Skip to main content

Posts

మన పయనం ఎటు ?

రెండు దశాబ్దాలుగా ఉన్న ఓ ప్రజా నాయకుడు, తొమ్మిది ఏళ్లగా మంత్రి పదవి వెలగబెడుతున్నవ్యక్తి   వేసవి కాలం గుంటూరులో నీటి కరువు ను తీర్చటానికి    స్వంత డబ్బు(?)తో రెండు వాటర్ ట్యాంక్ లు కొని ఓటర్ల/ప్రజలకు కు 'జల దాత' గా పోజుపెడుతున్నాడు. ఎలక్షన్ లో మైలేజి కి బోడి నాటకాలు  ఇలా MLA/ MP   లగా మంత్రులు గా  వీళ్ళు అధికారం లో ఉంది ప్రజలకు కావలిసిన కనీస వసతులు కల్పించాటానికా లేక ప్రజలను పిచ్చి వాళ్ళ గా చూస్తూ  వారి దయా దాక్షిణ్యాల పై బిచ్చగాళ్ళ గా బ్రతకటానికా?   ప్రజల సమస్యలను గాలికి వదిలి అస్తమానం వారిలో మత,ప్రాంత,కుల పరమైన  ఆవేశాలను, ఆవేదనలను  పెంచే ఇలాంటి ప్రజా ప్రతినిధులు మనకు దాపురించినందుకు నేటి మన  ప్రజాస్వామ్యం లో ఉన్న లోపంగానే భావించాలి. అలాగే అందినకాడికి దేశాన్ని,ప్రజలను దోచుకొని దాన్ని దాయటానికి రాజాకీయాలు ఓ మార్గం గా తయారైయింది. విశ్వసనీయ  ప్రజాసేవ పేరుతో విశ్వస రహిత  జైలు రాజకీయాలను నడిపే దోపిడీ  నాయ...

జ్యోతిష్యాన్ని గురించి - M.N.రాయ్

Manavendra Nath Roy (1887–1954) Narendra Nath Bhattacharya  and popularly known as M. N. Roy, was an  Indian  nationalist revolutionary and an internationally known radical activist and political theorist. M.N. Roy was a founder of the Communist Parties in both  Mexico  and  India  and was a delegate to congresses of the  Communist International . Following the rise of  Joseph Stalin , Roy left the mainline  communist  movement to pursue an independent radical politics. In 1940 Roy was instrumental in the formation of the  Radical Democratic Party , an organization in which he played a leading role for much of the decade of the 1940s. Roy later moved away from  Marxism  to become an exponent of the philosophy of  Radical Humanism . రష్యా మరియు భారత్ లో కమ్యునిస్ట్ పార్టీ లను స్థాపించిన తాత్వికుడు,నవ్య మానవవాద రూపకర్త,అపార మేధావి శ్రీ మానవేంద్ర నాద్ రాయ్(M. N. Roy) గారి రచనల్లో ఒకటి 'పిల్లి చెప...

శాస్త్ర,సాంకేతిక,వైద్య రంగాలలో తెలుగెక్కడ?

తెలుగు భాష కలకాలం జీవించి ఉండాలంటే అది జీవన భాషగా అభివృద్ధి చెందాలి. జీవనోపాది కి ఉపయోగపడే భాషగా ఎదగాలి. కేవలం ఇంట్లో మాట్లాడే భాషగా ,రోజువారి పనులకు జరిగే రాత కోతల భాషగా ఉన్నంత మాత్రాన ఒరిగేది శూన్యం.  తెలుగు భాష మనవారికి జ్ఞానాన్ని,విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించే భాషగా, ఉపాధి చూపే అమ్మ భాషగా రుపుదిద్దుకోవాలి. అలా జరగాలంటే శాస్త్ర,సాంకేతిక,వైద్య రంగాలలో అపారంగా ఉన్న విజ్ఞానం తెలుగులో వెలుగు చూడాలి. అలా అని ఆయా శాస్త్ర సాంకేతిక పదాలకు సంస్కృతంలో లేక కుత్రిమ తెలుగులోకి  తర్జుమా చేసి దానిని మరింత క్లిష్టంగా,గందరగోళం గా తయారు చేయటం కాదు. మన తెలుగుభాష ఒక విశిష్టమైనది. ఏ భాషా పదాన్నిఅయినా తనలో ఇట్టే ఇముడ్చుకొనే లక్షణం దానికి ఉంది. కాబట్టి శాస్త్ర,సాంకేతిక,వైద్య రంగాలలో ఉన్న విజ్ఞానం సరళ తెలుగులో వచ్చేలా నిర్విరామ కృషి చేయాలి. సాంకేతిక పదాలకు సరైన తెలుగు పదం లేకపోతే వాటిని యధాతధంగా వాడి  సాదారణ బాషలో అనువాదం చేయాలి. ఉదాహరణకు రైలు బండిని 'ధూమ శకటం/ పొగ బండి ' అని రాయటం సరైన అనువాదం కాదు. ఇప్పుడు బొగ...

