Skip to main content

Posts

నక్షత్రాలు - జాతకాలు

జ్యోతిష్యం లో నక్షత్రాల పాత్ర , దాని శాస్త్రీయతను తెలుసుకుంటే గాని జాతకాల అసల గుట్టు అర్దం అవదు. 1. ఆకాశంలో మనకు కనపడే నక్షత్రాలు ఎన్ని? కనపడనవి ఎన్ని? వాటిలో జ్యోతిష్య శాస్త్రం లో ప్రస్తావించిన 27 నక్షత్రాలకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? 2. జన్మ నక్షత్రానికి, నామ నక్షత్రానికి, జాతకాలకి ఉన్న సంభందం ఏమిటి? జన్మ నక్షత్రాన్ని బట్టి బిడ్డ పేరుఎందుకుండాలి? 3. నక్షత్రాలను 12 రాశులగా ఎందుకు విభజించారు? వాటి కి మేషం, వృషభం... వంటి పేర్లు ఎందుకు పెట్టారు? చైనావారి రాశులకు వాటికి తేడాలు ఎందుకున్నాయి? 4. రాశి ఫలాలు, గ్రహ ఫలాలు ఒకటేనా? 5. పుట్టిన తేదిని బట్టి జన్మ రాశి ని నిర్ణయించటం ఒప్పు అవుతుందా? 6. ప్రపంచ జనాభా 700 కోట్ల మంది అంతా ఈ 12 రాశులలో ఉంటారు కదా , అందరి జాతకాలు ఇంచు మించు 12 విధాలగా ఉంటుందా? పత్రికలలో ప్రచురించే రాశి ఫలాలు సరైనవేనా? 7. నక్షత్రాల నుండి వచ్చే కాంతి మనకు చేరటానికి పట్టే సమయం గురించి జ్యోతిష్య శాస్త్రం లో ఏమైనా చెప్పబడిందా? 8. కాలం గడిచే కొద్ది భూ అక్షం లో వచ్చే మార్పులు (ప...

జ్యోతిష్యం-నవ గ్రహాలూ

జ్యోతిష్యాని ప్రాణం పోసే నగ్రహాల గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలిసిన విషయాలు ఉన్నాయి . వాటిలో ముఖ్య మైన వాటిని కొద్దిగా పట్టి చూద్దాం . 01 ) నవ గ్రహాలుగా పిలవబడే వాటిలో గ్రహాలు నిజంగా ఎన్ని ? 02 ) ఈ గ్రహాలు జడములా ? చైతన్యములా ? 03 ) పురాణాలలో నవగ్రహాల వర్ణన ఎలా ఉంది ? ఈ గ్రహాల మద్య ఉన్న సంభంద బాధవ్యాలు ఏమిటి ? 04 ) ప్రాణం ఉన్న జీవుల వలె ఈ గ్రహాల మధ్య మిత్రత్వం , శత్రుత్వం ఉంటాయా ? వీటికి రాగ ద్వేషాలు ఉన్నాయా ? 05 ) నవ గ్రహాల శాంతి కొరకు గ్రహ దానం , జపములు , పూజలు చేస్తే వాటి శక్తి / బలం తగ్గించటం , జాతకాన్ని సరి చేయటం వాస్తవమేనా ? 06 ) నవగ్రహ పూజలు చేసేవారు గ్రహాలను నేటి వైజ్ఞానికుల అభిప్రాయాలతో ఎకిభవిస్తారా ? 07 ) నవ రత్నాలకు , నవ గ్రహాలకు ఉన్న సంభంధం ఏమిటి ? 08 ) అంకెలకు ఈ గ్రహాలతో ఏమైనా లంకె ఉన్నదా ? 09 ) గ్రహాలకు - బ్రాహ్మణ , క్షత్రియ , వైశ్య , శూద్ర కులాలకు ఏమిటి సంభంధం ?

