Skip to main content

Posts

హేతువాదం ఎందుకు ?Hetuvaadam Enduku?

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు "హేతువు" లేదా "కారణం" అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. (Rationalism, a philosophical position, theory, or view that reason is the source of knowledge) అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం. స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత. హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం. హేతువాదం సమాజంలో బలంగా ఉంటేనే ప్రగతిని సాధించగలం. మూడనమ్మకాలు,అశాస్త్రీయమైన భ...