యుగాంతం - షరా మామూలే !

యుగాంతం అనే ఊహ మనిషిలో భయాందోళన పుట్టిస్తుంది అనుటలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ పేరుతో ప్రతిసారి ప్రజలలో అశాంతిని,అలజడిని పుట్టించటం క్షతవ్యం కాదు. మెక్సికో లోని పురాతన పంచాంగం 'మయన్ క్యాలెండర్' 21-12-2012 న పూర్తి అయిపోతుందని, కాబట్టి ఈ భూమి అంతరించి పోతున్నదనేది ఈ పుకారు వెనుక ఉన్న కారణం.డిసెంబర్ 31 న క్యాలెండరు అయిపోతే కొత్త దానిని తెచ్చి ఇంట్లో తగిలించుకుంటాం. ఉగాదికి పాత పంచాంగాన్ని పక్కన పెట్టి కొత్త పంచాంగాన్ని వాడతాం. ఇదీ అంతే. కాకపోతే మయన్ క్యాలెండర్ 5123 రోజులకు రుపొందించ బడినది. ఇది ఎలాంటిది అంటే మన వాళ్ళు సరదాగా 100 ఏళ్లకు లేకపోతే 1000 ఏళ్లకు సరిపడే క్యాలెండర్ తయారి చేస్తారే అలాంటిదన్న మాట. మన తెలుగు సంవత్సరాలకు కుడా  ప్రభవ,విభవ...అంటూ 60 పేర్లు వరుసగా వచ్చి అవి అవిపోయిన తరువాత తిరిగి మొదటి పేరుతో మొదలు పెడతాం. ఈ చిన్న సూత్రం అర్ధం అయితే యుగాంతం లో ఉన్న గుట్టు రట్టు అవుతుంది. ప్రతి రోజు సూర్యుడు అస్తమించే వేళ ఒక మనిషిని సూర్యునికి బలి ఇస్తేనే మరునాడు తిరిగి ఉదయిస్తాడని నమ్మే మాయన్ జాతికి యుగాంతం గురించి చెప్పే జ్ఞానం ఉందనుకోవటం, దానిని నమ్మటం ఏ...

ఈ రాష్ట్రం ఎర్రి పుచ్చకాయలు తిన్నట్లుంది !

పిచ్చి తల కేక్కితే ... తలకి రోకలి చుట్టమని అన్నాడట , వెనకటకో పెద్ద మనిషి.  అలాగే ఒక మంచి వ్యక్తి పిచ్చిగా ప్రవర్తించితే వెర్రి పుచ్చకాయలు తిన్నాడేమో అనే సందేహం కలగటం సహజం. ఎర్రి పుచ్చకాయలు అనేవి అసలు ఉన్నాయో లోవో తెలవదు కాని, ఆకారణం గా  పిచ్చి పట్టటానికి వీటిని తినటం కారణంగా మన పిచ్చి పెద్దలు ఒకానొక పిచ్చి వేళ లో గట్టిగా సెలవిచ్చారు. లేకపోతే నిట్టనిలువున ఒక వ్యక్తికి మెదడు చెడి తిక్కతిక్కగా ప్రవర్తించటం  ఎందుకో వారికి ఓ పట్టాన అర్ధం కాలేదు. ఇప్పటిలా పిచ్చి కుదిరించే పిచ్చి ఆసుపత్రులు/  పిచ్చి డాక్టర్స్  ఆనాడు లేరు  కాబట్టి, బూత వైద్యులు మాత్రమే వారికి దిక్కుకాబట్టి, పిచ్చి కుదరటానికి ' బడిత పూజ'  మంచి మందుగా తేల్చారు. మొదట అమ్మాయల పిచ్చి ఉన్న వాడికి పెళ్లి అయితే పిచ్చి కుదురుతుందనేవారు.ఆ తరువాత ప్రతి పిచ్చికి 'పెళ్లి' అయితే పిచ్చి కుదురుతుంది అనేదాకా పోయి ...చివరకు పిచ్చి కుదిరితేనే పెళ్లి జరుగుతుందని ముక్తాయుంపు చెప్పారు. అదేదో సినిమాలో 'పిచ్చి రకరకాల పిచ్చి ... ' అని పిచ్చి గాయని రాగయుక్తం గా పాడే పి...

