Skip to main content

శ్రీ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి

Sri Jagarllamudi Kuppuswami Choudary

ఎంతో మందికి విద్యాదానం చేసిన గుంటూరు లోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల (1968-2018) 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ కళాశాల (JKC college ) కుప్పుస్వామి గారి పేరిట నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ చే  స్థాపించబడింది. 

కుప్పుస్వామి గారి గౌరవార్దం ఇన్నాళ్ళకు JKC - రింగ్ రోడ్ కూడలిలో వారి కాంస్య విగ్రహం  తమిళనాడు గవర్నర్ శ్రీ కే. రోశయ్య గారిచే 23 -12 -2011 న ఆవిష్కరించబడినది.
జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి:
ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామములో ఒక సంపన్న భూస్వాముల కుటుంబములో జన్మించాడు.మహాదాత మరియు గొప్ప విద్యా,కవి పోషకుడు. రాజకీయ కోవిదుడు. తెలుగు సంస్కృతిని పరిరక్షించుటకు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు, కవి పండితులను ప్రోత్సహించుటకు విశేష కృషి చేశాడు. ఆంధ్రాభ్యుదయోద్యమాలలో ముఖ్య పాత్ర వహించి, 1931లో చెన్నపట్టణములో జరిగిన ఆంధ్ర మహా సభలో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి తీర్మానాన్ని ప్రవేశబెట్టి నెగ్గించాడు.
గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులుగా, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 18 సంవత్సరాలు సేవ చేశాడు.
కావూరు గ్రామములో స్వామి సీతారాం గారి వినయాశ్రమానికి 100 ఎకరాలు దానం చేశాడు. గుంటూరులో ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్ కు భూరి విరాళమిచ్చాడు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను కష్టకాలములో ఆదుకున్నాడు. ఎందరో పేద విద్యార్ధులకు దానాలు చేశాడు.
కవులను ఆదరించి భాషాసేవ చేశాడు.
మైసూరు అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
కవి రాజు త్రిపురనేని రామస్వామి గారి చే ' కుప్పు స్వామి శతకం' రాయించిన హేతువాద ప్రచారకుడు.
కవికోకిల గుర్రం జాషువా కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
"శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
ముగ్గురు శ్రీమంతులు వర్ణ ఖండన విగగ్ధున్ గొనబు పంటల అసామి కుప్పుసామి"

Comments

Popular posts from this blog

జ్యోతిష్యం-నా ఆలోచనలు

జ్యోతిష్యం పై నేను లేవనెత్తిన ప్రతి ప్రశ్న ( సందేహాలకు) కు ముందుగా నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. 1. జ్యోతిషం మనుషులకేనా,పశు పక్షాదులకు కుడా చెప్పగలరా? గ్రహాల ప్రభావం ఈ భూమండలం పై జీవించే ప్రతి ప్రాణి పై ఉంటుందనే జ్యోతిష్య సిద్దాంతం నిజమైతే జాతక చక్రం మనుషులతో పాటు సమస్త జీవ కోటికి ఉండాలి. ప్రతి జీవి తన జన్మ కాలాన్ని బట్టి తన జాతకాన్ని కలిగి ఉండాలి. మరి ఏనాడు ఈ దైవజ్ఞులు మనుషులకు తప్పా ఇతర జీవ జాలానికి జాతక చక్రం రాసిన దాఖలాలు లేవు. పశు పక్షాదుల జనన కాలాన్ని బట్టి వాటి కష్టసుఖాలు, ఆయుషు .... వంటి వాటిని అంచనా వేసి చెప్పే పద్ధతి ఈ శాస్త్రంలో రాయబడ లేదు. బహుశ మనుషులకు తప్పా మిగిలిన జీవాలకు వాటి అవసరం బొత్తిగా లేదనుకుంటా. వాటికి జాతక చక్రం వేసినందువల్ల గిట్టుబాటు కుడా ఉండదు. జ్యోతిష్యం లో అపార పరిశోధనలు చేసేవారు ఈ విషయంలో వేలు ఎందుకు పెట్టలేదో మరి? చేతనైతే ఏదో ఒక జంతువుకు / జీవికి జాతక చక్రం రాసి అది నిజమని నిరూపించాలి.లేదా పశు పక్షాదులకు జ్యోతిష్యం వర్తించదని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే గ్రహాల ప్రభావం కేవలం మనుషులకేనని చెప్పాలి. ...