జ్యోతిష్యం పై పెద్దలేమన్నారు? పార్ట్ 2

" ఎవరో చెప్పారనో .. వెనకటి నుండి వస్తున్న ఆచారమనో , లేక నీ అంతటకు నీవే ఉహించుకునో ఎ విషయాన్ని గుడ్డిగా నమ్మకు . గురువు పై నమ్మకం ఉన్నా కుడా , ఆయన చెప్పిన విషయాలు మూడం గా ఆచరించకు . సూక్ష్మం గా పరిశీలించి , క్షుణ్ణం గా విశ్లేషించి సర్వ మానవాళి కి శ్రేయస్సును కాక్షించే సూత్రాన్ని మాత్రమే విశ్వసించు . దానినే పాటించు . అదే మార్గంలో పయనించు ." --- గౌతమ బుద్ద " జ్యోతిష్యం పై పెద్దలేమన్నారు " అనే వ్యాసంలో నేను ఉదహరించిన పెద్దల పలుకులకు ఆధారాలను గురించి చెప్పమని కొంతమంది కామెంట్స్ లో రాసారు . అలాగే నేను కొంతమంది ఆస్తిక ప్రముఖుల అభిప్రాయాన్ని ప్రస్తావించటం కుడా వారికి నచ్చినట్లు లేదు . అందుకే బుద్దుని పై పలుకులు ఇక్కడ మరో సారి మనం చేసుకొని అసలు విషయానికి వద్దాము . జ్యోతిష్యం ఆస్తిక వాదానికి వేతిరేకమని , అది దైవాన్ని , కర్మ సిద్దాంతాన్ని తప్పు గా చేపుతుందన్న ఆస్తిక ప్రముఖులు మాటలను ఉదాహరించటం జరిగింది . ఇది ఆస్తిక ముసుగులో దాగిఉన్న మూఢ విశ్వాసమని స్వామి వివేకానంద , స్వా...

జ్యోతిష్యం ప్రసాదించే యోగాలు ఏమిటి ? ( పార్ట్-2 )

సంతాన యోగం : జాతక ఫలాలలో ఇది ఒక ముఖ్య అంశం . దంపతులలో పురుషుని జాతక రీత్యా అతనికి కలగబోయే సంతానం గురించి చెపుతారా ? అతని బార్య జాతక ఫలం చూసి చెపుతారా ? బార్యా భర్తల ఇద్దరి జాతకాలలో ఒకే విధమైన సంతాన యోగం ఉంటుందా ? అలా లేకపోతే సంతానం ఎలా లెక్కిస్తారు ? కుటుంభ నియంత్రణ పాటించే దంపతుల మాటేమిటి ? అలాగే వైద్యుల సలహాలతో పిల్లలను కనేవారి జాతకాలు ఎలా ఉంటాయో చెప్పగలరా ? బహు బార్యలు గల వ్యక్తి కి ఎ బార్య ద్వారా ఎంత మంది సంతానం కలుగుతుందో నిర్దారించ గలరా ? జాతకాన్ని బట్టి ఒకనికి పుట్టే మొదటి బిడ్డ ఆడో , మగో కచ్చితంగా చెప్పగలరా ? జీవన యోగం: ( ఆయు ప్రమాణం) పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు . అయితే అది ఎంత కాలమనేది అనేక పరిస్థితులను బట్టి ఉంటుంది . ఒక దేశం లో మనుషుల సగటు ఆయు ప్రమాణం ఆ దేశ జీవన ప్రమాణాలపై ఆధార పడి ఉంటుందనేది శాస్త్రీయంగా చెప్పబడిన విషయం . ఈవిషయంలో జ్యోతిష్య విద్య ఏమి అంటుందో తెలుసుకోవాలి . జాతకుని ఆయు ప్రమాణం ఎలా లెక్కిస్తారు ? మన దేశంలో సగటు ఆయు ప్రమాణం పెరగటాని...

జ్యోతిష్యం ప్రసాదించే యోగాలు ఏమిటి ?

జ్యోతిష్యం లో ఫలితాలు చెప్పేటప్పుడు జాతకునికి రకరకా ల యోగాలు వస్తాయని లేదా నడుస్తున్నాయని చెపుతారు . వాటిని కొద్దిగా పట్టి చూద్దాం . వాహన యోగం : పూర్వం కాలి నడకన ప్రయాణం చేసే జనానికి గుర్రమో , గాడిదో లభిస్తే , లేదా రాజు గారి కొలువులో వాహనాల పై తిరిగే నౌకరి దొరికితేనో వచ్చేదే ఈ వాహన యోగం . ఈ నాడు ప్రతి వారు స్వంతంగా సైకిలో , బైకో , కారో కొనుక్కుంటున్నారు . లేదా అద్దెకో , అరువుకో వాహనాల పై ప్రయాణించేవారు , బస్సులోనో , రైలులోనో , విమానం లోనో వెళ్ళే వారందరికీ గ్రహాలూ వాహన యోగం చాల ఉదారంగా ప్రసాదిస్తునాయన్న మాట . నిజానికి మనుషులందరికీ వాహన యోగం ప్రసాదించినది ఈనాడు మనం సంపార్జించిన సాంకేతిక విజ్ఞామే కాని గ్రహాల దయ ఏమి లేదన్నది మనం అంగికరించ వలిసిన పచ్చి నిజం . జ్యోతిష్యం చెప్పే వాహన యోగం మరి ఈ నాడు ఎలా అన్వహిస్తుందో దైవజ్ఞులు సెలవియ్యాలి . ప్రవాస యోగం : ఉన్న ఊరిలొ బతకలేక , కస్టాలు పడలేక బార్య బిడ్డలను , కుటుంభాన్ని వదిలి పరదేశాలకు వెళ్ళే దౌర్బాగ్య స్థితిని జ్యోతిష్యం లో ప్రవాస యోగం గా చె...

