీ ద్వారా వచ్చారు తప్ప మీ నుండి కాదు . వాళ్ళు మీతో ఉన్నా మీకు చెందరు మీరు వాళ్ళతో ఉండాలని ప్రయత్నిస్తే  ప్రయత్నించారు గాక, వాళ్ళు మీలా ఉండాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే జీవితం వెనక్కు మళ్ళదు గనకా, నిన్నటితో మళ్ళీ అతుక్కుపోదు గనకా                                                                                                                                                         ..ఖలీల్ జిబ్రాన్

నవయుగాల బాట - నార్ల మాట !

నార్ల వెంకటేశ్వరరావు  (1908 - 1985 ) తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాది గా, మానవతావాది గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ 'సీతజోస్యం' రాశారు.రామాయణాన్ని; రామ, రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్యభావజాలానికి సవాలు విసురుతూ 'శంభూక వధ' రాశారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. ' బు...

అయోధ్య తీర్పు - పారా హుషార్

ఇరు మతాల వారి మద్య సయోధ్య చేయటానికి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అయోధ్య తీర్పు అమోదించ దగ్గదే. దీనిద్వారా లబ్ది పొందలేమనే రాజాకియులు అప్పుడే రాద్దాంతం మొదలు పెట్టారు.1500 గజాల చిన్న స్థలం పై మరల ఇరు మతాల వారిలో ఆవేశ కావేషాలు రగల్చి,ఆమంటలలో ఓట్ల పండుగ చేసుకోవటానికి నీచ రాజకీయం కాచుకు కూర్చుంది. ఈ గుంట నక్కలు అయోధ్య లో మసీదు-మందిరం ల మధ్య రగిలిన చితి మంట ఆరిపోకుండా తలా ఒక పుల్ల వేస్తూనే ఉంటారు. ఈ కేసు సుప్రీం కోర్టు వెళ్ళినా ఆ తరువాత అది ఎ తీర్పు ఇచ్చిన అది అమలు అవుతుందా అనేది కుడా ప్రశ్నార్ధకమే! తీర్పు ఏదైనా శిరాసావంచమనే పెద్దలు రేపు తమకు అనుకూలంగా తీర్పు లేకపోతే దేశాన్ని తిరిగి రావణ కాష్టం చేయరన్న గ్యారింటి ఏమి లేదు. కాబట్టి ఇరు మతాల వారు ఈ రాజకీయ ఉచ్చులో పడకుండా అయోధ్య తీర్పును మార్గ దర్శకంగా కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుంటే దేశానికి,జాతికి శుభం.ఈ విషయంలో మన శాంతి భగ్నం కలిగించే గుంట నక్కలు పొంచిఉన్నారు - ప్రజలారా ! పారా హుషార్!!

ప్రపంచ శాంతి కొరకు ప్రతిజ్ఞ

సర్వేజనా సుఖినో భవంతు ! ప్రపంచ శాంతి  దినోత్సవ సందర్బంగా 21 -09 -2010 న ఉదయం 11 .౦ గంటలకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాంతి కార్యక్రం లో అందరూ పాల్గొనండి.అందరూ సుఖంగా, శాంతి గా ఉండాలని కోరుకుంటూ శాంతి ప్రతిజ్ఞ చేద్దాం. శాంతి ప్రతిజ్ఞ   "ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ,  నేను శాంతి గా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి  శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతిని భంగపరచనని  ప్రతిజ్ఞ చేస్తున్నాను".

మూఢ నమ్మకాల నుండి విముక్తి ఎప్పుడు?

న ల్గొండ జిల్లా ఒక కుగ్రామం లో బాణామతి/ చేతబడి పేరుతో చదువు సంద్యలు లేని ఇద్దరు వృద్దులను( ఒకరు  గొర్రెల కాపరి, మరొకరు కాపాలాదారుడు ) సజీవ దహనం చేసిన  సంఘటన ఇంకా మన సమాజం లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలకు సజీవ సాక్షం గా దర్శనమిస్తుంది.  సరైన వైద్యం అందక అనారోగ్యం తో చనిపోతే దానికి క్షుద్ర శక్తుల ను ప్రయోగించాటమే కారణం అనే మూఢ నమ్మకం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ వున్నాయి. మారు మూల పల్లెలలో లోతుగా పాతుకుపోయిన ఇలాంటి విశ్వాసాలను  తొలగించటానికి  విశేషమైన కృషి చేయ వలిసిన      బాద్యత  విద్యావంతులందరి  పైనా ఉంది. పెత్తందారి వ్యవస్థ నుండి,మత దురహంకారుల నుండి విమోచనం పొంది ఆరు దశాబ్దాలు గడిచినా తెలంగాణా ప్రజలకు ఇంకా మూఢ విశ్వాసాల నుండి విమోచన కలగక పోవటం సిగ్గు చేటు. తెలంగాణా లో తరుచు జరుగుతున్న ఈ అనాగరిక ,ఆటవిక విశ్వాసాలను సమూలంగా నాశనం చేసేలా ఒక ఉద్యమంగా  ప్రజా సంఘాలు,హేతువాదులు కృషి చేయాలి.అవిద్య,అజ్ఞానం ల నుండి విముక్తి కలిగేలా ఈ ఉద్యమం సాగాలి.