జల జాతర - పుష్కరాలు

తెలుగునాట ప్రవహించే నదులలో ముఖ్యమైన గోదావరి,కృష్ణ నదులకు పుష్కరాల పేరుతో 12 ఏళ్లకు ఒకసారి పుణ్య స్తానాలు చేయటం ఒక ఆచారంగా కొనసాగుతుంది. ఉప నదులకు ప్రత్యేకంగా పుష్కరాలు జరపరు. వాటికి కూడా ప్రధాన నది తో పాటే పుష్కరాలు వస్తాయి. కానీ కృష్ణ నదికి ఉపనది అయినా తుంగ భద్ర (ఇవి రెండు నదులు) కు ప్రత్యేకంగా పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ఏడాది తుంగభద్ర నదిలో పుష్కరాల పేరుతో  మరొక జల జాతర మొదలౌతుంది. గంగా నదికి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే కుంభమేళల ప్రేరణతో దేశవ్యాప్తంగా మరొక 11 నదులకు కూడా పుష్కరాల పేరుతో జల జాతరలు మొదలైయ్యాయి. దీని కొరకు బృహస్పతి పంచాంగం అని 4332. 5 రోజులకు (11 సంవత్సరాల 10 నెలల 10 రోజులు అంటే దాదాపు 12 సంవత్సరాలు) ఒక ఏడాదిగా భావించే ఒక కాలమానం రూపొందించారు. బృహస్పతి దేవతల గురువు కాబట్టి మన వారు దీన్ని గురు గ్రహం అని పిలుస్తారు. భూ కేంద్ర సిద్దాంతం ప్రాకారం బృహస్పతి భూమిని ఒక సారి చుట్టి రావటానికి 12 సంవత్సరాలు పడుతుంది. బృహస్పతి సూర్యుని చుట్టు తిరిగే మార్గంలో ఉన్న 12 రాశులలో ఒక్కో ఏడాది(361 రోజులు) ఒక్కో రాశిలో ఉన్నట్లు గోచరిస్తుంది. బృహస్పతి కేలండర్ ను (బార్హస్పతి మానం) ప...

వాస్తు గురించి భయపడుతున్నారా ! ఇవి చదవండి.

1.వాస్తు విద్య VAASTHU VIDYA (బృ హత్ సంహితా భాగానికి విశ్లేషణాత్మక తెలుగుఅనువాదం)-2007 జ్యోతిష్య, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట సమకాలికుడు వరాహమిహిరుని చే ఆరోవ శతాబ్దంలో గ్రంధస్థం చేయబడిన బృహత్సంహిత లోని ఒక భాగమే ఈ వాస్తు విద్య. మూల శ్లోకాలతో పాటు వివరణాత్మక తాత్పర్యం ఇవ్వబడినది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్దిక సహకారం తో తొలిసారి వెలువడిన ఈ గ్రంధం మన ప్రాచీన వాస్తు శాస్త్రాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆనాడు వాస్తు పేరుతో చెప్పబడిన విషయాలు ఏమిటి? అవి ఈనాడు ఎంత వరకు ఉపయోగపడతాయన్న విషయం ఈ గ్రంధం ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగులో ప్రాచీన ప్రామాణిక వాస్తు గ్రంధాలు లేని కొరతను ఇది కొంతవరకు తీరుస్తుంది.పేజీలు : 100 2. వాస్తు లో ఏముంది? VAASTHULO EMUNDI? వాస్తు ఫై సమగ్ర పరిశోధనా గ్రంధం - 1997 లేని విషయాన్ని చెప్పటాన్ని అబద్ధం అంటారు. చిన్న విషయాన్ని పెద్దది చేసి భూతద్దంలో చుపటాన్నిఅతిశయోక్తి అంటారు. విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవటాన్ని అవగాహనారాహిత్యం అంటారు. నేడు సమాజంలో విరివిగా అనేక అబద్దాలు, అతిశయోక్తులు వాస్తు పేరుతొ వాస్తవాలుగా చెలామణీ అవుతున్నాయి ఈ అశాస్త్రీయ మైన వ...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 3