కల్ల బొల్లి బల్లి శాస్త్రము

జ్యోతిష్యం లో 'శకునం' ఒక భాగం గా చెపుతారు. జరగబోయే శుభాశుభాల గురించి చెప్పే ఈ శకునాలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో మన ఇంటిలో తిరిగే బల్లి  చెప్పే శకునం  ఒకటి. బల్లి చేతలకు అర్ధాలు వేరులే అంటూ   ఇంటిలో తిరిగే బల్లి పొరపాటున మనుషులపై   పడితే దాని వలన కలుగు శుభా శుభములు గురించి చెప్పే ఒక కుహానా శాస్త్రం ఒకటి ఉంది. దానిలో చెప్పిన విషయాలు బహు విడ్డురంగా ఉన్నాయి. పలితాలలో స్త్రీ,పురుష బేధాలు ఉన్నాయి. ఈ ఫలితాలు చూసి భయపడే వారికి ఒక విరుగుడు చిట్కా ఉంది.  శ్లో !! పల్లీసరటయోః రూపమ్ సువర్ణెన వినిర్మితం ! వస్త్ర యుగ్మెన సంవేద్య బ్రాహ్మాణాయ నివేదయే త్ !! బల్లి కాని, తొండ కానీ పొరపాటున శరీరం పై పడితే వాటి ఆకారములో బంగారం తో  బొమ్మ చేసి దాన్ని ఒక జత బట్టలలో పెట్టి బ్రాహ్మణుడికి దానం చేస్తే దోషం పోతుందని కృత్య మంజరి అనే గ్రంధం లో ఉంది.  ఇది చాల వ్యయంతో కూడినది కాబట్టి మరొక చౌక మార్గం కంచిలో ఉంది. ఇదేమంటే ..   కంచిలో వరదరాజ  పెరుమాళ్ళు అనే దేవాలయం ఉంది. ఆ గుడిమండపం పై  కప్పులో   ...

గణపతి ఉత్సవాలు- జ్ఞాన సభలు

ఆనాడు బాలగంగాధర తిలక్ మహాశయుడు ప్రజలలో స్వేచ్చ స్వతంత్ర భావాలు రాగాల్చటానికి గణపతి ఉత్సవాలు మొదలు పెట్టితే నేడు అవి ఒక మత క్రతువుగా, సమాజానికి ఒక గుది బండగా మారాయి. చందాల పేరుతో దండుకోవటం, ఊరేగింపుల పేరుతో తాగి తన్దనాలడటం నేడు ఒక తంతు గా మారింది.  వీటికి విభిన్నంగా కృష్ణ జిల్లా పెడన గ్రామం లో చేనేత కార్మికులు  'శ్రీ విఘ్నేశ్వర కోలాట భజన సంఘం' పేరుతో  గత 60 సంవత్సరాల నుండి నిర్విజ్ఞంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  ఉత్సవ నిర్వాహకులు  భక్తి శ్రద్దలతో గణపతి పూజల తో పాటు ప్రతి రోజు ఒక సమకాలీన అంశం పై 'జ్ఞాన సభ' జరుపుతూ లోకమాన్య తిలక్ గారి స్పూర్తి ని కొనసాగించటం నిజంగా అభినందించ వలసిన విషయమే. శ్రీ విఘ్నేశ్వర కోలాట  భజన సంఘం, పెడన  వారు 23-09-2012 ఆదివారం నాటి జ్ఞాన సభలో నన్ను  'వాస్తులో వాస్తవాలు'   గురించి ప్రసంగించ వలిసినదిగా కొరటం హేతువాది అయిన  నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు నన్ను ఆహ్వానించిన ఉద్దేశ్యం తెలిసి సంతోషం కలిగింది. పూర్ణకుంభ స్వాగతంతో  సభావేదిక పైకి ఆహ్వానించారు....