పప్పన్నాలతో వచ్చే ముప్పు - 2

ఇదే శీర్షికతో ఇంతకు ముందు ఒక టపా రాసాను.ఆ టపాలో చెప్పిన ఆహార దుబార ( విందుల పేరుతొ జరుగుతున్న ) కు ఓ చక్కటి పరిషక్కారం ఇప్పుడు దొరికింది . వెంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందని ... నా ముందు టపా లో వాపోతే , మన సానియా పెళ్లి నా ఆందోళనకు ఒక పరిష్కార మార్గం చూపెట్టింది . ఇక్కడ ఘనంగా పెళ్లి చేసుకొన్నసానియా తన పాకిస్తాన్ పెనిమిటి షోయబ్ మాలిక్ ఇంటికి వెళ్లి అక్కడ ఎంచక్కా పెళ్లి విందులతో అందరిని అలరిస్తున్నది . అయితే మనలాగా పెళ్లి విందులలో రకరకాల రుచులతో షడ్ర శోపేత భోజనాలు అతిధులకు వడ్డించటం పై పాకిస్తాన్లో నిషేధం ఉన్నదట. నిన్న లాహోరు లో సానియా షోయబ్ ల ' వలిమ ' ( పెళ్లి కొడుకు తరుపు వారు ఇచ్చే విందు ) లో అతిదులకు ' కోడి కుర్మా' ఒక్కటే వడ్డించారని వార్త . పెళ్లి విందులలో ఒక డిష్ కంటే ఎక్కువ ఉండరాదని అక్కడ చట్టాలు చేసారట . డబ్బు ఉన్నా అందరికి ఇదే రూలు వర్తిసుంది . ఎంత బాగుంది ఈ నియమం . దీన్ని మన దేశంలో కుడా అందరికి వర్తించేలా కటినమైన చట్టం చేసుకుంటే ముందు ముందు మన కు వచ్చే ఆ...

పప్పన్నాలతో వచ్చే ముప్పు

నిన్న ఒక్క హైదరాబాదు లోనే దాదాపు పది వేల పెళ్ళిళ్ళు జరిగాయట . ఈ లెక్కన రాష్ట్రం మొత్తం లో , అలాగే దేశం లో ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయో మరి . ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చి నట్లు ... ఈ పెళ్ళిళ్ళ గొడవ మన పొట్ట లు మాడ్చేలా ఉంది . ఈ మధ్య ఇండియా వాళ్ళు , చైనా వాళ్ళు తెగ తింటున్నారని అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఆహార సమస్య వచ్చిందని అమెరికావాడు అంటే , ఆవేశం వచ్చి నానా మాటలతో గోల చేసాం . నిజానికి నిదానంగా ఆలోచిస్తే అమెరికా వాడి మాటలు అక్షర సత్యాలు అవుతాయోమన్న భయం ఇప్పుడు జరుగుతున్న పప్పు అన్నాల ( పప్పు కూడులు ) తీరు తెన్నులు చూస్తే మనకి ( నా బోటి వారికి ) కలగటం లో తప్పు లేదు . పెళ్ళిళ్ళ సీజనులో కూరగాయలు అన్ని గుంప గుత్తం గా విందు భోజానాలకు ఖర్చు అయి మార్కెట్టులో సామాన్యులకు లభించే పరిస్తితులు పోయాయి . నియో రిచ్ తెగ వారు తమ డాబు , దర్పం చూపటానికి విందులకు డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు పెడుతున్నారు . వారు చేసే ఈ విందు భోజనాలల్లో ఆహార పదార్దాల దుబార దేశంలో ఆహార ద్రవ్యోల్బణం కు దారి తీస్తుంది . ఉన్న వా...