వాస్తు పుట్టుక వాస్తు శాస్త్రం ఎప్పుడు పుట్టిందో, అది ఎప్పుడు గ్రంథస్థం చేయబడిందో తెలుసుకోవటానికి కొంత చారిత్రిక పరిశోధన చేయాలి. అయితే రావిపూడి గారు వాస్తు గ్రంథాలన్నీ 10 శాతాబ్దం తరువాతే వచ్చాయనే తలంపుతో వాస్తు 'ఆర్య వాస్తువా?' అంటూ అహేతుక వాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్యులు నివసించిన గంగానది దక్షిణ తీర మైదానంలో (ఆర్యావర్తనం) భూమి ఏటవాలు తూర్పు మరియు ఉత్తర దిశలకూ ఉంది కాబట్టి వర్షపు నీరు, వాడుక నీరు సులభంగా పోవటానికి భూ ఉపరితల నీటి వాలు తూర్పు పడమరలకు ఉండాలనే సూత్రం ఏర్పడి ఉండవచ్చు అనే నా యుక్తీకరణకు అనేక అంశాలు దోహదపడ్డాయి. ఆనాడు నివాస ప్రదేశం వరద ముంపుకు లోనుకాకుండా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో భూ ఉపరితల వాలుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికి వరదలకు, భారీ వర్షాలకు అనేక జనావాసాలు ముంపుకు గురిఅవుతున్న విషయం గమనించే ఉంటారు. క్రీస్తు పూర్వం 1000-1500 సంవత్సరాల మధ్యలో గంగాతీరంలో ఆర్యులు జీవించారని, గుడిసెల్లో గుడారాలల్లో తిరిగిన ఈ దేశదిమ్మెరలకు వాస్తు శాస్త్రం తెలియదని, ఆతరువాత కీ.శ 5 శతాబ్దిలో నాటి జ్యోతిష్య, ఖగోళ గ్రంథాలైన కాలామృతం, బృహత్సంహితాదులలో వాస్తు ఉందన్...

రావిపూడి వెంకటాద్రి గారి 'వాస్తువు శాస్త్రమా ?' పై సమీక్ష- 4

అర్థాలు - అపార్దాలు వాస్తు శాస్త్ర మూల గ్రంథాలన్నీ సంస్కృతం లోనే ఉన్నాయి. నేడది మృత భాష. సంస్కృత భాష విలక్షణమైనది. భాష విస్తృతం కానప్పుడు ఓకే పదం అనేక అర్ధాలతో ప్రయోగించటం సర్వ సాధారణం. సాహిత్య ప్రయోగంలో వాడకలో ఉన్న ఒక పదాన్ని విభిన్న అర్థాలతో వాడటం కవుల కల్పనా శైలికి తార్కాణంగా పేర్కొంటారు. విషయాన్ని బట్టి పదం యొక్క అర్థాన్ని స్వీకరించితే అర్ధవంతమైన భావం సిద్ధిస్తుంది. గణిత, ఖగోళ, వైద్య, వాస్తు ఇత్యాది శాస్త్ర గ్రంధాలలో వాడిన పదాలకు తత్సంబంధమైన శాస్త్ర పరి భాష అర్థాలలో హేతుబద్దమైనవి మాత్రమే అన్వహించుకోవాలి. వాడుక అర్థాలు స్వీకరించ రాదు. వాస్తు శాస్త్రం అనేది మన సమాజంలో ఆదినుండి, ఆధునిక నిర్మాణాలు వచ్చే వరకు తనవంతు తోడ్పాటు అందించిదన్నది వాస్తవం. ఈ కోణంలోనే నిర్మాణ విషయంలో ఉపయోగించిన పదాలకు సాంకేతిక అర్థాలు స్వీకరిస్తే వాస్తుపై మరింత స్పష్టత వస్తుందని చెప్పుతూ నేను రాసిన పుస్తకమే 'వాస్తులో వాస్తవాలు'. ఈ పుస్తకంలో ప్రస్తావించబడిన సాంకేతిక పదాల అర్థాలు రావిపూడి వెంకటాద్రి గారికి కృత్తక అర్దాలుగా, విపరీతార్థలగా కనిపించాయట. వాస్తులో ఉన్న శ్లోకాలు తెలుగు బాగా వచ్చిన వారికి సులభంగా అ...