Skip to main content

Posts

ప్రపంచ శాంతి కొరకు ప్రతిజ్ఞ

సర్వేజనా సుఖినో భవంతు ! ప్రపంచ శాంతి  దినోత్సవ సందర్బంగా 21 -09 -2010 న ఉదయం 11 .౦ గంటలకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న శాంతి కార్యక్రం లో అందరూ పాల్గొనండి.అందరూ సుఖంగా, శాంతి గా ఉండాలని కోరుకుంటూ శాంతి ప్రతిజ్ఞ చేద్దాం. శాంతి ప్రతిజ్ఞ   "ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ,  నేను శాంతి గా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి  శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతిని భంగపరచనని  ప్రతిజ్ఞ చేస్తున్నాను".

మూఢ నమ్మకాల నుండి విముక్తి ఎప్పుడు?

న ల్గొండ జిల్లా ఒక కుగ్రామం లో బాణామతి/ చేతబడి పేరుతో చదువు సంద్యలు లేని ఇద్దరు వృద్దులను( ఒకరు  గొర్రెల కాపరి, మరొకరు కాపాలాదారుడు ) సజీవ దహనం చేసిన  సంఘటన ఇంకా మన సమాజం లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలకు సజీవ సాక్షం గా దర్శనమిస్తుంది.  సరైన వైద్యం అందక అనారోగ్యం తో చనిపోతే దానికి క్షుద్ర శక్తుల ను ప్రయోగించాటమే కారణం అనే మూఢ నమ్మకం వల్ల ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతూ వున్నాయి. మారు మూల పల్లెలలో లోతుగా పాతుకుపోయిన ఇలాంటి విశ్వాసాలను  తొలగించటానికి  విశేషమైన కృషి చేయ వలిసిన      బాద్యత  విద్యావంతులందరి  పైనా ఉంది. పెత్తందారి వ్యవస్థ నుండి,మత దురహంకారుల నుండి విమోచనం పొంది ఆరు దశాబ్దాలు గడిచినా తెలంగాణా ప్రజలకు ఇంకా మూఢ విశ్వాసాల నుండి విమోచన కలగక పోవటం సిగ్గు చేటు. తెలంగాణా లో తరుచు జరుగుతున్న ఈ అనాగరిక ,ఆటవిక విశ్వాసాలను సమూలంగా నాశనం చేసేలా ఒక ఉద్యమంగా  ప్రజా సంఘాలు,హేతువాదులు కృషి చేయాలి.అవిద్య,అజ్ఞానం ల నుండి విముక్తి కలిగేలా ఈ ఉద్యమం సాగాలి.

ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు !

“ Remember, your work may be only to sweep a railway crossing, but it is your duty to keep it so clean that no other crossing in the world is as clean as yours."   సర్ M.విశ్వేశ్వరయ్య  సాంకేతిక విజ్ఞానాన్ని సమాజానికి అందించే అపర బ్రహ్మలకు  'ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు' 

గురుదేవో భవ !

గురుదేవో భవ !  విద్య తో పాటు జ్ఞానాన్ని,విజ్ఞాన్ని,వివేకాన్ని, వినయాన్ని,మంచితనాన్ని, మానవత్వాన్ని  నేర్పే గురువులందరికీ వందనాలు. మంచి ఉపాద్యాయుడు ఎలా ఉండాలో ఒక విద్యార్ది తండ్రిగా అబ్రహం లింకన్ వెలుబుచ్చిన అభిప్రాయాలు ఒకసారి మననం చేసుకుందాం. Abraham Lincoln's letter to his son's teacher He will have to learn, I know, that all men are not just, all men are not true. But teach him also that for every scoundrel there is a hero; that for every selfish Politician, there is a dedicated leader... Teach him for every enemy there is a friend, Steer him away from envy, if you can, teach him the secret of quiet laughter. Let him learn early that the bullies are the easiest to lick... Teach him, if you can, the wonder of books... But also give him quiet time to ponder the eternal mystery of birds in the sky, bees in the sun, and the flowers on a ...

