మహా భారతం లో జూదం ఆడిన ధర్మరాజు రాజ్యం తో పాటు తన ప్రజలు, భార్య,తమ్ములను తన సొంత ఆస్తిలా పణం పెట్టి ఓడి పోయాడు. జూదం ఆడటం ఒక వినోదం గా ఉండాలి అన్న ధ్యాస లోపించి నందువల్లె కురుక్షేత్రం జరిగి అపార ప్రాణ, ధన నష్టం జరిగింది. సరిగ్గా మన రాష్ట్రం లో కుడా రాజకీయ జూదం నడిచింది. అధికారం దక్కటానికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, దానిలోకి అన్ని రాజకీయ పక్షాలను భాగస్వాములుగా చేసి వారిచే తెలుగు తల్లిని పణం గా పెట్టి 'విభజన జూదం' ఆడించారు. దీనికి ముందుగా మొదలపెట్టిన జూదరిగా (ఒకటొవ దుర్యోధనుడు) YSR అయితే శకునిగా కెసిఆర్, ధర్మ రాజుగా చంద్ర బాబు, మిగిలిన దుష్ట చతుష్టయం వంటి పాత్రలను చిన్నా చితకా రాజకీయ నాయకులు (దీనిలో ప్రాంతీయ, రాజకీయ పక్షపాతం లేదు) తమ తమ పాత్రలు తమ శక్తి కొద్ది పోషించారు. దశాబ్దం పాటు ఉత్కంటంగా జరిగిన ఈ రాజకీయ జూదంలో దగాపడి ఓడిన తెలుగు తల్లి వలువలు డిల్లీ దర్బార్ లో సోనియా ఎదుట నిసిగ్గుగా వలసి తెలుగు జాతి న...