రాశి ఫలితాలు - నిజానిజాలు

గత నెల లో ఈ బ్లాగులో కామెంట్స్ లో ప్రచురించిన జూలై రాశిఫలితాలు -2010 , నా రాశి (జ్యోతిష్య లెక్క ప్రకారం) 'కర్కాటం' లో పుట్టినవారికి ఫలితాలు ఇలా ఉన్నాయి . కర్కాటక రాశి: రెండవ వారం నుంచి మీ కార్యక్రమాలు ఒక ఊపు అందుకుంటాయి. కళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి. మీకంటే చిన్నవారు వాద్వివాదాలకు దిగగలరు.ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి మంచి ఫలితాలుండగలవు.రసాయనాలతో పని చేసే వారు జాగ్రత్తలు వహించాలి.గతం, స్వగతం కంటే ప్రస్తుతం ఉన్న కాలాన్ని గమనించి ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. సుబ్రహ్మణ్య కవచం చదవండి.     చిత్రమేమంటే  పైన పేర్కొన్న ఫలితాలలో ఎఒక్కటి నిజం కాలేదు. ఇదండీ రాశి ఫలితాల నిజ రూపం. దీనికి కొందరు "రాశి ఫలితాలు రాయటం రానివాడు రాసినవి కాబట్టి అవి మీకు సరిపోలేదని " అంటారు. ఇక్కడ శాస్త్రాన్ని దోషిగా నిలపకుండా జ్యోతిష్కుని దోషిగా నిలబెడతారు. ఈ వాదం లో వాస్తవం గ్రహించ గలరు. ఇక పోతే ఆగష్టు మాసం రాశి ఫలితాలు కుడా వచ్చాయి. నా వాదన తో ఏకీభవించని వారు వాటిని కుడా మరో సారి బేరీజు చేసుకొని నిజాన్ని గ్రహించాలని విజ్ఞప్తి.  రాశి ఫలితాలు - ఆగష్టు 2010  మేష రాశి: అసంతృ...

నక్షత్రాలు - జాతకాలు

జ్యోతిష్యం లో నక్షత్రాల పాత్ర , దాని శాస్త్రీయతను తెలుసుకుంటే గాని జాతకాల అసల గుట్టు అర్దం అవదు. 1. ఆకాశంలో మనకు కనపడే నక్షత్రాలు ఎన్ని? కనపడనవి ఎన్ని? వాటిలో జ్యోతిష్య శాస్త్రం లో ప్రస్తావించిన 27 నక్షత్రాలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? 2. జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి, జాతకాలకి ఉన్న సంభందం ఏమిటి? జన్మ నక్షత్రాన్ని బట్టి బిడ్డ పేరుఎందుకుండాలి? 3. నక్షత్రాలను 12 రాశులగా ఎందుకు విభజించారు? వాటి కి మేషం, వృషభం... వంటి పేర్లు ఎందుకు పెట్టారు? చైనావారి రాశులకు వాటికి తేడాలు ఎందుకున్నాయి? 4. రాశి ఫలాలు, గ్రహ ఫలాలు ఒకటేనా? 5. పుట్టిన తేదిని బట్టి జన్మ రాశి ని నిర్ణయించటం ఒప్పు అవుతుందా? 6. ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అంతా ఈ 12 రాశులలో ఉంటారు కదా , అందరి జాతకాలు ఇంచు మించు 12 విధాలగా ఉంటుందా? పత్రికలలో ప్రచురించే రాశి ఫలాలు సరైనవేనా? 7. నక్షత్రాల నుండి వచ్చే కాంతి మనకు చేరటానికి పట్టే సమయం గురించి జ్యోతిష్య శాస్త్రం లో ఏమైనా చెప్పబడిందా? 8. కాలం గడిచే కొద్ది భూ అక్షం లో వచ్చే మార్పులు (ప...

జ్యోతిష్యం-నవ గ్రహాలూ

జ్యోతిష్యాని ప్రాణం పోసే నగ్రహాల గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలిసిన విషయాలు ఉన్నాయి . వాటిలో ముఖ్య మైన వాటిని కొద్దిగా పట్టి చూద్దాం . 01 ) నవ గ్రహాలుగా పిలవబడే వాటిలో గ్రహాలు నిజంగా ఎన్ని ? 02 ) ఈ గ్రహాలు జడములా ? చైతన్యములా ? 03 ) పురాణాలలో నవగ్రహాల వర్ణన ఎలా ఉంది ? ఈ గ్రహాల మద్య ఉన్న సంభంద బాధవ్యాలు ఏమిటి ? 04 ) ప్రాణం ఉన్న జీవుల వలె ఈ గ్రహాల మధ్య మిత్రత్వం , శత్రుత్వం ఉంటాయా ? వీటికి రాగ ద్వేషాలు ఉన్నాయా ? 05 ) నవ గ్రహాల శాంతి కొరకు గ్రహ దానం , జపములు , పూజలు చేస్తే వాటి శక్తి / బలం తగ్గించటం , జాతకాన్ని సరి చేయటం వాస్తవమేనా ? 06 ) నవగ్రహ పూజలు చేసేవారు గ్రహాలను నేటి వైజ్ఞానికుల అభిప్రాయాలతో ఎకిభవిస్తారా ? 07 ) నవ రత్నాలకు , నవ గ్రహాలకు ఉన్న సంభంధం ఏమిటి ? 08 ) అంకెలకు ఈ గ్రహాలతో ఏమైనా లంకె ఉన్నదా ? 09 ) గ్రహాలకు - బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర కులాలకు ఏమిటి సంభంధం ?